Viral Video: క్లబ్ ముందు డ్రెస్ విప్పేసి రచ్చ చేసిన యువతి.. కారణం తెలిస్తే అవాక్కే..

పీకలదాకా తాగడం.. ఆ మద్యం మత్తులో ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం.. ఎవరు చూస్తున్నారు.. ఏం జరుగుతోంది.. అనే సోయి కూడా లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు కొందరు యువతీ యువకులు. తాజాగా అందుకు నిదర్శనమైన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. ఓ యువతి క్లబ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా..

Viral Video: క్లబ్ ముందు డ్రెస్ విప్పేసి రచ్చ చేసిన యువతి.. కారణం తెలిస్తే అవాక్కే..
Viral Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 08, 2023 | 9:43 AM

పీకలదాకా తాగడం.. ఆ మద్యం మత్తులో ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం.. ఎవరు చూస్తున్నారు.. ఏం జరుగుతోంది.. అనే సోయి కూడా లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు కొందరు యువతీ యువకులు. తాజాగా అందుకు నిదర్శనమైన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. ఓ యువతి క్లబ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు అడ్డుకున్నారు. టైం అయిపోయిందని, ఎంట్రీ లేదని ఆమెను లోపలికి వెళ్లేందుకు అంగీకరించలేదు. దాంతో ఆ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. బౌన్సర్లతో వాగ్వాదానికి దిగింది. అయినప్పటికీ వారు ఆమెను అడ్డగించారు. దాంతో మరింత రెచ్చిపోయింది యువతి. వారిని బండ బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడింది. ఏకంగా డ్రెస్ తీసేస్తానంటూ బెదిరించి నానా రచ్చ చేసింది. చివరకు తాను అన్నట్లే.. నడి రోడ్డుపై డ్రెస్ తీసేసి, వారితో ఘర్షణకు దిగింది.

అయితే, యువతి చేస్తున్న రచ్చను సెక్యూరిటీ సిబ్బంది ఫోన్‌లో రికార్డ్ చేశారు. అది గమనించిన యువతి.. తన అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించింది. ఇంతలో క్లబ్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. అయితే, పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే.. ఆమె అక్కడి నుంచి కారులో పారిపోయింది.

ఇవి కూడా చదవండి

క్లబ్ యజమాని కరణ్ ఠక్కర్ ఫిర్యాదు మేరకు నాగ్‌పూర్‌లోని సోనేగావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి మద్యం మత్తులోనే ఇంత రచ్చ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, పారిపోయిన యువతి కోసం పోలీసులు వెతుకుతున్నారు. కాగా, యువతి వీరంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది.

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్