IPL 2023లో నయా సిక్సర్ కింగ్ జీతం ఎంతో తెలుసా? చూస్తే అయ్యో పాపం అంటారంతే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 13వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని ఐకానిక్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ వీరోచిత ప్రదర్శన KKR అభిమానులందరికీ చిరస్మరణీయంగా నిలిచింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 13వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని ఐకానిక్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ వీరోచిత ప్రదర్శన KKR అభిమానులందరికీ చిరస్మరణీయంగా నిలిచింది. KKR స్ట్రైక్‌కి వచ్చేసరికి చివరి ఐదు బంతుల్లో విజయానికి 28 పరుగులు అవసరం. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను ముగించడానికి రింకు అప్పటికే ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. కానీ, అతను వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి తన జట్టును గెలిపించాడు. బౌలర్ యశ్ దయాల్‌ను చితక్కొట్టాడు.
దీంతో KKR శిబిరంలో సంబరాలు విపరీతంగా జరిగాయి. ఈ అద్భుత ఇన్నింగ్స్ నుంచి రింకూ సింగ్ ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. ఆసక్తికరంగా, IPL 2023లో అతని జీతం తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఫ్రాంచైజీలు కొంతమంది సూపర్‌స్టార్ క్రికెటర్‌లకు భారీ మొత్తంలో చెల్లిస్తున్నప్పటికీ, కొన్ని సమయాల్లో తక్కువ సంపాదించే రింకూ సింగ్ వంటి బ్యాటర్‌లు జట్టుకు మ్యాచ్ విన్నర్లుగా మారుతుంటారు. IPL 2022 మెగా వేలంలో రింకూ సింగ్‌ను రూ. 55 లక్షలకు కేకేఆర్ దక్కించుకుంది. అంటే ఐపీఎల్ 2023లో రింకూ సింగ్ జీతం రూ. 55 లక్షలు అన్నమాట.
అయితే, ఐపీఎల్ 2018లో రూ. 80 లక్షలు అందుకున్నాడు. అయితే, తాజాగా అతని జీతంలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. కానీ, ఆ సమయంలో క్రికెటర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతని కెరీర్ కూడా గాయాలతో దెబ్బతింది. ఈ 25 ఏళ్ల క్రికెటర్‌కు తగినంతగా అవకాశాలు రాలేదు. కొన్నిసార్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐపీఎల్ 2022 నుంచి పరిస్థితులు మారాయి. ఎందుకంటే అతను గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతుల్లో అజేయంగా 42 పరుగులు చేశాడు. అలాగే అతను ఆదివారం చివరి ఐదు బంతుల్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి KKRని గెలిపించాడు.




మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..