IPL 2023: ధోనినా మజాకా.. 400 స్ట్రైక్‌ రేట్‌తో శివాలెత్తిన మిస్టర్‌ కూల్.. వరుస సిక్సర్లతో అరుదైన రికార్డు ఖాతాలోకి

ఈ ఇన్నింగ్స్‌ లో ధోని సిక్సర్లు హైలెట్‌గా నిలిచాయి. సోమవారం నాటి మ్యాచ్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. వరుసగా రెండు సిక్సర్లు కొట్టి అభిమానులను అలరించాడు. మార్క్‌వుడ్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికే రవీంద్ర జడేజా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో క్రీజులోకి వచ్చిన ధోని ..

IPL 2023: ధోనినా మజాకా.. 400 స్ట్రైక్‌ రేట్‌తో శివాలెత్తిన మిస్టర్‌ కూల్.. వరుస సిక్సర్లతో అరుదైన రికార్డు ఖాతాలోకి
Ms Dhoni
Follow us
Basha Shek

|

Updated on: Apr 04, 2023 | 5:45 AM

సుమారు మూడేళ్ల తర్వాత సొంత మైదానంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న ధోని సేన విజృంభించింది. చెపాక్ వేదికగా ఆదివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో ధోని సేన 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(57), డెవాన్‌ కాన్వే(47), అంబటి రాయుడు(14) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నై భారీస్కోరు బాటలు వేశారు. అయితే ఈ ఇన్నింగ్స్‌ లో ధోని సిక్సర్లు హైలెట్‌గా నిలిచాయి. సోమవారం నాటి మ్యాచ్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినన ధోని.. వరుసగా రెండు సిక్సర్లు కొట్టి అభిమానులను అలరించాడు. మార్క్‌వుడ్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికే రవీంద్ర జడేజా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో క్రీజులోకి వచ్చిన ధోని తొలి బంతినే నేరుగా స్టాండ్స్‌లోకి పంపించాడు. తర్వాత రెండో బంతిని కూడా భారీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఒక్కసారిగా చెపాక్‌ స్టేడియం మొత్తం ధోని నినాదాలతో హోరెత్తిపోయింది. నినాదంతో దద్దరిల్లిపోయింది. అయితే ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్‌ దగ్గర రవి బిష్ణోయ్‌కు చిక్కాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 3 బంతులు ఎదుర్కొన్న ధోని 400 స్ట్రైక్‌ రేట్‌తో 12 పరుగులు చేశాడు. ఈక్రమంలో ధోని సిక్సర్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా లక్నోతో మ్యాచ్‌లో ఎంస్‌ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలు రాయిని అందుకున్న ఏడో బ్యాటర్‌గా, ఐదో భారత ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు. ఇక ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్‌ కోహ్లి(6706) పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత శిఖర్‌ ధావన్‌ 6086 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..