IPL 2023: అప్పుడు కోహ్లీని భయపెట్టాడు.. ఇప్పుడు 4 ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. ఎవరంటే?

అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్..

IPL 2023: అప్పుడు కోహ్లీని భయపెట్టాడు.. ఇప్పుడు 4 ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. ఎవరంటే?
Nathan Ellis
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 06, 2023 | 9:34 AM

అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్. శిఖర్ ధావన్ సారథ్యంలోని ఈ జట్టు తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించగా.. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆ ఫ్రాంచైజీకి చెందిన ముగ్గురు కీలక ఆటగాళ్లు ఈ గెలుపులో భాగస్వాములు కాగా.. వారిలో ఓ బౌలర్ గురించి మాత్రం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇతడు తన టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు.. ఆ తర్వాత విరాట్ కోహ్లీని బెంబేలెత్తించాడు. ఇక ఇప్పుడు పంజాబ్‌ వైపుకి గేమ్‌ని 4 ఓవర్లలో తిప్పేశాడు. అతడు మరెవరో కాదు ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎల్లిస్.

ఏప్రిల్ 5వ తేదీ బుధవారం గువాహటిలో రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ తలబడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లకు 197 పరుగులు చేసింది. ఎంత భారీ స్కోర్ నమోదు చేసినప్పటికీ.. రాజస్థాన్ బ్యాటింగ్‌కి ముందు తక్కువనే చెప్పాలి. ఆ జట్టులో జోస్ బట్లర్, సంజూ శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్ లాంటి హిట్టర్లు చాలామంది ఉన్నారు. అటు పంజాబ్ బౌలింగ్ కూడా బలహీనంగా కనిపించింది. కానీ ఎల్లిస్ మాత్రం మ్యాచ్‌ను క్షణాల్లో మలుపు తిప్పేశాడు.

4 ఓవర్లలో ఆట మారింది..

రాజస్థాన్ ఆరంభాన్ని బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఇన్నింగ్స్ మొదట్లోనే చెడగొట్టాడు. తన మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ జైస్వాల్‌ను 11 పరుగులకు పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో ఓవర్‌లో అశ్విన్‌ను డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత బట్లర్‌తో బరిలోకి దిగిన శాంసన్ బౌండరీలతో చెలరేగగా.. ఐదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ఎల్లిస్.. నాలుగో బంతికే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. విధ్వంసకర బ్యాటర్ బట్లర్‌(19)ను ఔట్ చేసి.. పంజాబ్‌కు కీలక వికెట్‌ను అందించాడు.

ఆ తర్వాత రెండో ఓవర్‌లో ప్రమాదకరమైన సంజూ శాంసన్(42), మూడో ఓవర్‌లో పరాగ్(20), పడిక్కల్(21)ను పెవిలియన్ చేర్చి.. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు ముందు, ఎల్లిస్‌కు ఐపీఎల్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఈ ప్రదర్శనతో అతడు జట్టులో స్థానాన్ని తప్పకుండా ఖాయం చేసుకోవచ్చు అనే చెప్పాలి. ఐపీఎల్‌లో నాథన్ ఎల్లిస్‌కి ఇది మూడో సీజన్. మెగా వేలంలో అతడిని పంజాబ్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.

టీ20 అరంగేట్రంలోనే హ్యాట్రిక్..

ఈ రైట్ ఆర్మ్ ఆస్ట్రేలియా పేసర్ 2021లో టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఎల్లిస్ చివరి ఓవర్లో హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. అలాగే గత నెలలో భారత్‌తో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి స్టార్ ప్లేయర్స్‌ను ఔట్ చేశాడు ఎల్లిస్. అతడు ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరఫున 5 టీ20 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు.

మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల