AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs LSG Playing 11: రికార్డులేమో విరాట్ వైపు.. అంచనాలేమో రాహుల్ వైపు.. ప్లేయింగ్ XIలోనూ తగ్గేదేలే అంటోన్న టీంలు..

LSG vs RCB: ఐపీఎల్ 2023లో ఈరోజు రాత్రి 7.30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆర్‌సీబీ సొంత మైదానంలో జరగనుంది.

RCB vs LSG Playing 11: రికార్డులేమో విరాట్ వైపు.. అంచనాలేమో రాహుల్ వైపు.. ప్లేయింగ్ XIలోనూ తగ్గేదేలే అంటోన్న టీంలు..
Lsg Vs Rcb
Venkata Chari
|

Updated on: Apr 10, 2023 | 4:31 PM

Share

LSG vs RCB Head to Head: ఐపీఎల్‌లో నేడు (ఏప్రిల్ 10), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు జరగనుంది. ఈ రెండు జట్లు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ముఖాముఖిగా తలపడనున్నాయి. ఈ పోటీ హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్నారు. రెండు జట్లు సమానంగా ఇందుకు కారణం.

IPL 2023లో RCB ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ఏకపక్ష ఓటమిని చవిచూసింది. మరోవైపు ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయం సాధించింది. ఇటువంటి పరిస్థితిలో, లక్నో జట్టు తన విజయాల పరంపరను కొనసాగించాలనుకుంటుంది. అలాగే బెంగళూరు జట్టు తిరిగి విన్నింగ్ ట్రాక్‌లోకి రావడానికి ప్రయత్నిస్తుంది.

హెడ్​టు హెడ్ రికార్డ్స్..

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, ఎల్‌ఎస్‌జీ మధ్య ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఐపీఎల్ 2022లో RCB ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో లక్నోపై 18 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో RCB విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఈరోజు గెలుపు ఎవరిదో?

నేటి మ్యాచ్‌లో ఇరు జట్లూ సమానంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్ల బ్యాటింగ్, ఫాస్ట్, స్పిన్ బౌలింగ్‌లో సమతూకం ఉంది. అయితే టీమ్‌లో ఆల్‌రౌండర్ల పరంగా మాత్రం ఆర్‌సీబీ కాస్త ముందంజలో ఉంది. RCBలో షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్ వంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. అలాగే వనిందు హసరంగా, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ వంటి బౌలర్లు కూడా బ్యాట్‌ను ఎలా స్వింగ్ చేయాలో తెలుసు. మరోవైపు, లక్నోలో కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, కైల్ మేయర్స్ ఆల్ రౌండర్ల పాత్రలో ఉన్నారు.

రెండు జట్లలో ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్.

లక్నో సూపర్‌జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మైయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్/క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్/అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, అవేశ్ ఖాన్/జయ్‌దేవ్ ఉనద్కత్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..