Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: 13 మ్యాచ్‌ల్లో 333 పరుగులు.. కెప్టెన్‌గా అట్టర్‌ ప్లాప్.. కానీ..!

కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమితో ఈ ఐపీఎల్ సీజన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్..

IPL 2023: 13 మ్యాచ్‌ల్లో 333 పరుగులు.. కెప్టెన్‌గా అట్టర్‌ ప్లాప్.. కానీ..!
Kkr
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 06, 2023 | 10:18 AM

కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమితో ఈ ఐపీఎల్ సీజన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నుముక గాయం కారణంగా టోర్నమెంట్ అంతటికి దూరమయ్యాడు. అతడి స్థానంలో కేకేఆర్ ఫ్రాంచైజీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నితీష్ రాణాను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. 2017లో 13 మ్యాచ్‌ల్లో 333 పరుగులు చేసి.. జట్టుకు పలు విజయాల్లో కీలక పాత్ర పోషించడంతో నితీష్ రాణా.. ఆ సమయంలో లైంలైట్‌కు వచ్చాడు.

కొత్త కెప్టెన్.. కొత్త సీజన్.. కచ్చితంగా ఈ రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన కేకేఆర్.. ఐపీఎల్ 2023ని విజయంతో ఆరంభిస్తుందని అనుకున్నారు. కానీ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా నితీష్ రాణా ఫెయిల్ అయ్యాడని విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఆ జట్టు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మాత్రం.. తన మద్దతు రాణాకే ఉంటుందని స్పష్టం చేశాడు. అంతేకాదు జట్టులో ఉన్న మిగిలిన ఆటగాళ్ళకు కూడా అతడిపై నమ్మకం ఉందన్నాడు.

‘నితీష్ రాణా కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. అతడిపై పెద్ద బాధ్యత ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే దాని గురించి నేర్చుకుంటున్నాడు. బహుశా మున్ముందు తన స్వంత ఆలోచనలను కూడా జోడిస్తాడు. ఇక్కడ కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. నితీష్ కూడా ఆ దిశలో పయనించగలడని నేను భావిస్తున్నాను. నితీశ్‌కు జట్టు నుంచి, అలాగే మా వైపు నుంచి కూడా పూర్తి మద్దతు ఉంది’ అని శార్దూల్ ఠాకూర్ న్యూస్ 9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపాడు. అంతేకాదు.. తన సహచర ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై కూడా అతడికి ఫోన్ చేసి తెలుసుకున్నట్లు ఠాకూర్ తెలిపాడు.

కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 2021 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే గత సీజన్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది టాప్ 2లో నిలవాలనే లక్ష్యంతో.. మేమంతా ముందుకు వెళ్తున్నామని కేకేఆర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వివరించాడు. “మైదానంలో మంచి ప్రదర్శన ఇవ్వడానికే జట్టు ముందు ఉంటుంది. ఒక జట్టుగా, మేము మొదటి రెండు స్థానాల్లో నిలిచి, క్వాలిఫైయర్ 1 ఆడి, విజయం సాధించి, ఆపై ఫైనల్‌కు చేరుకుంటామని” భావిస్తున్నట్లు అతడు పేర్కొన్నాడు.

అయితే రాబోయే మ్యాచ్‌ల గురించి ఇప్పుడే ప్రస్తావించడం కరెక్ట్ కాదు.. మేము లోటుపాట్లు అన్ని కూడా సరిదిద్దుకోవాలి. కానీ వ్యక్తిగతంగా, నేను జట్టు కోసం ట్రోఫీని అందించాలనుకుంటున్నా. జట్టులోని ఆటగాళ్ల నుంచి మేనేజ్‌మెంట్ వరకు అందరూ కూడా ఇదే లక్ష్యంతో ఉన్నారని ఠాకూర్ వెల్లడించాడు.