CSK Vs LSG: మొయిన్ అలీ స్పిన్‌కు లక్నో విలవిల.. బోణి కొట్టిన ధోని సేన.. మేయర్స్ మెరుపు ఇన్నింగ్స్ వృథా
ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం చెపాక్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్నై 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. తద్వారా ఐపీఎల్16 ఎడిషన్‌లో ధోని సేన విజయాల ఖాతా తెరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై రుతురాజ్ గైక్వాడ్ (57), డెవాన్ కాన్వే (47) పరుగులు చేయడంతో..

2019 తర్వాత చెన్నైలో మ్యాచ్ ఆడుతోన్న ధోని సేన అభిమానులను నిరాశపరచలేదు. ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం చెపాక్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్నై 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. తద్వారా ఐపీఎల్16 ఎడిషన్‌లో ధోని సేన విజయాల ఖాతా తెరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. రుతురాజ్ గైక్వాడ్ (57), డెవాన్ కాన్వే (47) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నో కూడా ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కైల్ మేయర్స్ ( 22 బంతుల్లో 53, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), నికోలస్ పూరన్ ( 18 బంతుల్లో 32, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా మిగతా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఆఖరులో ఆయుష్ బదోని ( 18 బంతుల్లో23 ), కృష్ణప్ప గౌతమ్ ( 11 బంతుల్లో 17 నాటౌట్), మార్క్ వుడ్ (3 బంతుల్లో 10) పోరాడినా అప్పటికే రన్‌రేట్ అమాంతం పెరిగిపోయింది. దీంతో విజయానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కేఎల్ రాహుల్ (20), స్టాయినిస్ (21) పరుగులు చేశారు. దీపక్ హుడా (2), కృనాల్ పాండ్య (9) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ (4/26) లక్నోను కట్టడి చేశారు. అలీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. కాగా లక్నో తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ ( 31 బంతుల్లో 57, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవాన్ కాన్వే (29 బంతుల్లో 47, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతంగా ఆడారు. ఆతర్వాత శివమ్ దూబె ( 16 బంతుల్లో 27, 1 ఫోర్, 3 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. చివర్లో అంబటి రాయుడు (14 బంతుల్లో 27, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధోనీ ( 3 బంతుల్లో12, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో లక్నో ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.




This one’s for you, Anbuden! ?#CSKvLSG #WhistlePodu #Yellove ?? pic.twitter.com/tmxYaVP7z4
— Chennai Super Kings (@ChennaiIPL) April 3, 2023
Kan kolla Catch’i! ?#CSKvLSG #WhistlePodu #Yellove ??pic.twitter.com/cktpDzqb8O
— Chennai Super Kings (@ChennaiIPL) April 3, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..