Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డ్రెస్సులు చిరిగేలా రోడ్డుపై కొట్టుకున్న మహిళలు.. మధ్యలో ఎంటరైన సెక్యూరిటీగార్డ్ ఏం చేశాడో చూస్తే షాకే..

ఆడవాళ్లు తలచుకుంటే ఆ ఆకాశాన్ని.. భూమిని ఒకటి చేయగలరంటారు. అంత పవర్ ఆడవాళ్లలో ఉంది.. ఇంకా.. వారు ఫిక్స్ అయ్యారంటే దబిడి.. దిబిడే.. అందుకే.. ఆరు నూరైనా.. నూరు.. ఆరైనా.. సరే ఆడోళ్ల పంచాయితీ మధ్యలోకి పురుషులు వెళ్లొద్దంటారు పెద్దలు..

Viral Video: డ్రెస్సులు చిరిగేలా రోడ్డుపై కొట్టుకున్న మహిళలు.. మధ్యలో ఎంటరైన సెక్యూరిటీగార్డ్ ఏం చేశాడో చూస్తే షాకే..
Woman Fighting
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 09, 2023 | 1:11 PM

ఆడవాళ్లు తలచుకుంటే ఆ ఆకాశాన్ని.. భూమిని ఒకటి చేయగలరంటారు. అంత పవర్ ఆడవాళ్లలో ఉంది.. ఇంకా.. వారు ఫిక్స్ అయ్యారంటే దబిడి.. దిబిడే.. అందుకే.. ఆరు నూరైనా.. నూరు.. ఆరైనా.. సరే ఆడోళ్ల పంచాయితీ మధ్యలోకి పురుషులు వెళ్లొద్దంటారు పెద్దలు.. కారణం.. వారి గొడవ మధ్యలోకి వెళ్లిన వారి ఒళ్లు చింతపండు అవడం ఖాయం అనేది నానుడి.

అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చోట మాత్రం రివర్స్ సీన్ చోటు చేసుకుంది. ముగ్గురు ఆడవాళ్లు నడిరోడ్డుపై పొట్టు పొట్టుగా కొట్టుకుంటుండగా.. ఓ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి మహిళను అమాంతం లేపి ఎత్తేశాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ పట్ల ఇలాగానే వ్యవహరించేది అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు వారు కొట్టుకుంటుంటే.. మధ్యలో నీకేంటి? అని నిప్పులు చెరుగుతున్నారు.

ఇవి కూడా చదవండి

టెక్సాస్‌లో చోటు చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ నైట్ క్లబ్ ముందు ముగ్గురు మహిళలు ఘర్షణ పడుతున్నారు. ఒకరుపై ఒకరు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. చుట్టూ ఉన్నవారిలో కొందరు విడిపించే ప్రయత్నం చేస్తుండగా.. మరికొందరు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే, ఇంతలో వీరిని విడదీసేందుకు వచ్చాడు నైట్ క్లబ్ సెక్యూరిటీ. రోడ్డుపై కొట్టుకుంటున్న మహిళల్లో ఒక మహిళను అమాంతం పైకి లేపి రోడ్డుపై ఎత్తేశాడు. అతను చేసిన పనికి మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనను పక్కనే ఉన్న వారు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.

అయితే, ఆ మహిళల మధ్య గొడవ ఎందుకు జరిగింది అనేది తెలియదు. ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకునే సరికి ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. దీనిపై ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదని, ఎలాంటి కేసులు నమోదు చేయలేదని అక్కడి పోలీస్ అధికారులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..