Gold for Plastic: ప్లాస్టిక్ తెచ్చిస్తే బంగారం ఇస్తున్న గ్రామ సర్పంచ్.. చాలా పెద్ద రీజనే ఉందండోయ్..

ప్రస్తుతం మనం అనుసరిస్తున్న జీవన శైలి.. మన ఆరోగ్యాన్నే కాకుండా ప్రపంచ వాతావరణానికీ పెను ముప్పుగా పరిణమిస్తోంది. ముఖ్యంగా మన వినియోగించే వస్తువుల కారణంగా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్లాస్టిక్ వ్యర్థాల గురించే చెప్పుకోవాలి.

Gold for Plastic: ప్లాస్టిక్ తెచ్చిస్తే బంగారం ఇస్తున్న గ్రామ సర్పంచ్.. చాలా పెద్ద రీజనే ఉందండోయ్..
Plastic Free Village
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 06, 2023 | 1:09 PM

ప్రస్తుతం మనం అనుసరిస్తున్న జీవన శైలి.. మన ఆరోగ్యాన్నే కాకుండా ప్రపంచ వాతావరణానికీ పెను ముప్పుగా పరిణమిస్తోంది. ముఖ్యంగా మన వినియోగించే వస్తువుల కారణంగా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్లాస్టిక్ వ్యర్థాల గురించే చెప్పుకోవాలి. ఒక్కసారికి మాత్రమే ఉపయోగించే ఈ ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా అన్ని రకాలుగా కాలుష్యం అవుతుంది. వాడి పారేయడం వల్ల భూకాలుష్యం, వాటిని కాల్చడం వాయు కాలుష్యం విపరీతంగా అవుతోంది. అయితే, వీటి వినియోగం కూడా అనారోగ్యానికి కారణం అవుతోంది.

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన గ్రామం ఇలా ప్లాస్టిక్ కుప్పగా మారొద్దని భావించాడు ఓ సర్పంచ్. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పక్కాగా ప్రణాళికలు రూపొందించాడు. ఈ క్రమంలోనే ఓ స్కీమ్ అనౌన్స్ చేశాడు ఆ గ్రామ సర్పంచ్. తనకు 20 క్వింటాళ్ల ప్లాస్టిక్ వ్యవర్థాలను తీసుకొచ్చి ఇస్తే ఒక బంగారు నాణెం ఇస్తానంటూ ప్రకటించారు. ఇంకేముందు.. గ్రామ ప్రజలు వచ్చిన ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించారు. గ్రామంలో రహదారులు, డ్రైయినేజీల్లో ఎక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించినా వాటిని సేకరించి, సర్పంచ్‌‌కు అందజేయడం స్టార్ట్ చేశారు. ఫలితంగా ఆ గ్రామంలో జస్ట్ రెండు వారాల్లోనే ఒక్క ప్లాస్టిక్ వ్యర్థం కూడా లేకుండా పోయింది. ఆ గ్రామం స్వరూపమే మారిపోయింది. ప్లాన్ వర్కౌట్ అయి.. ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారింది.

అంతేకాదండోయ్.. గ్రామాన్ని సందర్శించిన అధికారులు స్వచ్ఛ భారత్ అభియాన్-2 కింద ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు. ఇంతకీ ఆగ్రామం ఎక్కడ ఉందో తెలుసుకోరా? జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా హిల్లర్ షాబాద్ బ్లాక్‌లో సాదివార గ్రామం. ఈ గ్రామానికి సర్పంచ్‌ ఫారూక్ అహ్మద్. ఇతనొక న్యాయవాది. పర్యావరణంపై ప్రేమతో, సర్పంచ్ వేసిన నయా ప్లాన్ కారణంగా ప్లాస్టిక్ రహిత గ్రామంగా నిలిచింది సాదివార. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని, చుట్టుపక్కన గ్రామాలు కూడా ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకునేందుకు పాటుపడుతున్నారు ప్రజలు. ఏది ఏమైనా.. తన గ్రామమే కాకుండా, చుట్టు పక్కన గ్రామాలను సైతం ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కారణమైన ఫారూక్ అహ్మద్‌పై ప్రశంసలజల్లు కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే