Bandi Sanjay Arrest Updates: పేపర్ లీక్ కేసులో A 1గా బండి సంజయ్.. కరీంనగర్ జైలుకు తరలింపు..

Sanjay Kasula

|

Updated on: Apr 05, 2023 | 10:28 PM

టెన్త్ క్లాస్‌ పేపర్‌ లీకేజీ కేసులో పెను సంచలనం.! తెలంగాణ BJP అధ్యక్షుడు బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు మేజిస్ట్రేట్. బండిని A1గా పేర్కొన్న పోలీసులు మొత్తం 8 సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు.

Bandi Sanjay Arrest Updates: పేపర్ లీక్ కేసులో A 1గా బండి సంజయ్.. కరీంనగర్ జైలుకు తరలింపు..
Bandi Sanjay Arrest

తెలంగాణలో పేపర్ లీక్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు మరింత వేడి రాజేసింది. పదో తరగతి హిందీ పేపర్ లీక్ అనంతరం కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మిడ్‌ నైట్‌ 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు నగర పోలీసులు. ఆయన ఇంటిలోకి ప్రవేశించి.. అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. టెన్త్‌ పేపర్ల లీకేజీకి సంబంధించి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆయనను యాదగిరిగుట్టకు తరలించారు. మార్గమధ్యంలో ఆయనను ఎక్కించిన పోలీసు వాహనం మొరాయించింది. దీంతో మరో వాహనంలో ఎక్కించి.. బొమ్మలరామారం పీఎస్‌కి పోలీసులు తరలించారు. దీంతో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Apr 2023 10:28 PM (IST)

    గురువారం విచారణ జరుగుతుంది..

    టీవీ9తో బండి సంజయ్ అడ్వకేట్ కరుణాసాగర్ మాట్లాడారు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పైన గురువారం విచారణ జరుగుతుంది. సంజయ్ బెయిల్ పిటిషన్ పైన వాదులు వినిపించేందుకు పి పి సమయం అడిగారు. గురువారం ఉదయం 10:30 కి బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పైన వరంగల్ కోర్టులో వాదనలు జరనున్నాయి. రిమాండ్ కి సంబంధించినటువంటి పూర్తి ఆర్డర్ వచ్చిన తర్వాత డాకెట్ ఆర్డర్ ను బట్టి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామన్నారు అడ్వకేట్ కరుణాసాగర్.

  • 05 Apr 2023 09:26 PM (IST)

    బీఆర్‌ఎస్‌ నేతలతోనూ ప్రశాంత్‌ ఫొటోలు దిగారు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ చేయడం దుర్మార్గం అని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. అర్ధరాత్రి అరెస్ట్‌ చేసి మానసికంగా హింసించారని విమర్శించారు. పార్లమెంట్‌ సభ్యులు అని గౌరవం లేకుండా పోలీసులు ప్రవర్తించారు. టెర్రరిస్టుల కంటే దారుణంగా ఆయన్ని తీసుకెళ్లారు. టెర్రరిస్టుల కంటే దారుణంగా ట్రీట్‌ చేశారు కిషన్‌రెడ్డి. అధికారం చేతుల్లో ఉందని కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కేసీఆర్‌ దుర్మార్గ పాలనకు పరాకాష్ట ఇది అని అన్నారు. సీఎం కేసీఆర్‌ కళ్లలో ఆనందం చూడ్డం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పరీక్ష మొదలైంది ఉ.9.30కి..సంజయ్‌కి ఫోన్‌కి 11.30 మెసేజ్‌ వచ్చింది. కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం బండిని A1గా పెట్టారు. జరిగినదంతా పూర్తిగా అప్రజాస్వామికమన్నారు కిషన్‌రెడ్డి. బీఆర్‌ఎస్‌ నేతలతోనూ ప్రశాంత్‌ ఫొటోలు దిగారు.. అంతమాత్రాన ప్రశాంత్‌తో వాళ్లకు సంబంధం ఉన్నట్టా? ఇవి మేమే సృష్టించిన ఫొటోలు కాదన్నారు కిషన్‌రెడ్డి. కేసులకు, జైళ్లకు బీజేపీ భయపడేది కాదన్నారు కిషన్‌రెడ్డి. అవసరం అయితే లక్షమంది కార్యకర్తలు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

  • 05 Apr 2023 08:10 PM (IST)

    బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్..

    పదవ తరగతి పేపర్ ఔట్ కేసులో బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. వాదనలు విన్న తర్వాత కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.

  • 05 Apr 2023 07:56 PM (IST)

    బండి సంజయ్‌పై 7 కేసులు ఇవే..

    బండి సంజయ్‌పై 7 కేసులు..

    1. సెక్షన్‌ 120B (నేరపూరిత కుట్ర) 2. సెక్షన్‌ 420 (చీటింగ్‌) 3. సెక్షన్‌ 447 (అక్రమ చొరబాటు) 4. సెక్షన్‌ 505(1) (B) (ప్రజల్ని భయాందోళనలు గురిచేయడం) 5. ప్రివెన్షన్‌ ఆఫ్ మాల్‌ ప్రాక్టీస్‌ సెక్షన్‌ -4 6. ప్రివెన్షన్‌ ఆఫ్ మాల్‌ ప్రాక్టీస్‌ సెక్షన్‌ 6 (నేరపూరిత చర్య) 7. ఐటీ యాక్ట్‌ 66-D (డివైజ్‌ల ద్వారా మోసపూరిత చర్య)

  • 05 Apr 2023 06:49 PM (IST)

    దురుద్దేశం కనిపిస్తోంది..

    ఈ లీకేజీ వ్యవహారంలో ఎగ్జామ్స్‌ను రద్దు చేయించాలనే దురుద్దేశం కనిపిస్తోందని సీపీ రంగనాథ్‌ చెప్పారు. విద్యార్థులను గందరగోళానికి గురిచేయడానికి ఇలా చేశారని భావిస్తున్నామన్నారు. కమలాపూర్‌ పీఎస్‌లో నమోదైన కేసులో నిందితులను మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చామన్నారు. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద 3 నుంచి 7 ఏళ్ల శిక్ష పడుతుందని సీపీ రంగనాథ్‌ చెబుతున్న మాట. ఒకవైపు బీజేపీ నేతల ఎదురుదాడి, మరకోవైపు పోలీసులు చెబుతున్న బలమైన ఆధారాలు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రబిందువు బండి సంజయేనని పోలీసులు ఇప్పటిదాకా నిర్థారించారు. దీంతో ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది.

  • 05 Apr 2023 06:15 PM (IST)

    నిర్దోషి అయితే ఫోన్‌ దాయాల్సిన అవసరం ఏంటి..- సీపీ రంగనాథ్‌

    బండి సంజయ్ ఫోన్‌ చుట్టూ లీకేజీ దుమారం తిరుగుతోంది. ఫోన్ అడిగితే బండి సంజయ్ ఇవ్వలేదన్నారు సీపీ రంగనాథ్‌. బండి సంజయ్‌ ఫోన్‌ ఎందుకు దాస్తున్నారని.. నిర్దోషి అయితే ఫోన్‌ దాయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఫోన్‌ తెస్తే సగం ప్రశ్నలకు సమాధానాలు దొరికేవన్నారు. ఖచ్చితంగా వాట్సప్‌ చాట్‌, కాల్స్‌ను రికవరీ చేస్తామన్నారు.  ప్రశాంత్‌ పేపర్‌ పంపాడనే బండి సంజయ్ ని అరెస్ట్ చేయలేదని వివరణ ఇచ్చారు. పేపర్‌ లీకేజీ అంతా ఓ గేమ్‌ప్లాన్‌లా చేస్తున్నారని తెలిపారు. పేపర్‌ను ప్లాన్ ప్రకారం షేర్ చేస్తున్నారని అన్నారు. సోమవారం సాయంత్రం ప్రశాంత్, బండి మధ్య వాట్సప్‌ చాట్ జరిగిందన్నారు. ఈ చాట్‌ మరుసటి రోజు పేపర్లో వచ్చిందన్నారు. ప్రశాంత్‌తో బండి వాట్సప్‌కాల్‌ కూడా మాట్లాడారు. బండి సంజయ్‌ డైరెక్షన్‌లోనే లీకేజీ అంతా జరిగింది- రంగనాథ్‌ — ఎగ్జామ్స్‌ను రద్దు చేయించాలనే దురుద్దేశం కనిపిస్తోందన్నారు సీపీ రంగనాథ్‌.

  • 05 Apr 2023 05:57 PM (IST)

    బండి సంజయ్‌ తన దగ్గర ఫోన్‌ లేదన్నారు..

    టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశాడని, మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశామని వరంగల్ సీపీ రంగనాథ్‌ తెలిపారు. ప్రశాంత్‌, మహేష్‌ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్‌ కు పంపారని, బండి సంజయ్‌కు ఉదయం 11.24 గంటలకు క్వశ్చన్‌ పేపర్ చేరిందని సీపీ వెల్లడించారు. ఏ2 ప్రశాంత్‌ ఎమ్మెల్యే ఈటలకు ఉదయం 10.41 గంటలకు పేపర్ పంపాడని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని, అరెస్ట్ సమయంలో బండి సంజయ్‌ తన దగ్గర ఫోన్‌ లేదన్నారని సీపీ చెప్పారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారని, బీజేపీలో చాలామందికి పేపర్ షేర్ చేశారని వరంగల్ సీపీ రంగనాథ్‌ పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం పంపాక ప్రశాంత్ 149 మందితో మాట్లాడాడని, పేపర్ లీక్‌కు ముందు రోజు బండి సంజయ్‌, ప్రశాంత్ చాట్ చేసుకున్నారని, పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని సీపీ తెలిపారు. కమలాపూర్‌ స్కూల్ నుంచి పేపర్ బయటకు వచ్చిందన్నారు.

  • 05 Apr 2023 05:40 PM (IST)

    మీడియాకు వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్

    మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న సీపీ రంగనాథ్ వెల్లడించారు. కమలపూర్ పోలీస్ స్టేషన్‌లో ముద్దాయిలను కోర్టులో హాజరు పర్చామన్నారు. ఇందులో A-1గా బండి సంజయ్, A-2గా బూరం ప్రశాంత్ ప్రీ లాన్సర్ జర్నలిస్టు, A-3గా మహేష్, బూరం ప్రశాంత్ చైన్ లింక్ ద్వారా వైరల్ చేసినట్లుగా పేర్కొన్నారు. 120b, 420,447,505(1)(b) IPC sec (4) సెక్షన్లలో కేసులు నమోదు చేశామన్నారు. 11.18 నిమిషాలక్7 హైదరాబాద్ లో మీడియా హెడ్స్ కు ఫార్వార్డ్ చేశాడని తెలిపారు. 11.24 నిమిషాలకు బండి సంజయ్ కి ఫార్వార్డ్ చేశాడన్నారు. చాలామందికి మెసేజ్ చేశాన్నారు. ఈటెల రాజేందర్, అతని PA, పలువురు బీజేపీ నేతలకు పేపర్ పంపారని తెలిపారు. ప్రశాంత్ తో పాటు మహేష్ కూడా చాలామందికి పంపించినట్లుగా సీపీ రంగనాథ్ తెలిపారు

  • 05 Apr 2023 05:14 PM (IST)

    పోలీస్ రిమాండ్ రిపోర్టులో సంచలనాలు..

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసులో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో బండి సంజయ్‌ను ఏ1గా నమోదు చేశారు పోలీసులు. హిందీ ప్రశ్నపత్రంను వాట్సాప్ గ్రూప్ లలో వైరల్  చేయడంతోపాటు నిందితులు, బండి సంజయ్ అరెస్టు టైం లైన్ పేర్కొన్నారు. కమలపూర్‌లోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో 9.30 నిమిషాలకు పరీక్ష మొదలైనంది. శివ అనే బాలుడు ఫస్ట్ ఫ్లోర్ కు చెట్టుఎక్కి రూమ్ నెంబర్ 3 వద్దకు వెళ్ళాడు. హరీష్ అనే విద్యార్థి నుంచి హిందీ పేపర్ తీసుకున్నాడు. 9.42 నిమిషాలకు తన సెల్ ఫోన్లో ఫోటో తీసుకొని 9.45 నిమిషాలకు బయటకు వచ్చాడు. ఆ ఫోటో శివగణేష్ అనే యువకుడికి పంపిస్తాడు. శివగణేష్ 9.59 నిమిషాలుకు SSC-2019- 20 వాట్సాప్ గ్రూప్ లలో పోస్ట్ చేశాడు.. ఈ గ్రూప్ నుంచి మహేష్ అనేవ్యక్తి KMCలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తుంటాడు.. ప్రశాంత్ అనే మాజీ జర్నలిస్టుకు 10.04 నిమిషాలకు పంపించాడు. ప్రశాంత్ 10.47 నిమిషాలకు సీను ఫ్రెండ్స్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. అనంతరం 11.11 నిమిషాలకు బ్రేకింగ్ తయారుచేసి అదే గ్రూప్ లో పోస్ట్ చేశాడు.. ఆ తర్వాత 11.30నిమిషాలకు బండి సంజయ్ కి పోస్టు చేశాడు. గ్రూప్ లలో పోస్ట్ చేయడంతో పాటు, కొంతమంది జర్నలిస్టులకు, బీజేపీ నాయకులకు పోస్టు చేశాడు. రెండు గంటల వ్యవధిలో 142 కాల్స్ మాట్లాడాడు..పేపర్ బయటకు పోస్ట్ చేసిన నిందితులతో పాటు ప్రశాంత్ ను కస్టడీలోకి తీసుకున్నారు.. మంగళవారం రాత్రి 8.33 నిమిషాలకు సీపీ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలోనే ప్రశాంత్ బండి సంజయ్ కి ప్రశ్నపత్రాలు పోస్టు చేసిన విషయం మీడియా ముందు ప్రకటించారు.. అనంతరం శివగణేష్, ప్రశాంత్ తో పాటు మైనర్ బాలుడు శివను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 10.30 నిమిషాలకు బీజేపీ కార్యకర్తలు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంను ముట్టడించారు.. అనంతరం 11 గంటలకు కరీంనగర్ నగర్ లోని బండి సంజయ్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. 11.30 నిమిషాలకు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు..కరీంనగర్ నుండి బొమ్మల రమారం PSకు తెల్లవారుజామున 3.33 నిమిషాలకు తరలించారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తల ఆందోళన, అరెస్టులు జరిగాయి. ఈరోజు ఉదయం 10.గంటలకు బండి సంజయ్ ని పోలీస్ వాహనంలో వరంగల్ వైపు తీసుకువచ్చారు.. భువనగిరి, ఆలేరు, జనగామ, పాలకుర్తి, తొర్రూరు, జఫర్ గఢ్ మీదుగా మడికొండ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తీసుకొచ్చారు..సాయంత్రం 4.12 నిమిషాలకు మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు.

  • 05 Apr 2023 04:34 PM (IST)

    మళ్లీ వాయిదా పడిన వరంగల్ సీపీ ప్రెస్‌మీట్

    పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎప్పుడు మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రెస్ మీట్ మరోసారి వాయిదా పడింది. ముందుగా మూడు గంటలకు మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడిస్తారని సమాచారం ఇచ్చారు. అయితే ఈ ప్రెస్‌మీట్‌ 4 గంటలకు వాయిదా పడింది. అయితే నాలుగు గంటల సమయంలోనూ సీపీ రంగనాథ్ ప్రెస్‌మీట్ పెట్టలేదు. దీంతో ఈ మీడియా సమావేశం 5 గంటలకు వాయిదా పడినట్టు అర్థమవుతోంది. వరంగల్ సీపీ మీడియా సమావేశం ఎందుకు ఇలా వాయిదా పడుతోందనే దానిపై ఆసక్తి నెలకొంది. బండి సంజయ్ ఈ కేసులో నిందితుడు అని చెప్పడానికి కావాల్సిన సాక్ష్యాలను సీపీ రంగనాథ్ ఈ మీడియా సమావేశంలో బయటపట్టబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ ప్రెస్‌మీట్‌‌కు అత్యంత ప్రాధాన్యత నెలకొంది.

  • 05 Apr 2023 04:19 PM (IST)

    హన్మకొండ కోర్టుకు బండి సంజయ్..

    హన్మకొండ మెజిస్ట్రేట్‌ ముందు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీగా పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. జాఫర్‌గఢ్‌ మీదుగా బండి సంజయ్‌ని కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. అంతకు ముందు పాలకుర్తిలో బండి సంజయ్‌కు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే, మరోసారి వరంగల్ సీపీ ప్రెస్‌మీట్ వాయిదా పడింది.

  • 05 Apr 2023 04:08 PM (IST)

    తన కుటుంబం సేఫ్‌గా ఉండటానికి ఎంతకైనా తెగిస్తారు.. సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

    బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు.  తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఇలాంటి చర్యలకు BRS పాల్పడుతుందనే విషయం తమకు ముందే తెలుసనని ఆమె అన్నారు. గ్రూప్1 లీక్స్, టీఎస్ అక్రమాలు, ssc పేపర్ లీక్స్.. విషయాలను బయటపెడుతున్నందుకే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసుల్లో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవుతుందన్న భయంతో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికే సంజయ్ అరెస్ట్ చేశారని విమర్శించారు. బీజేపీకి పోటీగా బీఆర్ఎస్ వస్తోందన్నారు. ముందు రాష్ట్రంలో గెలిచి.. దేశం వైపు వెళ్ళాలని హితవు పలికారు. ఉదయం నుంచి BRS నేతలు వాడే భాష అత్యంత దరిద్రంగా ఉందన్నారు. మీ భాష మార్చుకోకపోతే.. మీకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తమ నాయకుడు బండి సంజయ్‌ని ఎలా బయటకు తీసుకురావాలో తమకు తెలుసన్నారు. మీడియాలో ఉన్న వ్యక్తి.. లీడర్స్ దగ్గర ఫోటోలు దిగడం కామన్. ఆ ఫోటోలను చూపించి పెద్ద కుట్రగా చూపించడం బీఆర్ఎస్ అడుతున్న డ్రామా అని అన్నారు. తెలంగాణలో దోచుకున్న డబ్బులను తీసుకెళ్ళి.. ఇతర రాష్ట్రాల విపక్ష పార్టీలను మేపుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను తాను దగ్గరగా చూసానని.. తాను, తన కుటుంబం సేఫ్‌గా ఉండటానికి ఎంతకైనా తెగిస్తారని అన్నారు విజయశాంతి. బండి సంజయ్‌ అరెస్టుకు నిరసన తెలిపేందుకు బయలుదేరిన విజయశాంతిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. దీంతో ఆమె ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

  • 05 Apr 2023 03:47 PM (IST)

    బండి సంజయ్‌పై 10వ తరగతి విద్యార్థి ఫిర్యాదు..

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌పై ఫిర్యాదు నమోదైంది. పదవ తరగి చదువుతున్న  కనుకుంట్ల విష్ణుచరణ్ అనే విద్యార్ధి గోదావరిఖని వన్ టౌన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరీక్షల్లో పేపర్ లీకేజీకి పాల్పడుతున్న బండి సంజయ్ మీద చట్ట పరమైన చర్య తీసుకోవాలని.. మా జీవితాలను నాశనం చేయాలని చూస్తున్న బండి సంజయ్‌కి కఠిన శిక్ష వేయాలని విష్ణు చరణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • 05 Apr 2023 02:53 PM (IST)

    ఇవి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే కేసులు..

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును తీవ్ర స్థాయిలో ఖండించింది బీజేపీ లీగల్ సెల్. బండి సంజయ్ అరెస్ట్ పూర్తిగా అక్రమం అని.. ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన సెక్షన్‌ ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారని.. అయితే, కరీంనగర్‌లో అరెస్ట్, బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ తరలించడం.. అక్కడి నుంచి జనగామ జిల్లాల వైద్య పరీక్షలు నిర్వహించడం. వరంగల్ కోర్టుకు తీసుకురావడం ఇవన్నీ పోలీసులు తమ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఆయనకు అనేక మెసేజ్లు వస్తుంటాయని వీటికి ఓ ఎంపీపై ఇలా కేసులు పెట్టడం సరికాదన్నారు. ఎక్సమ్ పేపర్ బయటకు వచ్చిన రెండు గంటల తర్వాత బండి సంజయ్ కి మెసేజ్ వస్తే ఇందులో కుట్ర అనడం సరికాదన్నారు.

  • 05 Apr 2023 02:42 PM (IST)

    బండి సంజయ్ అరెస్టుపై హెబియస్ కార్పస్ పిటిషన్‌.. విచారణ ఎప్పుడంటే..

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్ట్‌‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బండి సంజయ్‌ను అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సాంరెడ్డి సురేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. మొత్తం ఆరుగురిని బీజేపీ ప్రతివాదులుగా చేర్చింది. హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ సీపీలు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చుతూ బీజేపీ పిటిషన్‌ను దాఖలు చేసింది. సాంరెడ్డి సురేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గురువారం ఉదయం విచారించేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు.

  • 05 Apr 2023 02:35 PM (IST)

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కుట్ర దారుడిగా కేసు..

    పేపర్ ఔట్ కేసులో అరుగురుని నిందితులుగా చేర్చారు పోలీసులు. పేపర్ ఔట్ కేసులో కుట్ర దారుడిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను చేర్చారు. బండి సంజయ్ పై మొత్తం రెండు కేసులు నమోదు చేశారు. కమలాపూర్ , కరీంనగర్ 2టౌన్ లో సంజయ్ పై కేసులు నమోదు చేశారు. పేపర్ లీకేజి ప్రచారం వెనుక బండి సంజయ్ పాత్ర ఉందని.. ఇందులో భాగం 420, సెక్షన్ 6 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. ప్రశాంత్‌తో బండి సంజయ్ చాటింగ్ చేశారా..? లేదా అనే అంశం పై పోలీసుల దృష్టి పెట్టారు. లీకేజి ముందు రోజు ప్రశాంత్‌తో బండి సంజయ్ మాట్లాడినట్టు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్ వాట్సాప్ ఛాటింగ్ రిట్రైవ్ చేసిన అధికారులు. సంజయ్ తో వందకు పైగా ప్రశాంత్ కాల్ మాట్లాడినట్టు గుర్తించారు. నిన్న పేపర్ పంపిన తర్వాత కూడా సంజయ్ తో మాట్లాడినట్లుగా తెలిపారు. మరి కాసేపట్లో వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో మరిన్ని కీలక అంశాలు బయట పెట్టనున్నారని పోలీసులు తెలిపారు.

  • 05 Apr 2023 02:01 PM (IST)

    దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టం.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

    తెలంగాణ రాష్ట్రంపై కక్ష్య గట్టిన కేంద్రం ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తోందని.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ కూడా తెలంగాణలో ఈ విధంగా పేపర్ లీకేజీలు ఘటనలు జరగలేదు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో తెలంగాణలో ఏదో ఒక అలజడి సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి చూస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతలు తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మొన్న టీఎస్పీఎస్సీ పేపర్, నిన్న పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుల కుట్ర కోణంపై నిష్పక్షపాత దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ నేతలు తీరును నిరసిస్తూ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

  • 05 Apr 2023 02:00 PM (IST)

    బండి సంజయ్ పై పెట్టిన కేసులు ఇవే..

    బండి సంజయ్ పై పెట్టిన కేసులు ఇవే..

    • IPC 420, 120B, సెక్షన్ 5 ప్రివెన్షన్‌ ఆఫ్ మాల్‌ ప్రాక్టీస్..
    • CrPC 154 ,157 సెక్షన్ల కింద కూడా కేసులు
    • మొత్తం రెండు చోట్ల కేసులు నమోదు.. కరీంనగర్‌ 2 టౌన్, కమలాపూర్‌లో కేసులు నమోదయ్యాయి.
  • 05 Apr 2023 01:46 PM (IST)

    బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలి..

    ఎన్నికలు వస్తున్నాయని వికృత చర్యలకు పాల్పడుతున్నారంటూ.. బీజేపీ నేతలపై మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ పై లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకున్న స్పీకర్.. బండి సంజయ్ మీద చర్య ఎందుకు తీసుకోరన్నారు. ఇట్లాంటి వ్యక్తులు, శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

  • 05 Apr 2023 01:42 PM (IST)

    బండి సంజయ్ అరెస్టుపై రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్‌..

    బండి అరెస్టుపై బీజేపీ హైకమాండ్‌ రంగంలో దిగింది. కేసులో A-5గా ఉన్న బండి సంజయ్‌.. పలు సెక్షన్ల కింద కేసులు పెట్టిన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు కిషన్‌రెడ్డితో అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. బండి సంజయ్ అరెస్ట్ పరిణామాలపై అమిత్‌ షా ఆరా తీశారు. యాక్షన్ ప్లాన్‌ సిద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో నేతలతో తరుణ్‌చుగ్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడిన అమిత్ షా.. కేంద్ర పార్టీ నుండి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యాచరణ సిద్దం చేయాలన్న అమిత్‌షా.. అత్యవసర భేటీ ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

  • 05 Apr 2023 01:41 PM (IST)

    బండి సంజయ్, ఈటలకి లీకేజ్ తో సంబంధం..

    బండి సంజయ్, ఈటలకి పదవ తరగతి హిందీ పేపర్ లీకేజీకి సంబంధం ఉందంటూ ఎమ్మెల్సీ, విప్ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.. వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అధికారంలోకి రావడానికి సంజయ్, ఈటల లు కుట్ర చేశారంటూ ఆరోపించారు. ఈటలను కూడా అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈటల పిఏ నరేందర్ కి ఇందులో సంబంధం ఉందన్నారు. మహేష్ ఈటల అనుచరుడు, పోలింగ్ ఏజెంట్, ప్రియశిష్యుడు అంటూ మండి పడ్డారు.

  • 05 Apr 2023 01:10 PM (IST)

    బండి సంజయ్ అరెస్టును ధ్రువీకరించిన సీపీ రంగనాథ్..

    సంజయ్ అరెస్టును వరంగల్ సీపీ రంగనాథ్ ధృవీకరించారు. మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్ హస్తం ఉన్నట్లు నిర్ధారించారు. వాటి ఆధారంగానే మొత్తం మూడు కేసులు నమోదు చేశారు.. 420, 120B, సెక్షన్ 5 ఆఫ్ మాల్ ప్రాక్టీస్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పకడ్బందీగా నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. మొత్తం వ్యవహారాన్ని 3గంటలకు మీడియా ముందు సీపీ రంగనాథ్ ఉంచనున్నారు. మూడు గంటలకు మొత్తం ఎపిసోడ్ ను మీడియాకు వివరించనున్నారు.

  • 05 Apr 2023 12:57 PM (IST)

    భౌతిక దాడులు తప్పవు.. బీజేపీ నేతలకు మంత్రి వేముల వార్నింగ్..

    10వ తరగతి పేపర్ లీక్ సూత్రదారి బీజేపీ బండి సంజయే.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని రకాల ఆధారాలు లభించాయి.. లక్షల మంది పిల్లలు భవిష్యత్తు, వారి తల్లి తండ్రులు ఎంత బాధ పడతారు అని కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించారంటూ మండిపడ్డారు. కేసిఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశం.. ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కి ఫోటో తీసిన పేపర్ ఫోన్లో పంపించాడన్నారు. పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే బండి సంజయ్ కు ప్రశాంత్ ద్వారా వచ్చిందన్నారు. బండి సంజయ్, బీజేపీ వాళ్ళతో ప్రశాంత్ 140 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు. వాళ్లే ఉద్దేశ పూర్వకంగా లీక్ చేస్తారు.. వాళ్లే మీడియాకి పంపిస్తారంటూ మండి పడ్డారు. పేపర్ లీక్ అయ్యింది.. ఆ పేపర్ నాకు వచ్చింది.. ప్రభుత్వం విఫల మయ్యింది అని ప్రచారం చేస్తారన్నారు. ఇది పిల్లల జీవితాలతో చెలగాటం ఆడటమే.. బండి సంజయ్ పాత్ర ఉన్నది పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి..చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. బండి అరెస్ట్ పై బీజేపీ నాయకులు కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేస్తే ఖబర్దార్.. భౌతిక దాడులు తప్పవంటూ హెచ్చరించారు. పేపర్ లీక్ చేసి పిల్లల భవిష్యత్ ను నాశనం చేయాలని చూసిన బీజేపీ బండి సంజయ్ వైఖరి పట్ల బీజేపీ కార్యకర్తలు ఆలోచన చేయాలంటూ ఈ సందర్భంగా సూచించారు.

  • 05 Apr 2023 12:53 PM (IST)

    అందులో భాగంగానే బండి సంజయ్ అరెస్ట్.. ధర్మపురి అరవింద్

    బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ‘‘సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్‌దేశాయ్ కెసిఆర్ పొలిటికల్ ఆఫర్ గురించి చెప్పారు.. ప్రతిపక్ష పార్టీలు అన్నింటికి ఎన్నికల ఖర్చు భరిస్తానని కేసీఆర్ చెప్పినట్టుగా ఆయన వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, కూతురు కవిత ఎదుర్కొంటున్న కేసులతో కెసిఆర్ పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వీటిపై జరుగుతున్న చర్చ నుంచి దృష్టి మళ్లించడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్, ఇతర నేతల నిర్బంధం అందులో భాగమే.. దేశ రాజకీయాల నడిపించే అంత డబ్బు కేసీఆర్ కి ఎక్కడి నుంచి వచ్చాయని తెలంగాణ సమాజం చర్చించుకుంటోంది.ప్రధాని తెలంగాణ పర్యటనకు ఆటంకం కల్గించాలని కూడా సీఎం ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం నెలకొంది.’’ అంటూ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.

  • 05 Apr 2023 12:47 PM (IST)

    బీజేపీ కుట్రలు బయటపడ్డాయి.. మంత్రి హరీశ్ రావు

    కేసీఆర్ ని ఎదుర్కోలేక బీజేపీ దిగజారి ప్రవర్తిస్తోంది.. బీజేపీ కుట్రలు నగ్నంగా నిన్న బయటపడ్డయంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. పట్టపగలు నగ్నంగా దొరికిన దొంగ బండి సంజయ్.. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి హరీష్ మండి పడ్డారు. బీజేపీ కుట్రల్ని దేశం మొత్తం గమనిస్తుంది.. నిన్న మధ్యాహ్నం పేపర్ లీక్ అయ్యిందని బిజెపి వాళ్ళు ధర్నా చేశారు. సాయంత్రం పేపర్ లీక్‌లో అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేయాలని ధర్నా చేశారు.. పేపర్ లీక్ చేసింది బీజేపీ నాయకుడే.. విద్యార్థి లోకం బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి.. అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

  • 05 Apr 2023 12:42 PM (IST)

    తెలంగాణాలో ప్రజాస్వామ్యం లేదు.. కొండా విశ్వేశ్వర రెడ్డి

    తెలంగాణాలో ప్రజాస్వామ్యం లేదంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. బండి సంజయ్ అరెస్టు స్పందించిన ఆయన.. తెలంగాణాలో ఐపిసి కోడ్ నడవడం లేదు.. కేపిసి కోడ్ నడుస్తుందన్నారు. కేసీఆర్ పై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది.. అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులకు లోక్ సభ స్పీకర్ నుంచి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు వస్తాయి.. కేసీఆర్ పొలిటికల్ డిగ్రీ సర్టిఫికేట్ అడిగినందుకు అరెస్ట్ చేశారా ? అంటూ ప్రశ్నించారు. ఈరోజు గవర్నర్ ని కలిసి వినతపత్రం అందిస్తామన్నారు.

  • 05 Apr 2023 12:35 PM (IST)

    పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. ప్రమాదం.. మంత్రి కేటీఆర్ ట్వీట్..

    ‘‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!

    కానీ, అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!

    తమ స్వార్థ రాజకీయాల కోసం.. ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

  • 05 Apr 2023 12:32 PM (IST)

    Bandi Sanjay detained: హన్మకొండ కోర్టుకు బండి సంజయ్

    Bandi Sanjay detained: కాగా.. బండి సంజయ్ పై కుట్ర కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన్ను పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం అక్కడి నుంచి హనుమకొండ కోర్డుకు తరలిస్తున్నారు. అనంతరం ఆయన్ను జడ్జి ఎదుట హాజరుపర్చనున్నారు.

  • 05 Apr 2023 12:24 PM (IST)

    బండి సంజయ్ అరెస్టు.. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా కీలక మంతనాలు..

    బండి సంజయ్ ప్రధాని మోడీతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ అయ్యారు. మోడీతో భేటీ అనంతరం విడిగా నడ్డా, షా సమావేశమయ్యారు. బండి సంజయ్ అరెస్టు, తెలంగాణలో పరిస్థితుల గురించి ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు గురించి ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా చర్చించినట్టు సమాచారం.

  • 05 Apr 2023 11:57 AM (IST)

    బండి సంజయ్ అరెస్టు గురించి ఆరా తీసిన జేపీ నడ్డా

    తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బండి సంజయ్ అరెస్టుపై అధిష్టానం సీరియస్ అయింది. బండి సంజయ్ అరెస్టు గురించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరాతీశారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలతో జేపీ నడ్డా మాట్లాడారు.న్యాయపరమైన అవకాశాలను పరిశీలించాల్సిందిగా నాయకులకు సూచనలిచ్చారు.

  • 05 Apr 2023 11:46 AM (IST)

    ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్..

    ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కీసర సమీపంలో అడ్డుకున్న పోలీసులు వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని రాజాసింగ్ ను కోరారు. అనంతరం రాజాసింగ్‌ను ఆయన వాహనం నుంచి దింపిన పోలీసులు.. పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. బొమ్మలరామారం వెళ్లేందుకు ప్రయత్నించిన రాజాసింగ్‌ అదుపులోకి తీసుకున్నారు.

  • 05 Apr 2023 11:14 AM (IST)

    బండి సంజయ్‌పై కుట్ర కేసు

    తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్నారని పోలీసులు సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు వరంగల్ లో బండి సంజయ్ పై కేసు నమోదైంది.

  • 05 Apr 2023 10:48 AM (IST)

    బండి కుట్రే..

    తెలంగాణలో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నింస్తోందని బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. హిందీ పేపర్‌ను బండి వాట్సాప్‌కు పంపించడం కుట్ర కాదా ? అని ప్రశ్నించారు నల్లగొండ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి.

  • 05 Apr 2023 10:47 AM (IST)

    ఉత్తర భారత సంస్కృతిని తెలంగాణలోకి తీసుకొస్తున్నారు.. గంగుల ఫైర్

    బీజేపీ కుటిల రాజకీయాలకు లీకేజీ నిదర్శనం.. కేవలం బీజేపీ గ్రూపులకే పరీక్ష పేపర్లు వెళ్లాయి.. దీనిని బూచిగా చూపించి ఎన్నికల్లో లబ్ధికి ప్రయత్నిస్తున్నారంటూ గంగుల కమలాకర్ మండి పడ్డారు. వేల మంది తల్లిదండ్రులు, విద్యార్థుల ఉసురు సంజయ్‌కు తగులుతుంది.. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర చేశారు. లీకేజీ బీజేపీ కుట్రలో భాగమే.. తెలంగాణలో బిహార్‌ తరహా గుండాయిజం.. రౌడీయిజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణను బిహార్‌ తరహాగా మారుస్తారేమోనని భయం వేస్తోంది.. అన్నింటికీ కరీంనగరే వేదిక అవుతోంది.. అంటూ గంగుల మండిపడ్డారు. యువతను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ లీకేజీలకు పాల్పడుతోంది.. నిరుద్యోగులకు ఉపాధి రాకుండా బీజేపీ జెండా పట్టుకు తిరగాలనే కుట్ర చేస్తుందన్నారు.

    గతంలో కాంగ్రెస్‌ హిందూ, ముస్లింలకు గొడవలు పెట్టేది.. ఇప్పుడు బీజేపీ నీచితినీచంగా ప్రవర్తిస్తుంది.. ఉత్తర భారత సంస్కృతిని తెలంగాణలోకి తీసుకొస్తున్నారంటూ గంగుల కమలాకర్ మండిపడ్డారు.

  • 05 Apr 2023 10:38 AM (IST)

    బండి అరెస్టుపై కిషన్ ఫోన్.. కాసేపట్లో పూర్తి వివరాలు చెబుతామన్న డీసీపీ

    బండి సంజయ్‌ అరెస్ట్‌పై కాసేపట్లో పూర్తి వివరాలు తెలియజేయనున్నట్లు డీసీపీ రాజేష్‌ చంద్ర తెలిపారు. అరెస్ట్‌కు సంబంధించి ప్రస్తుతం పేపర్‌ వర్క్ నడుస్తోందని డీసీపీ పేర్కొన్నారు.

    కాగా, డీజీపీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్‌ చేశారు. అరెస్ట్‌కి సంబంధించిన వివరాలపై ఆరా తీయగా.. కాసేపట్లో వివరాలు వెల్లడిస్తామని డీజీపీ తెలిపారు.

  • 05 Apr 2023 10:36 AM (IST)

    బండి సంజయ్‌ని ఎంపీ పదవి నుంచి బర్త్‌రఫ్‌ చేయాలి..

    రాష్ట్రంలో 10వ తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో ప్రదానపాత్ర పోషిస్తున్న తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఎంపి పదవి నుండి బర్త్‌రఫ్ చేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద డిమాండ్‌ చేశారు. ప్రశాంత్ అనే తన అనుచరుడి ద్వారా పేపర్ లీక్ చేయించి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారన్నారు. బిజెపి పార్టీకి తెలంగాణ ప్రజలు సరైన బుద్దిచెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు వివేకానంద.

  • 05 Apr 2023 10:05 AM (IST)

    ఎన్నిసార్లు జైలుకు పంపినా బండి భయపడరు.. రాజాసింగ్‌

    నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారు?..  – ఎన్నిసార్లు జైలుకు పంపినా బండి భయపడరు అంటూ రాజాసింగ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్‌లు చేస్తారా? పిల్లల జీవితాలను ప్రభుత్వం నాశనం చేస్తోంది.. గూండాల రాజ్యాన్ని ప్రజలు గమనించాలి.. అంటూ రాజాసింగ్‌ తెలిపాు.

  • 05 Apr 2023 09:57 AM (IST)

    బండి సంజయ్‌పై నర్సంపేట ఎమ్మెల్యే సంచలన కామెంట్లు

    బండి సంజయ్‌పై నర్సంపేట ఎమ్మెల్యే సంచలన కామెంట్లు చేశారు. పేపర్‌ లీకేజ్‌లో అతిపెద్ద కుట్రదారు బండి సంజయ్‌ అని పెద్ది సుదర్శన్‌ పేర్కొన్నారు.  బండి సంజయ్‌ వాట్సాప్‌కే ఎందుకు పేపర్‌ వెళ్లింది? బీజేపీ వాట్సాప్‌ యూనివర్సిటీ కుట్రపూరితంగా.. తెలంగాణలో అంతర్గత సంక్షోభం సృష్టించాలని చూస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్నారు.. కొంతమందిని ఎంచుకుని కుట్రలకు తెరలేపుతున్నారంటూ సుదర్శన్‌ మండి పడ్డారు.

  • 05 Apr 2023 09:33 AM (IST)

    బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామిమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రోజురోజుకు తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నందుకే కల్వకుంట్ల కుటుంబం.. అరాచకంగా నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు.

  • 05 Apr 2023 09:28 AM (IST)

    బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్ట్‌

    • బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్ట్‌
    • బండి సంజయ్ అరెస్ట్‌కు కారణం అడిగిన రఘునందన్‌
    • లా అండ్‌ ఆర్డర్ సమస్య వస్తోంది వెళ్లిపోమని చెప్పిన పోలీసులు
    • పోలీసులకు రఘునందన్‌కి మధ్య వాగ్వాదం, ఆపై అరెస్ట్‌
  • 05 Apr 2023 09:23 AM (IST)

    విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సిగ్గుచేటు..

    బండి సంజయ్ అరెస్ట్‌పై స్పందించారు ఎమ్మెల్యే రేగా కాంతారావు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సిగ్గుచేటంటూ ట్వీట్ చేశారు..

  • 05 Apr 2023 09:21 AM (IST)

    కేసీఆర్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర.. దాస్యం..

    – కేసీఆర్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్ భాస్కర్‌ పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజల మనసు గెల్చుకోలేరన్నారు.  లీకేజీలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాళ్లు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ప్రజలు అన్ని గమనిస్తున్నారు, చెప్పులతో కొడతారు.. బీజేపీ ఈడీ, ఐటీ దాడులతో బెదిరింపులకి దిగుతోందంటూ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్ భాస్కర్‌ పేర్కొన్నారు..

  • 05 Apr 2023 09:19 AM (IST)

    బండి అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్..

    బండి అరెస్ట్‌పై బీజేపీ లీగల్‌ సెల్ హైకోర్టు మెట్లెక్కింది. కోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అరెస్ట్ అక్రమమని, వెంటనే విడుదల చేయాలని బీజేపీ పేర్కొంది.

  • 05 Apr 2023 09:18 AM (IST)

    బండి సంజయ్‌ను విడుదల చేయాలి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్అ రెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఎంపీనీ కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గం. కెసిఆర్ చెప్పినట్టు పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తప్పు దోవపట్టించడానికి నిదర్శనం బండి సంజయ్ అరెస్ట్. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

  • 05 Apr 2023 09:03 AM (IST)

    రాజకీయ కుట్రలో భాగమే.. సోము వీర్రాజు..

    రాజకీయ కుట్రలో భాగమే ఈ అక్రమ అరెస్టులు.. తెలంగాణ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం.. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. బీ.అర్.ఎస్ కి కాలం చెల్లిందంటూ .. ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.

  • 05 Apr 2023 09:00 AM (IST)

    బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు

    బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు. తెలంగాణ పోలీసుల ఇండియన్ పీనల్ కోడ్ అర్థం మార్చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఎగ్జామ్ ప్రారంభమైన రెండు గంటల తర్వాత పేపర్ బయటికొస్తే లీక్ ఎలా అవుతుందని ప్రశ్నించారు రఘునందన్‌.

  • 05 Apr 2023 08:59 AM (IST)

    అక్రమ అరెస్టులు సిగ్గుచేటు

    తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాను. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో పరిపాటి అయిపోయింది. తెలంగాణ ప్రజలు వచ్చేఎన్నికల్లో కేసిఆర్ కు, బీఆర్ యస్ పార్టీకి బుద్ది చెబుతారు.. అంటూ ఏపీ బీజేపీ నేతల ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.

  • 05 Apr 2023 08:28 AM (IST)

    బండి సంజయ్ అరెస్ట్‌పై కేటీఆర్ స్పందన

    • రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్ట్‌పై కేటీఆర్ స్పందన
    • బండి అరెస్ట్‌పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌
    • ఆ ట్వీట్‌లో పేపర్ లీక్ కుంభకోణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని చెప్పడానికి ఇది మరో నిదర్శనం
    • ఇక వాట్సాప్ గ్రూపుల్లో పేపర్‌ వైరల్ చేసిన నిందితుడు బండి సన్నిహితుడని.. బండి అరెస్ట్‌పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌
  • 05 Apr 2023 08:21 AM (IST)

    అరెస్టు ఎందుకు..?

    అసలు బండి సంజయ్‌ని ఎందుకు అరెస్ట్ చేశారన్నదానిపై పోలీసులు కూడా క్లారిటీ ఇవ్వలేదన్నది ఆయన కుటుంబీకులు చెబుతున్నమాట. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌లో కూర్చుని బండి అడుగుతోంది కూడా అదే. ఇంతకీ 151 సీఆర్‌పీసీ డీటేల్స్ ఏంటి. అసలది ఏం చెబుతోంది. అరెస్ట్‌ తర్వాత పరిణామాలు ఎలా ఉండొచ్చు. ఒక ఎంపీకి ఆ రూల్ అప్లై చెయ్యొచ్చా.. ! ఇవన్నీ క్లారిటీ రావాల్సిన ప్రశ్నలు..

    టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్‌ వ్యవహారమా? పదోతరగతి పరీక్షాపత్రాల వ్యవహారమా? బండి సంజయ్ అరెస్ట్‌ ఎందుకన్నది ఇంతవరకూ క్లారిటీ లేదు. CRPC 151 అని చెప్పి తీసుకెళ్లినట్లు కరీంనగర్ పోలీసులు పేర్కొంటున్నారు. దీని ప్రకారం అయితే.. నేరం జరగకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే చర్య అని పేర్కొంటున్నారు.

  • 05 Apr 2023 07:38 AM (IST)

    గొంతు నొక్కేందుకే అరెస్టులు..

    లిక్కర్ క్వీన్, లీకు వీరుడిని కాపాడేందుకు కేసీఆర్ చేస్తున్న యత్నాలను బహిర్గతం చేస్తున్న బండి సంజయ్.. గొంతు నొక్కేందుకు అరెస్టులు చేస్తున్నారంటూ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఅర్ సర్కార్ మానవ హక్కుల ఉల్లంఘన, పార్లమెంట్ సభ్యడి హక్కులను కాలరాస్తోందంటూ మండిపడ్డారు.

  • 05 Apr 2023 07:19 AM (IST)

    పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం

    బండి సంజయ్ అరెస్ట్ అనంతరం ఆయన ఇంటికి బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్ట్ వెనుక కారణాలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

  • 05 Apr 2023 07:03 AM (IST)

    హిందీ పేపర్ లీక్ నుంచి బండి సంజయ్ అరెస్టు వరకు.. అప్డేట్స్..

    • నిన్న ఉదయం 9.45కి బయటికొచ్చిన పదోతరగతి హిందీ పేపర్
    • నిన్న రాత్రి 8.30కి వరంగల్‌ సీపీ ప్రెస్‌ మీట్‌
    • బండి సంజయ్‌కి పేపర్‌ వెళ్లిందని ప్రకటించిన సీపీ రంగనాథ్‌
    • రాత్రి 11 గం.లకు బండి ఇంటికి కరీంనగర్‌ పోలీసులు
    • రాత్రి 11.30 బండి ఇంటికి భారీగా చేరుకున్న కార్యకర్తలు
    • అర్థరాత్రి 12 గంటల తర్వాత ఇంటి దగ్గర హైడ్రామా
    • అర్థరాత్రి 12.30 బండి సంజయ్‌ అరెస్ట్‌
    • ఈరోజు ఉ.4గం.కు బొమ్మలరామారం స్టేషన్‌కి తరలింపు
  • 05 Apr 2023 06:59 AM (IST)

    స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బండి సంజయ్..

    అర్ధరాత్రి తనను అరెస్టు చేయడంపై లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఎలాంటి వారెంట్‌ లేకుండా అరెస్ట్ చేశారన్నారు.. అర్థరాత్రి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి అరెస్ట్‌ చేశారని స్పీకర్‌కు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.

  • 05 Apr 2023 06:52 AM (IST)

    బండి సంజయ్ అరెస్టుపై స్పందించిన బీఎల్‌ సంతోష్

    సంజయ్‌ అరెస్ట్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం ఖండించింది. బీఆర్ఎస్‌ మునిగిపోయే నావ అంటూ బీఎల్‌ సంతోష్ మండిపడ్డారు. రాజకీయంగా BRSకు సమాధి అయ్యే రోజులు దగ్గరపడ్డాయి.. కేసీఆర్‌కు పాలన చేతగాక సంజయ్‌ను అరెస్ట్ చేయించారు.. అంటూ మండి పడ్డారు.

  • 05 Apr 2023 06:43 AM (IST)

    బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత..

    బండి సంజయ్ అరెస్టు అనంతరం.. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Published On - Apr 05,2023 6:39 AM

Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ