IPL 2023, KKR vs RCB: ఐపీఎల్ కెరీర్‌లో చారిత్రాత్మకమైన మ్యాచ్ ఆడనున్న ఇద్దరు కోల్‌కతా ప్లేయర్స్.. ఎవరంటే?
Andre Russell, Sunil Narine: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్‌లకు ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది.
Kolkata Knight Riders vs Royal Challengers Bangalore: ఐపీఎల్ 2023 తొమ్మిదో మ్యాచ్‌లో, ఈ రోజు (ఏప్రిల్ 6), కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ పునరాగమనం చేయాలని భావిస్తోంది. RCB జట్టు తమ గెలుపు ప్రచారాన్ని కొనసాగించాలని కోరుకుంటోంది. కేకేఆర్ వెటరన్‌లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌లకు ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేయాలని ఇద్దరు ఆటగాళ్లు కోరుకుంటున్నారు.
రస్సెల్ కెరీర్‌లో 100వ మ్యాచ్.. 150వ మ్యాచ్ ఆడనున్న నరేన్..
కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ సునీల్ నరైన్‌కి ఇది 150వ ఐపీఎల్ మ్యాచ్. అతను KKR కోసం అత్యధికంగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే, ఒకే ఒక్క ఫ్రాంచైజీ కోసం ఐపీఎల్‌లో ఆడిన ఆటగాళ్లలో నరైన్ ఒకరు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 149 మ్యాచ్‌లు ఆడిన అతను 153 వికెట్లు తీశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 19 పరుగులకు 5 వికెట్లుగా నిలిచింది. అతను KKR కోసం అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో నరేన్‌కు సత్తా చాటుతున్నాడు.
ఆండ్రీ రస్సెల్ గురించి మాట్లాడితే, ఇది ఐపీఎల్‌లో అతనికి 100వ మ్యాచ్. KKR తరపున అత్యధిక IPL మ్యాచ్‌లు ఆడిన నాల్గవ ఆటగాడు రస్సెల్ నిలిచాడు. 2012 నుంచి ఐపీఎల్‌లో యాక్టివ్‌గా ఉంటున్నాడు. అతను 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరడానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రెండు సీజన్లు ఆడాడు. ఆ సమయంలో అతను ఢిల్లీ తరపున 7 మ్యాచ్‌లు ఆడాడు. కోల్‌కతా తరపున రస్సెల్ ఇప్పటి వరకు 92 మ్యాచ్‌లు ఆడాడు. అతను ఆల్‌రౌండర్‌గా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఆండ్రీ రస్సెల్ రెండు వేలకు పైగా పరుగులు చేశాడు. దీంతో పాటు లీగ్‌లో 89 వికెట్లు కూడా తీశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..