చట్టం ఉండేది కానీ.. 1968లో దేశంలో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ చట్టం పరిమితికి మించి ప్రజలు బంగారం కలిగి ఉండటాన్ని నిషేధిస్తుంది. అయితే ఈ చట్టాన్ని 1990లో తీసివేశారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రజలు ఎంత మొత్తంలోనైనా తమ వద్ద బంగారాన్ని ఉంచుకోవచ్చు. కానీ వారి వద్ద తప్పనిసరిగా ఆ బంగారానికి చెందిన డాక్యుమెంట్లు, వాలిడ్ సోర్స్ ఉండాలి.