- Telugu News Photo Gallery Uric Acid Effects Avoiding These Purine Rich Foods That Increase Uric Acid Levels in body
Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్య వేధిస్తోందా? ఈ ఆహారాలకు గుడ్ బై చెప్పండి..
యూరిక్ యాసిడ్.. ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. దీని కారణంగా.. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే అనేక సమస్యలు తలెత్తుయి. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Updated on: Apr 09, 2023 | 2:14 PM

యూరిక్ యాసిడ్.. ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. దీని కారణంగా.. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే అనేక సమస్యలు తలెత్తుయి. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

యూరిక్ యాసిడ్ కారణంగా గౌట్ సమస్య తలెత్తుతుంది. చీలమండ నొప్పి, చీలమండ వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎలివేటెడ్ యూరిక్ యాసిడ్ స్థాయిలను వైద్యపరంగా హైపర్‌యూరిసెమియా అంటారు. ఇది కూడా గౌట్ సమస్య పెరగడానికి కారణం అవుతుంది. ఆర్థరైటిస్‌కు కారణం అవుతుంది.

ఎలివేటెడ్ యూరిక్ యాసిడ్ స్థాయిలు కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు తరచుగా మూత్రవిసర్జన వస్తుంటుంది. మూత్రవిసర్జన సమయంలో మంట, దుర్వాసన వస్తుంది. పరిస్థితి మరీ దిగజారితే.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి.

యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడానికి.. ఆహారం, డ్రింక్స్ పై శ్రద్ధ వహించాలి. శరీరానికి అవసరమైన నీరు తాగాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. రెడ్ మీట్, ఆల్కహాల్, షుగర్ లెవల్స్ అధికంగా ఉండే డ్రింక్స్, స్వీట్స్, డెజర్ట్స్, వెన్న, క్రీమ్, ఐస్ క్రీం, వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

షెల్‌ఫిష్, ఆంకోవీస్, ట్యూనా వంటి సముద్ర చేపలను తినకుండా ఉండాలి. చెర్రీస్‌లో ప్యూరిన్‌లు ఉంటాయి. టొమాటోలు, కాయధాన్యాలు కూడా ప్యూరిన్‌లను కలిగి ఉంటాయి. అయితే వీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరంపై పెద్దగా ప్రభావం ఉండదు.





























