AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: వేలంలో రూ.7.75 కోట్లు.. కట్‌చేస్తే.. ఒకే ఒక్క నిర్ణయంతో దారుణంగా పడిపోయిన కెరీర్..

RR VS PBKS: 8వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో జట్టు చాలా నష్టపోయింది.

IPL 2023: వేలంలో రూ.7.75 కోట్లు.. కట్‌చేస్తే.. ఒకే ఒక్క నిర్ణయంతో దారుణంగా పడిపోయిన కెరీర్..
Devdutt Padikkal
Venkata Chari
|

Updated on: Apr 06, 2023 | 3:21 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్ల తలరాతలు రాత్రికి రాత్రే మారిపోతాయి. తరచుగా ఈ లీగ్‌లో ఆటగాళ్ళు ర్యాంక్‌ల నుంచి రారాజులుగా మారిపోతుంటారు. కానీ, కొంతమంది ఆటగాళ్లలు మాత్రం దీనికి విరుద్ధంగా మారిపోతుంటారు. దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పేరుగాంచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలానే ఉంది. ఈ ఆటగాడు ప్రస్తుతం పేలవమైన ఫాంతో సతమతమవుతున్నాడు. పడిక్కల్‌ను 2022 సంవత్సరంలో రాజస్థాన్ రూ. 7.75 కోట్ల భారీ ధరతో కొనుగోలు చేసింది. అత్యధిక ధర పొందినా.. ఆ ప్రైజ్‌కు న్యాయం చేయలేకపోతున్నాడు.

పడిక్కల్ 2020లో IPL అరంగేట్రం చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఆటగాడిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. పడిక్కల్ తన మొదటి సీజన్‌లో అద్భుతాలు చేశాడు. ఈ ఆటగాడు 15 మ్యాచ్‌ల్లో 473 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌లో 5 అర్ధ సెంచరీలు వచ్చాయి. తర్వాతి సీజన్‌లోనూ 14 మ్యాచ్‌ల్లో 411 పరుగులు చేసిన పడిక్కల్.. ఓ సెంచరీ కూడా సాధించాడు. ఈ సీజన్ తర్వాత పడిక్కల్ లక్ మారిపోయింది. ఐపీఎల్ వేలంలో అతనిపై కోట్ల వర్షం కురిసింది.

రూ.7.75 కోట్లు దక్కించుకున్న పడిక్కల్‌..

పడిక్కల్ IPL 2022 వేలంలోకి అత్యధిక ధర అందుకున్నాడు. RCB, ముంబై, రాజస్థాన్ వంటి జట్లు అతనిని కొనుగోలు చేయడానికి తీవ్రంగా పోటీపడ్డాయి. రూ. 4 కోట్ల ప్రైజ్ తర్వాత RCB వెనక్కు తగ్గింది. ముంబై, రాజస్థాన్ మధ్య రేసు కొనసాగింది. చివరికి ఈ ఆటగాడిని రాజస్థాన్ రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పడిక్కల్ ఖాతాలో కోట్ల వర్షం కురిసింది. కానీ, ఇక్కడి నుంచి అతని బ్యాట్ బలహీనంగా మారింది.

బ్యాటింగ్ ఆర్డర్ మారింది.. పరుగులు ఆగిపోయాయి..

రాజస్థాన్ రాయల్స్ పడిక్కల్‌కు కొత్త పాత్రను అందించింది. ఓపెనింగ్‌కు బదులుగా అతనికి 3, 4 నంబర్‌ల బాధ్యతలు అందించింది. దీంతో పడిక్కల్ బ్యాటింగ్ పట్టాలు తప్పింది. 2022లో 17 మ్యాచ్‌ల్లో పడిక్కల్ 376 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని బ్యాట్‌లో కేవలం 1 అర్ధ సెంచరీ మాత్రమే వచ్చింది. పడిక్కల్ స్ట్రైక్ రేట్ కూడా 122గా ఉంది. ఇప్పుడు ఈ సీజన్‌లోనూ మిడిలార్డర్‌లో పడిక్కల్‌కు అవకాశం కల్పిస్తున్నారు.

పంజాబ్ కింగ్స్‌పై పడిక్కల్ మిడిలార్డర్‌లో కూడా బ్యాటింగ్ చేయలేకపోయాడు. 26 బంతుల్లో అతని బ్యాట్‌లో 21 పరుగులు మాత్రమే వచ్చాయి. స్ట్రైక్ రేట్ 80.77 మాత్రమే. గౌహతి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. కానీ పడిక్కల్ బ్యాట్ నిశ్శబ్దంగా కనిపించింది. బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడంతో.. ఈ ఆటగాడిపై ఎఫెక్ట్ పడింది. ఇదే స్థానంలో ఇలానే కొనసాగితే, ఈ ఆటగాడి పరిస్థితి మరింత దిగజారుతుంది.