- Telugu News Photo Gallery Technology photos The list of best smartphones under 15k, Have a look on features Telugu Tech News
Smartphone Under 15k: రూ.15వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. ఫీచర్లకు కూడా అదుర్స్
కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 15 వేల లోపు మీ బడ్జెటా.? అయితే ఈ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి.? వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి...
Updated on: Apr 09, 2023 | 7:37 PM

ఇన్‌ఫినిక్స్ హాట్20 5జీ: ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 13,499గా ఉంది. ఇందులో 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డీ + 120 హెర్ట్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఇన్‌ఫినిక్స్ నోట్12 5జీ: ఈ స్మార్ట్ ఫోన్ రూ. 14,999కి అందుబాటులో ఉంది. ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ + 120 హెర్ట్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియా టెక్ హేలియో జీ88 ఎస్వోసీ చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో.. 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 16 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

లావా బ్లేజ్ 5జీ: ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 11,999గా ఉంది. ఈ ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు. ఫీచరల్ విషయానికొస్తే ఇందులో 6.52 ఇంచెస్ హెచ్‌డీ + 90 హెర్ట్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 50-మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు.

పోకో ఎం4 5జీ: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 14,999గా ఉంది. ఇందులో 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డీ + 90 హెర్ట్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఒక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 13-మెగా పిక్సెల్ రెయిర్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. 18 వాట్ల చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ: రూ. 14వేలకు అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ హెచ్‌డీ+ 90హెర్ట్ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. 5000 ఏంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు.





























