IPL 2023: ‘ఈడెన్ గార్డెన్స్‌లో మేం గర్జిస్తే.. బెంగళూరు తోక ముడవాల్సిందే’
KKR Vs RCB: ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇదే తొలి పోరు. కాగా, 2019 తర్వాత తొలిసారిగా కేకేఆర్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఆడనుంది.
నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుండగా, ప్రపంచంలోనే ప్రముఖ క్రికెట్ స్టేడియంలలో ఒకటైన ఈడెన్ గార్డెన్స్ మరోసారి కోల్‌కతా నైట్ రైడర్స్ రంగు పులుముకుంది. 2019 తర్వాత తొలిసారిగా కేకేఆర్ సొంత మైదానంలో అభిమానుల ముందు దుమ్ము రేపేందుకు సిద్ధమైంది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీ కొట్టేందుకు రెడీ అయింది. ఇందుకు ఆండ్రీ రస్సెల్ కూడా సిద్ధమయ్యాడు. అభిమానుల డిమాండ్‌ను నెరవేర్చడమే తన ముందున్న లక్ష్యం అంటూ మ్యాచ్ ముందు ప్రకటించేశాడు.
ఈరోజు సాయంత్రం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ 2023లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్ మాత్రమే. కోల్‌కతా తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు సులువైన విజయాన్ని నమోదు చేసింది. ఇటువంటి పరిస్థితిలో బెంగళూరుపై విజయం నమోదు చేయడం ద్వారా కోల్‌కతా ఖాతా తెరవాలని భావిస్తోంది.
అభిమానులను అలరిస్తాం..
మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. కేకేఆర్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఈ మ్యాచ్‌లో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. TV9 నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ.. మూడేళ్ల తర్వాత ఈడెన్ గార్డెన్స్‌లో తన అభిమానుల ముందు ఆడటం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
కేకేఆర్ అభిమానుల కోరికలు తీర్చేందుకు ప్రయత్నిస్తానని రస్సెల్ స్పష్టం చేశాడు. భారీ బౌండరీలు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారని, తన ప్రయత్నాలు అలాగే ఉంటాయని విండీస్ స్టార్ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక ప్లేయర్ ఆండ్రూ రస్సెల్ మాట్లాడుతూ.. హోం గ్రౌండ్‌లో తొలి మ్యాచ్ ఆడనున్నాం. ఇది మాకు కలిసొచ్చే అంశం. ఆర్‌సీబీ లాంటి స్ట్రాంగ్ జట్టుతో తలపడనున్నాం. మా బెస్ట్ ఇవ్వడానికి మేం ప్రయత్నిస్తాం. అలాగే ఫ్యాన్స్‌కు మాంచి ఎంటర్టైన్‌మెంట్ అందిస్తాం. చివరకు విజయం సాధించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తాం.. అంటూ చెప్పుకొచ్చాడు.
ఇరుజట్లలో అద్భుతమైన ప్లేయర్స్..
మరో ప్లేయర్ సునీల్ నరైన్ మాట్లాడుతూ.. నేడు మాకు చాలా కీలక మ్యాచ్. ఇరుజట్లలోనూ ఎంతోమంది అద్భుత ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి, మ్యాచ్ చివరి వరకు చాలా ఉత్కంఠగా సాగుతుందని భావిస్తున్నాం. విజయం మాకు చాలా అవసరం. ఆర్‌సీబీతో ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లోనూ మేం అద్భుతంగా సత్తా చాటాం. మరోసారి అలాంటి ప్రదర్శనే ఇస్తాం. చివరకు మ్యాచ్ గెలుస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశాడు.
గెలుపు మాదే..
కేకేఆర్ స్టార్ బౌలర్ ఉమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ పోరు అంటే చాలా ఉత్కంఠగా ఉంటుంది. రెండు పెద్ద జట్ల మధ్య పోటీ అంటే ఆమాత్రం థ్రిల్ ఉండాల్సిందే. గెలుపు కోసం ఇరుజట్లు కడదాకా పోరాడతాయి. అయితే, మైదానంలో ఎవరు 100 శాతం ఇస్తారో వారిదే విజయం. ఇరుజట్లు కూడా ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. కానీ, కీలక సమయంలో మాత్రం సత్తా చాటి బరిలోకి నిలిచాయి. మరోసారి అలాంటి ప్రదర్శనే చేస్తాం. ఫ్యాన్స్‌కు కూడా ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అంటే ఫుల్ మజా వస్తుంది. చివరి దాకా విజయం ఎవరికి సొంతం అవుతుందో తెలియదు. కానీ, మేం సొంత మైదానంలో ఆడుతున్నాం. కాబట్టి, మాకు ప్రేక్షకుల మద్దతు ఉంటుంది. అదే మా బలం అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో పిచ్..
ఈడెన్ గార్డెన్స్ పిచ్ విషయానికొస్తే, ఈ గ్రౌండ్‌లో అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లు కనిపిస్తుంటాయి. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 160 పరుగులు. అదే సమయంలో రన్ ఛేజింగ్ జట్టు రికార్డు కూడా అద్భుతంగా ఉంది. 60 శాతం మ్యాచ్‌లను గెలుచుకుంది.
KKR vs RCB: ప్రాబబుల్ ప్లేయింగ్ XI
కోల్‌కతా నైట్ రైడర్స్: మన్‌దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ.