AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Using Tips: వాడకం అంటే ఇలా ఉండాలి.. ఎక్కువ కూలింగ్.. తక్కువ విద్యుత్ బిల్లు.. బెస్ట్ ఏసీ టిప్స్ ఇవే..

తెలివిగా వినియోగించడం ద్వారా మంచి చల్లని గది వాతావరణంతో పాటు కరెంటు బిల్లును కూడా తగ్గించుకొనే వీలుంటుంది. ఈ వేసవిలో మీ ఏసీ ల వినియోగంలో మీకు బాగా ఉపయోగపడే చిట్కాలు అందిస్తున్నాం. అస్సలు మిస్ అవ్వద్దు..

AC Using Tips: వాడకం అంటే ఇలా ఉండాలి.. ఎక్కువ కూలింగ్.. తక్కువ విద్యుత్ బిల్లు.. బెస్ట్ ఏసీ టిప్స్ ఇవే..
Air Conditioner
Madhu
|

Updated on: Apr 10, 2023 | 5:45 PM

Share

ఏప్రిల్ మాసంలో అప్పుడే పది రోజులు గడిచిపోయాయి. భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. వేడి గాలులు, విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇటువంటి సమయంలో సాధారణంగా ఏసీ(ఎయిర్ కండీషనర్‌)ల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఇది విద్యుత్ బిల్లు పెరగడానికి కారణమవుతుంది. అయితే ఇటీవల కాలంలో వస్తున్న చాలా ఎయిర్ కండీషనర్లలో మెరుగైన ఉష్ణోగ్రత అలాగే తేమ నియంత్రణను అందిస్తున్నాయి. వాటిని తెలివిగా వినియోగించడం ద్వారా మంచి చల్లని గది వాతావరణంతో పాటు కరెంటు బిల్లును కూడా తగ్గించుకొనే వీలుంటుంది. ఈ వేసవిలో మీ ఏసీ ల వినియోగంలో మీకు బాగా ఉపయోగపడే బెస్ట్ చిట్కాలు మీకు అందిస్తున్నాం. అవేంటో ఓసారి చూద్దాం రండి..

గది మొత్తం క్లోజ్డ్ గా ఉండాలి.. ఏసీ ఆన్ చేసినప్పుడు గదిలోని తలుపులు, కిటికీలతో పాటు మిగిలిన అన్ని ఓపెనింగ్‌లను పూర్తిగా మూసివేయాలి. గదిలోని చల్లనిగాలి బయటికి పోకుండా జాగ్రత్త పడాలి. గదిలో ఏవైనా ఓపెనింగ్‌లు ఉంటే, ఎయిర్ కండీషనర్ గదిని చల్లబరచడానికి అదనపు సమయం తీసుకుంటుంది. ఇది నెలాఖరులో మీ విద్యుత్ బిల్లుపై నేరుగా ప్రభావం చూపుతుంది.

ఫిల్టర్లు ఎప్పటికప్పుడు.. ఏసీ మెరుగ్గా పనిచేయడానికి, మీ గది వేగంగా చల్లబడటానికి, ఫిల్టర్‌లను తరచూ శుభ్రం చేయాలి. గది తగినంతగా చల్లబడటం లేదని మీరు భావిస్తే, వెంటనే ఫిల్టర్లను శుభ్రం చేయాలి. కనీసం రెండు వారాలకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేయడం ఉత్తమం. మీరే స్వయంగా ఈ ఫిల్టర్లను శుభ్రం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఫ్యాన్ ఆన్ లో ఉంచాలి.. ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఫ్యాన్‌ని కూడా లోస్పీడ్ లో ఉంచడం మంచిది. కూలింగ్ గది మొత్తం త్వరగా విస్తరించడానికి ఇది సాయంపడుతుంది.

లైట్లను ఆఫ్ చేయండి.. ఏసీ గది చల్లగా ఉండటానికి లైట్లను ఆఫ్ చేయాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ వంటివి ఉన్నా వెంటనే వాటిని కూడా ఆఫ్ చేయాలి. ఎందుకంటే లోపలి చల్లని గాలిని ఇవి బయటకు పంపిస్తాయి. అలాంటప్పుడు గది వేగంగా చల్లబడదు.

ఏసీ కెపాసిటీ కూడా .. పెద్ద గదిలో తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలను ఉంచితే కూడా కూలింగ్ అంత మెరుగ్గా ఉండదు. 100 చదరపు అడుగుల గదికి 1టన్, 150 చదరపు అడుగుల గదికి 1.5టన్, 200 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న గదికి 2టన్ కెపాసిటీ ఉండే ఏసీలు సూటవుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..