Watch Video: సిక్సుల వర్షం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో రింకూ సింగ్ ఏం చేశాడంటే..? కోచ్ షాకింగ్ కామెంట్స్..
రింకు సింగ్ గుజరాత్ టైటాన్స్‌పై వరుసగా ఐదు సిక్సర్లు బాది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు విజయాన్ని అందించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత, రింకు సింగ్‌ను కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్‌లో సత్కరించారు.
రింకూ సింగ్ తన బ్యాట్‌తో ఐపీఎల్ 2023లో సరికొత్త చరిత్ర నెలకొల్పారు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గుజరాత్ టైటాన్స్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి చివరి బంతికి కోల్‌కతాకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్‌లో KKRకు 29 పరుగులు అవసరం కాగా, రింకు సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి తన జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.
ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత, రింకు సింగ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఈ ఆటగాడిని గౌరవించింది. కేకేఆర్ రింకు సింగ్‌కు ప్రత్యేక మొమెంటోను బహుమతిగా ఇచ్చింది. విజయం తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో రింకూ సింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అతని ఇన్నింగ్స్‌కు సెల్యూట్ చేశారు. కోచ్‌గా, ఆటగాడిగా తన కెరీర్‌లో ఇలాంటి ఇన్నింగ్స్‌ను మూడోసారి మాత్రమే చూశానంటూ కోచ్ చంద్రకాంత్ పండిత్ పేర్కొన్నాడు.
చంద్రకాంత్ పండిట్ ఇంతకు ముందు చేతన్ శర్మ వేసిన చివరి బంతికి రవిశాస్త్రి వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడని, అలాగే జావేద్ మియాందాద్ సిక్సర్లను చూశానని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల తర్వాత చంద్రకాంత్ పండిట్ 5 సిక్సర్ల రింకూ సింగ్ ఇన్నింగ్స్ చూశానంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. చంద్రకాంత్ పండిట్ ఇలా చెప్పడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో చప్పట్లు మోగాయి.
రింకూ సింగ్‌కు సన్మానం..
How a winning dressing room sounds like! ??#GTvKKR | #AmiKKR | #TATAIPL 2023 pic.twitter.com/hTOJidtTnR
— KolkataKnightRiders (@KKRiders) April 10, 2023
కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్‌లో రింకూ సింగ్‌ను సన్మానించారు. రింకూ సింగ్‌కు కేకేఆర్ సీఈవో వెంకీ స్పెపల్ మొమెంటోను అందించారు. చివరి ఓవర్ మొదటి బంతికి సింగిల్ తీసి రింకూను స్ట్రయిక్‌లో ఉంచిన ఉమేష్ యాదవ్‌పైనా కోచ్ చంద్రకాంత్ పండిట్ ప్రశంసల వర్షం కురిపించాడు. అలాగే కెప్టెన్ నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ కూడా విజయానికి సహకరించి ప్రశంసలు అందుకున్నారు.
“Because he’s the Knight #KKR deserves and the one they need right now” – Rinku Singh ?#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX
— JioCinema (@JioCinema) April 9, 2023
2 మ్యాచ్‌లు గెలిపించిన రింకూ సింగ్..
ఈ సీజన్‌లో రింకూ సింగ్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిపించాడు. గుజరాత్‌పై రింకూ సింగ్ 21 బంతుల్లో 48 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే సమయంలో, బెంగళూరుపై ఈ బ్యాట్స్‌మెన్ కష్ట సమయాల్లో 33 బంతుల్లో 46 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ భాగస్వామ్యం కారణంగా, కోల్‌కతా జట్టు 204 పరుగులు చేయగలిగింది. దానికి సమాధానంగా RCB 123 పరుగులకు ఆలౌట్ అయ్యింది. KKR 81 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..