AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సంచలనం సృష్టిస్తున్న ఎమ్మెల్సీ ‘వైరల్ వీడియో’.. ఇబ్బంది పెట్టేందుకే అంటూ..

కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎమ్మెల్సీని కొద్ది రోజులైనా సంతోషంగా ఉండనివ్వలేదు. ఆయన్ను ఓ వీడియో తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఎప్పుడో సరదాగా చేసిన డ్యాన్స్‌కు సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయి.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Viral Video: సంచలనం సృష్టిస్తున్న ఎమ్మెల్సీ ‘వైరల్ వీడియో’.. ఇబ్బంది పెట్టేందుకే అంటూ..
Israel Bommi Mlc
Shiva Prajapati
|

Updated on: Apr 05, 2023 | 12:42 PM

Share

కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎమ్మెల్సీని కొద్ది రోజులైనా సంతోషంగా ఉండనివ్వలేదు. ఆయన్ను ఓ వీడియో తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఎప్పుడో సరదాగా చేసిన డ్యాన్స్‌కు సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయి.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆ దెబ్బకు ఎమ్మెల్సీ వివరణ ఇచ్చుకోలేక తప్పలేదు. ప్రత్యర్థులు కావాలనే, తనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే వీడియోను వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇంతకీ ఏంటా వీడియో? ఎవరా కొత్త ఎమ్మెల్సీ? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన బొమ్మి ఇజ్రాయిల్‌.. అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ వేస్తున్న అమ్మాయి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ఆధారంగా ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే, ఈ వీడియోపై స్పందించిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండించారు. కొంతమంది తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కొందరు వ్యక్తులు పనిగట్టుకుని మరీ రెండు రోజులుగా పలు సోషల్ మీడియా గ్రూపులలో వీడియోస్ వైరల్ చేస్తూ దృశప్రచారం చేస్తున్నారని అన్నారు. 2018- 19 సంవత్సరంలో ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్ లో సరదాగా వేసిన డాన్స్‌ అని, అందులో ఏమీ లేదని వివరణ ఇచ్చుకున్నారు బొమ్మి ఇజ్రాయిల్. పార్టీకి ఇబ్బందులు కలిగించే ఏలాంటి పనులు తాను చేయను ఎమ్మెల్సీ క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఉంది ఇదే..

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ గతంలో స్టేజ్‌పై అమ్మాయిలతో కలిసి ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాటకు డాన్స్ వేశారు. ఆయన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఇజ్రాయిల్ వీడియోలు బయటకు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో మన ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ గారి డాన్సులు చూడండి అంటూ వీడియో పోస్టింగ్ చేశారు పలువురు. దాంతో అవికాస్తా వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మధుమేహానికి చెక్..ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పులు ఇలా తిన్నారంటే,
మధుమేహానికి చెక్..ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పులు ఇలా తిన్నారంటే,
కాలులో చెట్టు మొదలు గుచ్చి రక్తం.. అయినా నటిస్తూనే ఉన్న హీరో అతడు
కాలులో చెట్టు మొదలు గుచ్చి రక్తం.. అయినా నటిస్తూనే ఉన్న హీరో అతడు
మగువలకు మంచి రోజులు..మళ్లీ రికార్డు స్థాయిలో దిగి వస్తున్న బంగారం
మగువలకు మంచి రోజులు..మళ్లీ రికార్డు స్థాయిలో దిగి వస్తున్న బంగారం
11 మందిలో ఐరెన్ లెగ్ అతడే.. పీకేస్తే దరిద్రం పోతది..!
11 మందిలో ఐరెన్ లెగ్ అతడే.. పీకేస్తే దరిద్రం పోతది..!
టెంపుల్ సిటీలో ఐస్‌క్రీమ్‌లు కొంటున్నారా? అయితే జర భద్రం..!
టెంపుల్ సిటీలో ఐస్‌క్రీమ్‌లు కొంటున్నారా? అయితే జర భద్రం..!
తారక్‌ క్యారెక్టర్‌లో ట్విస్ట్‌..అలా యాక్సెప్ట్ చేస్తారా?
తారక్‌ క్యారెక్టర్‌లో ట్విస్ట్‌..అలా యాక్సెప్ట్ చేస్తారా?
బరిలో భారీ చిత్రాలు.. అయినా ఏంటీ కన్‌ఫ్యూజన్‌..?
బరిలో భారీ చిత్రాలు.. అయినా ఏంటీ కన్‌ఫ్యూజన్‌..?
ఒంటె గురించి పూర్తి సమాచారం
ఒంటె గురించి పూర్తి సమాచారం
విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.200కే ఏసీ విశ్రాంతి
విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.200కే ఏసీ విశ్రాంతి
మీరు తాగే టీ పొడి అసలైనదేనా?ఈ చిన్న చిట్కాతో నిమిషంలో కనిపెట్టండి
మీరు తాగే టీ పొడి అసలైనదేనా?ఈ చిన్న చిట్కాతో నిమిషంలో కనిపెట్టండి