AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight loss Tips: రోజూ ఈ విత్తనాలు తిన్నారంటే నెల రోజుల్లోనే 10 కేజీల బరువు తగ్గొచ్చు..

అస్తవ్యస్తమైన లైఫ్‌స్టైల్‌ కారణంగా ఉబకాయం ప్రతిఒక్కరినీ వేధిస్తోంది. వేళకాని వేళల్లో దొరికింది తినడం, అరచేతిలో ఫోన్‌ పట్టుకుని ఏ అర్థరాత్రో నిద్రకు ఉపక్రమిస్తున్నారు నేటి తరం యువత. వెరసి చిన్న వయసులోనే శరీరం బరవు అమాంతం పెరిగిపోతున్నారు. ఫిట్‌గా ఉండేందుకు గంటల తరబడి జిమ్‌లలో కసరత్తు చేసినంత మాత్రాన బరువు తగ్గరని ఆరోగ్య నిపుణులు..

Weight loss Tips: రోజూ ఈ విత్తనాలు తిన్నారంటే నెల రోజుల్లోనే 10 కేజీల బరువు తగ్గొచ్చు..
Chia Seeds
Srilakshmi C
|

Updated on: Apr 10, 2023 | 7:09 PM

Share

అస్తవ్యస్తమైన లైఫ్‌స్టైల్‌ కారణంగా ఉబకాయం ప్రతిఒక్కరినీ వేధిస్తోంది. వేళకాని వేళల్లో దొరికింది తినడం, అరచేతిలో ఫోన్‌ పట్టుకుని ఏ అర్థరాత్రో నిద్రకు ఉపక్రమిస్తున్నారు నేటి తరం యువత. వెరసి చిన్న వయసులోనే శరీరం బరవు అమాంతం పెరిగిపోతున్నారు. ఫిట్‌గా ఉండేందుకు గంటల తరబడి జిమ్‌లలో కసరత్తు చేసినంత మాత్రాన బరువు తగ్గరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహార అలవాట్లలో కూడా చిన్నపాటి మార్పులు చేసుకోవాలి. బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గడం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలలో చియా గింజలు ముఖ్యమైనది. చియా విత్తనాలు బరువు తగ్గడంలోనూ ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజల్లోని ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఎందుకంటే చియా గింజలు జీర్ణక్రియను నెమ్మది చేసి, కొవ్వును కరిగిస్తుంది. ఆహారంలో వీటిని ఎలా తీసుకోవాలంటే..

చియా సీడ్ టీ

పాలు, చక్కెర, డికాషన్‌తో టీ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. బదులుగా చియా విత్తనాలతో చేసిన టీ తాగితే పొట్టలోని కొవ్వును వేగంగా తగ్గిస్తుంది. గ్లాసుడు నీళ్లలో కాసిన్ని చియా గింజలు వేసి మరిగించి, నీరు సగం కాగగానే ఓ కప్పులోకి తీసుకుని నెమ్మదిగా తాగాలి.

చియా గింజలను పెరుగుతో కలిపి తీసుకుంటే

చియా విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెట్టి నీటిని వడకట్టి, ఉదయాన్నే పెరుగులో కలుపుకుని తినాలి. ఇలా చేయడం ద్వారా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

చియా సీడ్ వాటర్

చియా సీడ్ వాటర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీని కోసం ఓ టేబుల్‌ స్పూన్ చియా గింజలను ఒక గ్లాసు నీళ్లలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఈ నీళ్లను తాగాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే పొట్ట, నడుము చుట్టు పేరుకుపోయిన కొవ్వు తగ్గడం మొదలవుతుంది.

చియా సీడ్ సలాడ్

త్వరగా బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చియా సీడ్ సలాడ్‌ను చేర్చుకోవాలి. పండ్లు, వెజిటబుల్ సలాడ్‌లతో కలిపి చియా విత్తనాలను తినొచ్చు. ఇది శారీరక ఆరోగ్యాన్ని తోడ్పడటమేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.