AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toothbrush: మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మార్చుతున్నారు? లైట్‌ తీసుకున్నారో బండి షెడ్డుకే..

దాదాపు అందరికీ ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకునే అలవాటు ఉంటుంది. కానీ పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే టూత్ బ్రష్‌ను ఎన్ని రోజులకు మార్చాలో? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో? చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఏళ్లకే యేళ్లు ఒకే బ్రష్‌ను ఉపయోగిస్తుంటారు. ఇక్కడే సమస్య మొదలవుతుంది..

Toothbrush: మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మార్చుతున్నారు? లైట్‌ తీసుకున్నారో బండి షెడ్డుకే..
Toothbrush
Srilakshmi C
|

Updated on: Feb 23, 2026 | 12:21 PM

Share

దంతవైద్యుల అభిప్రాయం ప్రకారం టూత్ బ్రష్‌లను సాధారణంగా ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి మార్చాలి. అమెరికన్ డెంటల్ అసోసియేషన్‌తో సహా అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే విషయాన్ని సిఫార్సు చేస్తున్నాయి. ఎందుకంటే 3 నెలల తర్వాత బ్రష్ ముళ్ళగరికెలు మృదువుగా మారి వంగిపోతాయి. అప్పుడు అది దంతాల మధ్య పేరుకుపోయిన ఫలకాన్ని సరిగ్గా శుభ్రం చేయలేవు. ముళ్ళగరికెలు విస్తరించి ఉంటే లేదా బ్రష్ తల భాగం ఉబ్బి ఉంటే బ్రష్ దాని ప్రభావాన్ని కోల్పోయిందని గ్రహించాలి.

దంతాల ఎనామిల్, చిగుళ్ళను రక్షించడంలో అరిగిపోయిన బ్రష్‌ గతంలో ఉన్నంత ప్రభావవంతంగా ఉండవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా దంతాలపై ఫలకం పేరుకుపోతుంది. దీనివల్ల కావిటీస్, చిగురువాపు, రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. మరో ముఖ్యమైన అంశం బ్యాక్టీరియా. మన నోటిలో సహజంగానే అనేక బ్యాక్టీరియా ఉంటుంది. బ్రష్‌ను ప్రతిసారి ఉపయోగించిన తర్వాత ఆ బ్యాక్టీరియాలో కొన్ని బ్రష్ ముళ్ళగరికెలపైనే ఉంటాయి. అది సరిగ్గా ఆరకపోతే అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది. అందువల్ల బ్రష్‌ను ఉపయోగించిన తర్వాత దానిని బాగా కడిగి, బహిరంగ ప్రదేశంలో ఆరనివ్వాలని నిపుణులు అంటున్నారు. దానికి మూత పెట్టి తడిగా ఉంచడం మంచిది కాదు. జలుబు, వైరల్ జ్వరం, నోటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటే మీరు కోలుకున్న వెంటనే మీ టూత్ బ్రష్‌ను మార్చాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పాత బ్రష్‌లపై మిగిలి ఉన్న క్రిములు తిరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని కలిగిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ విషయంలో పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు తరచుగా గట్టిగా బ్రష్ చేస్తుంటారు. దీని వలన బ్రష్‌ త్వరగా అరిగిపోతాయి. కాబట్టి తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ఈ చిన్న అలవాటును మార్చుకోవడం వల్ల పెద్ద సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించుకోవచ్చు. ఖరీదైన టూత్‌పేస్ట్‌ని ఉపయోగించడం మాత్రమేకాు ప్రభావవంతమైన బ్రష్ కూడా అంతే ముఖ్యం. కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి మీ టూత్ బ్రష్‌ను మార్చండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు