Andhra Pradesh: ఏపీ ప్రజలకు అద్దిరిపోయే న్యూస్.. ఇకపై విడుదల రోజే ఓటీటీలో సినిమా చూసే ఛాన్స్.. ఎలాగంటే..!

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. యావత్ ప్రపంచమే కుగ్రామంలా మారిపోయింది. ప్రపంచంలోని మారుమూల ప్రాంతంలో సైతం ఏం జరిగినా.. ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతుంది. ఇంటర్నెట్ మాదిరిగానే.. ఓటీటీలు కూడా సంచలనం క్రియేట్ చేశాయి. ఇంతకు ముందు సినిమా విడుదలైతే థియేటర్లో చూడాల్సి ఉండేది.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అద్దిరిపోయే న్యూస్.. ఇకపై విడుదల రోజే ఓటీటీలో సినిమా చూసే ఛాన్స్.. ఎలాగంటే..!
Apsfl Ott Movies
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 07, 2023 | 8:22 AM

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. యావత్ ప్రపంచమే కుగ్రామంలా మారిపోయింది. ప్రపంచంలోని మారుమూల ప్రాంతంలో సైతం ఏం జరిగినా.. ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతుంది. ఇంటర్నెట్ మాదిరిగానే.. ఓటీటీలు కూడా సంచలనం క్రియేట్ చేశాయి. ఇంతకు ముందు సినిమా విడుదలైతే థియేటర్లో చూడాల్సి ఉండేది. లేదంటే.. టీవీలో వచ్చేంత వరకు ఎదురు చూడాల్సి ఉండేది. కానీ, ఓటీటీలు వచ్చాక పరిస్థితి మారిపోయింది. థియేటర్‌లో విడుదలైన కొద్ది రోజులకే ఆ సినిమా ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో అభిమానులు.. తమకు నచ్చిన సినిమాను ఇంట్లోనే కూర్చొని కుటుంబ సభ్యులతో కలిసి మరీ చూసేస్తున్నారు.

అయితో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమా విడుదలైన రోజునే.. ఏపీ ఫైబర్ నెట్‌లో కొత్త సినిమాను వీక్షించే అవకాశం కల్పిస్తోంది సర్కార్. ఈ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ఏప్రిల్ 7వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(APSFL)లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సర్వీసెస్‌ సబ్‌స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే వెసులుబాటు ఇప్పటికే కల్పించింది. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పునూరు గౌతంరెడ్డి, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అలీ, సినీ నిర్మాత సి కళ్యాణ్, ఇతర ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారు.

కాగా, ఏపీ ఫైబర్ నెట్ డిజిటల్ సాధికారత ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మార్చడం, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను వివక్షత లేని ప్రాతిపదికన అందుబాటులో ఉండే ‘ట్రిపుల్ ప్లే’ సేవలైన IPTV, ఇంటర్నెట్, టెలిఫోన్ లను అందించడం లక్ష్యంగా సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. APSFL ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో సురక్షితమైన, అధిక నాణ్యత గల కనెక్టివిటీని అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం APSFL సేవలను మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్