Telangana: బండి సంజయ్‌ అరెస్ట్.. అర్థరాత్రి తరువాత ఏం జరిగింది? మినిట్ టు మినిట్ వివరాలివే..

కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మిడ్‌ నైట్‌ 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు నగర పోలీసులు. ఆయన ఇంటిలోకి ప్రవేశించి.. అరెస్ట్‌ చేయడానికి వచ్చామని చెప్పారు.

Telangana: బండి సంజయ్‌ అరెస్ట్.. అర్థరాత్రి తరువాత ఏం జరిగింది? మినిట్ టు మినిట్ వివరాలివే..
Bandi Sanjay Kumar
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Apr 05, 2023 | 1:20 PM

కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మిడ్‌ నైట్‌ 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు నగర పోలీసులు. ఆయన ఇంటిలోకి ప్రవేశించి.. అరెస్ట్‌ చేయడానికి వచ్చామని చెప్పారు. కొద్దిసేపటి వాగ్వాదం తర్వాత ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. టెన్త్‌ పేపర్ల లీకేజీకి సంబంధించి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆయనను యాదగిరిగుట్టకు తరలించారు. మార్గమధ్యంలో ఆయనను ఎక్కించిన పోలీసు వాహనం మొరాయించింది. దీంతో మరో వాహనంలో ఎక్కించి.. బొమ్మలరామారం పీఎస్‌కి తరలించారు పోలీసులు.

కరీంనగర్‌ అదనపు డీసీపీ చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు , సీఐలు నటేష్, లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి దాదాపు 50 మందికి పైగా పోలీసులు అర్ధరాత్రి సమయంలో బండి సంజయ్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని సహకరించాలని కోరారు. తన అరెస్టుకు కారణంగా చూపించాలని, తనకు వారెంటు చూపాలంటూ పోలీసులతో సంజయ్‌ వాగ్వాదానికి దిగారు. మరో వైపు బండి సంజయ్‌ని అరెస్టు చేస్తున్నారనే ప్రచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో సంజయ్‌ను పోలీసులు ఇంటి నుండి బలవంతంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రయత్నాన్ని కార్యకర్తలు ప్రతిఘటించారు. నినాదాలు చేస్తూ ఆయన అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలవంతంగా సంజయ్‌ను వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ కార్యకర్తలు, అనుచరులు కోరినా పట్టించుకోకుండా అరెస్టు చేసి తీసుకెళ్ళారు. తిమ్మాపూర్‌ మీదుగా సంజయ్‌ను తీసుకెళ్తుండగా వాహనం మొరాయించడంతో మరో వాహనంలో సంజయ్‌ను తీసుకెళ్లారు. బండి సంజయ్‌ అత్త మరణించి తొమ్మిది రోజులు అవుతుండటంతో ఆయన కరీంనగర్‌కు వచ్చారు.

నిన్న టెన్త్‌ క్లాస్‌ హిందీపేపర్‌ లీక్‌ తర్వాత నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు వరంగల్‌ సీపీ రంగనాథ్‌. దీనికి సూత్రధారిగా భావిస్తున్న ప్రశాంత్‌ వ్యవహారంపై టోటల్‌గా స్టడీ చేశారు. నిన్న ఉదయం నుంచి ప్రశాంత్‌ ఏమేమి చేశాడన్న దానిపై కూపీ లాగితే.. బండి సంజయ్‌ పేరు బయటకు వచ్చింది. నిన్న ఉదయం 9:45కు టెన్త్‌ హిందీ పేపర్‌ లీకైంది. 9:59కి ఎస్ఎస్‌సీ వాట్సాప్‌ గ్రూప్‌లోకి ఈ పేపర్ వచ్చింది. అక్కడి నుంచి 10:45కి అన్ని గ్రూపుల్లో పోస్ట్అయింది. పలు మీడియా ప్రతినిధులకు ప్రశాంత్‌ పేపర్‌ పంపాడని.. 11:30కి బండి సంజయ్‌కి కూడా పేపర్‌ వెళ్లిందని గుర్తించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని చెప్పారు వరంగల్‌ సీపీ రంగనాథ్‌.

మినిట్ టు మినిట్ డీటెయిల్‌గా..

01. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌లోని ఆయన నివాసంలో అర్ధరాత్రి ప్రివెన్షన్‌ కస్టడీలోకి తీసుకున్నారు.

02. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ని పోలీసులు బొమ్మలరామారం స్టేషన్‌కు తరలించారు. బండి అరెస్టుపై కార్యకర్తలు స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు.

03. కరీంనగర్‌ ఏసీపీ తుల శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోలీసులు ముందుగా బండి సంజయ్‌ అత్తగారింటికి చేరుకున్నారు.

04. వారెంట్‌ లేకుండా తనను ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు బండి సంజయ్‌. ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

05. బండి సంజయ్‌ అత్తగారు ఇటీవల చనిపోగా.. 9 రోజుల కార్యక్రమం బుధవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జ్యోతినగర్‌లోని వారి ఇంటికి సంజయ్‌ వచ్చారు

06. బండి సంజయ్‌ అత్తగారింటి లోపలికి వెళ్లి బండిని ఠాణాకు రావాల్సిందిగా ఏసీపీ కోరారు శ్రీనివాసరావు కోరారు. ఈ సందర్భంగా పోలీసులు బండి సంజయ్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

07. కరీంనగర్‌ నివాసంలో బండి సంజయ్‌ను అరెస్ట్ చేశాక ప్రజ్ఞాపూర్ వైపు తీసుకెళ్లారు పోలీసులు. భువనగిరి వైపు తరలిస్తుండగా…పోలీసు వాహనం మొరాయింంచింది.

08. ఎల్‌ఎండీ దగ్గర బండి సంజయ్‌ను తీసుకెళుతున్న పోలీస్‌ వాహనం ఆగిపోయింది. దీంతో మరో వాహనంలో బండిని తరలించారు.

09. బండి సంజయ్‌ అరెస్టు నిరంకుశమన్నారు బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి. అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

10. బండి అరెస్టుపై కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంజయ్‌ ఇంటి దగ్గర భారీగా మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

11. బండిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారన్నారు ఆయన అన్నయ్య శ్రవణ్‌. ఎందుకో చెప్పకుండా ఫర్నిచర్‌ ధ్వంసం చేసి.. కార్యకర్తలను కొట్టి తీసుకెళ్లారని ఆరోపించారు.

12. బండి సంజయ్‌ సతీమణి అపర్ణ టీవీ9తో మాట్లాడారు. పోలీసులు బలవంతంగా సంజయ్‌ను అరెస్ట్ చేశారని…కనీసం టాబ్లెట్‌ వేసుకునే సమయం కూడా ఇవ్వలేదన్నారు అపర్ణ.

13. తన భర్త అరెస్టు సమయంలో కుటుంబసభ్యులపై దాడి చేశారని ఆరోపించారు బండి సంజయ్‌ సతీమణి అపర్ణ. ఆయనకు గతంలో గుండెపోటు వచ్చిందని గుర్తు చేశారు.

14. కమలాపూర్‌లో టెన్త్‌ పరీక్ష పేపర్‌ ఉదయం 9.45 గంటలకు లీకైందన్నారు సీపీ రంగనాథ్. 9.59 గంటలకు SSC వాట్సాప్‌ గ్రూప్‌లో.. ఆ తర్వాత అన్ని గ్రూపులకు షేర్‌ చేశారన్నారు.

15. ప్రశాంత్‌ అనే వ్యక్తి రెండు గంటల్లో 142 ఫోన్‌ కాల్స్‌ మాట్లాడారని.. మీడియా సంస్థలకు పేపర్‌ను పంపినట్లు చెప్పారు సీపీ రంగనాథ్‌.

16. వరంగల్‌ టెన్త్‌పేపర్‌ లీకేజీలో విద్యార్థి శివకుమార్‌ను డిబార్‌ చేశారు. ఐదేళ్లపాటు పరీక్ష రాయకుండా నిషేధం విధించారు. ఇద్దరు టీచర్లను సస్పెండ్‌ చేశారు.

17. టెన్త్‌ పేపర్‌ లీకేజీలో ప్రశాంత్‌ అరెస్టును ఖండించింది బీజేపీ. సీపీ రంగనాథ్‌ తీరుకు నిరసనగా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఎదుట ధర్నాకు దిగింది.

18. టెన్త్‌ పేపర్‌ లీకేజీ బండి సంజయ్‌ కుట్ర అన్నారు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌, క్రాంతికిరణ్‌. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదన్నారు.

19. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గమన్నారు మంత్రి తలసాని. టెన్త్‌ పేపర్‌ లీకేజీ వెనుక ఉన్నవారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదన్నారు.

20. ఎలాంటి వారెంట్‌ లేకుండా అరెస్ట్ చేశారని లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి అరెస్ట్‌ చేశారన్నారు.

21. లిక్కర్ క్వీన్, లీకు వీరుడిని కాపాడేందుకు కేసీఆర్ చేస్తున్న యత్నాలను బహిర్గతం చేస్తున్న బండి సంజయ్ గొంతు నోక్కేందుకు అరెస్ట్ చేశారన్నారు బీజేపీ నేత ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్.

22. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు బీజేపీ నేతలు. బండి అరెస్ట్‌పై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ పోలీసులతో మాట్లాడారు.

23. బండి సంజయ్‌ అరెస్ట్‌ను ఖండించారు బీఎల్‌ సంతోష్‌. రాజకీయంగా బీఆర్‌ఎస్‌కు సమాధి అయ్యే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

24. సిద్ధిపేట బైపాస్‌ రోడ్‌లో బండి సంజయ్‌కి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నేతలు నినాదాలు చేశారు. బండి సంజయ్‌ దొంగ అంటూ రోడ్డుపై బైఠాయించారు.

25. వికారాబాద్‌ జిల్లా పరిగిలో టెన్త్‌ పేపర్‌ లీకేజీ నిందితులు బందప్ప, సమప్పను పోలీసులు జడ్జి ఎదుట హాజరుపర్చారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..