Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banking: ఇకపై పీపీఎఫ్, ఎస్ఎస్‍వై ఖతాలకు ఫండ్ ట్రాన్స్‌ఫర్ చాలా ఈజీ.. ఇంట్లో నుంచే చేసేయొచ్చు..

బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త. ఇకపై మీ బ్యాంకు ఖాతా నుంచే నేరుగా ఇతర ఖాతాలకు సొమ్మును బదిలీ చేయొచ్చు. అది కూడా బెనిఫీషియరీని యాడ్ చేసుకుండానే. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

Banking: ఇకపై పీపీఎఫ్, ఎస్ఎస్‍వై ఖతాలకు ఫండ్ ట్రాన్స్‌ఫర్ చాలా ఈజీ.. ఇంట్లో నుంచే చేసేయొచ్చు..
Onlinen Banking
Follow us
Madhu

|

Updated on: Apr 10, 2023 | 4:45 PM

బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త. ఇకపై మీ బ్యాంకు ఖాతా నుంచే నేరుగా ఇతర ఖాతాలకు సొమ్మును బదిలీ చేయొచ్చు. అది కూడా బెనిఫీషియరీని యాడ్ చేసుకుండానే. పోస్ట్ ఆఫీస్(పీఓ) సేవింగ్స్ అకౌంట్ లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్(పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై) ఖాతాలకు నేరుగా నెఫ్ట్(NEFT), ఆర్టీజీఎస్(RTGS)ల ద్వారా ఫండ్ ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇటీవల ఆర్డర్ ఇష్యూ చేసింది. దీని ఫలితంగా ఖాతాదారులకు ఒక ఖతా నుంచి మరో ఖాతాలకు నగదు బదిలీ మరింత సులభతరం అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది ఆర్డర్..

ఎస్బీ ఆర్డర్ నంబర్ 09/2023(05.04.2023) ప్రకారం, ఇప్పుడు బ్యాంకు ఖాతా నుంచి పీఓ సేవింగ్స్ ఖాతా లేదా పీపీఎష్ ఖాతా లేదా ఎస్ఎస్ఐ ఖాతాలకు త్వరితగతిన నగదు బదిలీ చేయవచ్చు. అందుకోసం బెనిఫీయరీని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిబ్బందికి, ఖతాదారులకు ఈ సౌకర్యాల వినియోగంపై సరైన అవగాహన లేని కారణంగా పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో NEFT/RTGS సౌకర్యాలను ఉపయోగించడం ద్వారా బ్యాంక్ ఖాతా నుండి ఇతర ఖాతాలకు ఫండ్ ట్రాన్స్ ఫర్ ను సులభతరం చేసేలా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు ఆ సర్యూలర్ లో ప్రభుత్వం పేర్కొంది.

ఈ అంశాలు గుర్తుంచుకోవాలి..

అయితే బెనిఫీయరీని యాడ్ చేసుకుండా పీపీఎఫ్ లేదా ఎస్ఎస్వై ఖాతాలకు ఫండ్ ట్రన్స్ ఫర్ ప్రారంభించేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అవేంటో ఓసారి చూద్దాం..

ఇవి కూడా చదవండి
  • పీపీఎఫ్ లేదా ఎస్ఎస్వై ఖాతాల్లో మునుపటి సంవత్సరాల డిఫాల్ట్ సబ్‌స్క్రిప్షన్‌లు పెండింగ్‌లో ఉండకూడదు. ఖాతాలో గత సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ పెండింగ్‌లో ఉంటే డిఫాల్ట్‌గా ఏదైనా సమీపంలోని సీబీఎస్ పోస్టాఫీసు ద్వారా డిపాజిట్ చేయాలి.
  • పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ అయినట్లయితే, మెచ్యూరిటీ తేదీ నుండి ఒక సంవత్సరంలోపు సంబంధిత పోస్టాఫీసులో పాస్‌బుక్‌తో పాటు ఖాతా పొడిగింపు ఫారమ్‌ను సమర్పించాలి.
  • పీపీఎఫ్ లేదా ఎస్ఎస్వై ఖాతాలలో ఫండ్ ట్రాన్స్ ఫర్ చేయాలనుకొంటే ఆ నగదు రూ. 50 గుణాంకాలలో ఉండాలి. అంటే 250, 500, 750, అలా అన్నమాట.
  • పీపీఎఫ్ లేదా ఎస్ఎస్వై ఖాతాలలో ఫండ్ ట్రాన్స్ ఫర్ ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షలు ఉండాలి.
  • సాంకేతిక కారణాల వల్ల ఏదైనా NEFT లావాదేవీ విఫలమైతే, ఒక పని దినంలో సంబంధిత బ్యాంక్ ఖాతాలో ఆ నగదు మొత్తం రివర్స్ చేయబడుతుంది.

ఇలా చేయాలి..

బ్యాంక్ ఖాతా నుండి పీఓ సేవింగ్స్ ఖాతా లేదా పీపీఎఫ్ ఖాతా లేదా ఎస్ఎస్ఐ ఖాతాలకు నగదు బదిలీ చేయడానికి (బెనిఫీషియరీని యాడ్ చేయకుండా)ఈ కింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి.

  • బ్యాంక్ ఖాతా నెట్‌బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వండి.
  • పేమెంట్/ట్రాన్స్ ఫర్ ట్యాబ్‌ లోకి వెళ్లండి
  • క్విక్ ట్రాన్స్ ఫర్ ని ఎంచుకోండి (వితవుట్ బెనిఫీషియరీ)
  • లబ్ధిదారుని పేరును నమోదు చేయండి
  • లబ్ధిదారు పీపీఎఫ్ లేదా ఎస్ఎస్వై లేదా పీఓ సేవింగ్స్ ఖాతా సంఖ్యను నమోదు చేయండి, లబ్ధిదారు పీపీఎఫ్ లేదా ఎస్ఎస్వై లేదా పీఓ సేవింగ్స్ ఖాతా నంబర్‌ను మళ్లీ నమోదు చేయండి.
  • చెల్లింపు ఎంపికను ఎంచుకోండి “ఇంటర్ బ్యాంక్ ట్రన్స్ ఫర్”
  • ఐఎఫ్ఎస్సీ కోడ్ IPOS0000DOPని నమోదు చేయండి
  • లావాదేవీ మోడ్ “NEFT”ని ఎంచుకోండి
  • బదిలీ చేయవలసిన మొత్తాన్ని ఎంటర్ చేయండి
  • పర్పస్ ని ‘డిపాజిట్/ఇన్వెస్ట్ మెంట్’ని ఎంచుకోండి
  • నిబంధనలు, షరతులను అంగీకరించండి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి, ఆపై కన్ ఫర్మ్ పై క్లిక్ చేయండి
  • మీ రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ని నమోదు చేసి, కన్ ఫర్మ్ పై క్లిక్ చేయండి.
  • అవసరమైతే ప్రింట్‌పై క్లిక్ చేయండి
  • లాగ్ అవుట్ చేయండి
  • మీ ఖతా నుంచి డెబిట్ అలాగే క్రెడిట్ మెసేజ్ లు ఎస్ఎంఎస్ రూపంలో మీకు ఫోన్ కి అందుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..