AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఫోకస్ పెంచిన టి.సర్కార్.. బిడ్డింగ్‌కు ప్రణాళికలు..

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కోనుగోలు చేసే క్రమంలో.. జయేశ్‌ రంజన్ నేతృత్వంలో బిడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బిడ్డింగ్‌కు ప్రణాళికలు చేస్తున్నారు.

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఫోకస్ పెంచిన టి.సర్కార్.. బిడ్డింగ్‌కు ప్రణాళికలు..
Vizag Steel Plant
Shiva Prajapati
|

Updated on: Apr 11, 2023 | 1:27 PM

Share

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కోనుగోలు చేసే క్రమంలో.. జయేశ్‌ రంజన్ నేతృత్వంలో బిడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బిడ్డింగ్‌కు ప్రణాళికలు చేస్తున్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాన్‌ విషయంలో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్‌ ఇంట్రెస్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. సింగరేణి కాలరీస్‌ జాయింట్‌ వెంచర్‌ కింద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ ఆలోచన చేస్తోంది. దానిలో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లారు. స్టీల్‌ప్లాంట్ సీఎండీ లేకపోవడంతో.. మార్కెటింగ్ సీజేఎం సత్యానందంతో భేటీకానున్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు.

ఇప్పటికే.. తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకించిన బీఆర్ఎస్.. ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోంది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపారు.

ఇవి కూడా చదవండి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఓ వైపు కార్మికులు ఉద్యమాలు చేస్తుండగా.. కేంద్రం మాత్రం విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!