Hyderabad: అందుబాటులోకి మరో మెట్ల బావి.. ఓయూలోని చారిత్రక బావుల పునరుద్ధరణ పనుల ప్రారంభం
మెట్ల బావుల పునరుద్దరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. బాన్సీలాల్‌పేట్ బావికి టూరిస్టుల నుంచి ఆదరణ పెరగడంతో మరో బావిని అందుబాటులోకి తెస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న 18వ శతాబ్దకాలం నాటి చారిత్రాత్మక మెట్లబావి పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి.
మెట్ల బావుల పునరుద్దరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. బాన్సీలాల్‌పేట్ బావికి టూరిస్టుల నుంచి ఆదరణ పెరగడంతో మరో బావిని అందుబాటులోకి తెస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న 18వ శతాబ్దకాలం నాటి చారిత్రాత్మక మెట్లబావి పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజీ ఆవరణలో ఉన్న పురాతన మెట్లబావిని పునరుద్దరించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ కోరిక మేరకు.. హెచ్ఎండీఏ ఈపనులు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. బన్సీలాల్ పేట్ తరహాలోనే ఓయూలో ఉన్న చారిత్రక మూడు బావులను పునరుద్ధరించనున్నారు. పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారి కల్పనా రేమష్ బావి పనులను పరిశీలించారు. నగరంలో 80కి పైగా మెట్లబావులు ఉన్నాయని వీటన్నింటిని ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఇదిలాఉంటే ఓయూలో ఉన్న మెట్ల బావులను పునరుద్ధరించేందుకు వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ చొరవ తీసుకోవడం అభినందనీయం అన్నారు జీహెచ్ఎంసీ అధికారి కల్పనా. కార్పోరేట్ సామాజిక భాద్యత కింద నిధులు అందిస్తున్న ఎన్జీవోలు, వాలంటరీ సమూహాలకు కృతజ్ఞతలు చెప్పారు. పనులను పరిశీలించిన వీసీ, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ మెట్లబావి ఆవరణలో ఉన్న చెత్తాచెదారాన్ని అధికారులతో కలిసి తొలగించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..