Watch Video: ఏంది సామీ ఈ వేగం.. బ్యాటర్లకే వణుకు పుట్టించావుగా.. 20 సెకన్లలో ఖేల్‌ఖతం.. వైరల్ వీడియో..
Trending Video: ఓ యువ బౌలర్ వేగం.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టిన ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్ కూడా ఈ చిన్నారి వేగానికి ఫిదా అయిపోయాడు. ఈ చిన్నారి స్పీడ్ బౌలింగ్‌కు బ్యాటింగ్ చేసేందుకు బ్యాటర్స్ వణికిపోవడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
ఓ యువ బౌలర్ వేగం.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టిన ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్ కూడా ఈ చిన్నారి వేగానికి ఫిదా అయిపోయాడు. ఈ చిన్నారి స్పీడ్ బౌలింగ్‌కు బ్యాటింగ్ చేసేందుకు బ్యాటర్స్ వణికిపోవడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో యువకుడి వేగం ముందు బ్యాట్స్‌మెన్స్ భయపడడం చూడొచ్చు.
బౌలర్ తన యార్కర్‌తోపాటు వేగంతో బ్యాట్స్‌మెన్స్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఈ బౌలర్ వేగం మునాఫ్‌ను కూడా బోల్తా కొట్టించింది. వీడియోను పంచుకుంటూ, ఇలాంటి బౌలర్ వేగంపై జనాలు ఇంకేం మాట్లాడగలరు అంటూ రాసుకొచ్చాడు.
ప్రపంచకప్‌లో కీలక పాత్ర..
మునాఫ్ పటేల్ గురించి మాట్లాడితే, అతను భారతదేశం కోసం 13 టెస్టులు, 70 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 35 వికెట్లు, వన్డేల్లో 86 వికెట్లు తీశాడు. వన్డేల్లో అతని ఎకానమీ 4.95గా ఉంది. పటేల్ భారతదేశం తరపున 3 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. అందులో అతను 8.60 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. 2011 ప్రపంచకప్‌లో భారత్ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Kya Bolti Public is Bowler ke liye, ? ? raftar ki khoj#icc #viral #speed #India #proud pic.twitter.com/0l7ASmUTiB
— Munaf Patel (@munafpa99881129) April 5, 2023
ఉమ్రాన్ మాలిక్‌కు మద్దతుగా..
మునాఫ్ ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఆ సమయంలో అతని ఎకానమీ 5.36గా నిలిచింది. గతేడాది కూడా మునాఫ్ ఉమ్రాన్ మాలిక్‌కు చాలా సపోర్ట్‌గా నిలిచి, అతనికి జాతీయ జట్టులో స్థానం కల్పించాలని లాబీయింగ్ చేశాడు. బోర్డు ఉమ్రాన్‌ను 17వ ఆటగాడిగా జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐని కోరాడు. తద్వారా ఉమ్రాన్ జట్టు సంస్కృతిని నేర్చుకోవచ్చని తెలిపాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..