AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: చెపాక్‌లో ధోనీ శిష్యుడి ఊచకోత.. హాఫ్ సెంచరీతో లక్నో‌కు చుక్కలు.. కట్‌చేస్తే.. భారీ సిక్స్‌తో డ్యామేజైన కారు..

CSK vs LSG: తొలి మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయిన రితురాజ్ గైక్వాడ్ తన రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు. ఈ ఆటగాడు లక్నోపై కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.

Video: చెపాక్‌లో ధోనీ శిష్యుడి ఊచకోత.. హాఫ్ సెంచరీతో లక్నో‌కు చుక్కలు.. కట్‌చేస్తే.. భారీ సిక్స్‌తో డ్యామేజైన కారు..
Venkata Chari
|

Updated on: Apr 03, 2023 | 9:37 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఆరో మ్యాచ్‌లో రితురాజ్ గైక్వాడ్ అద్భుతమైన బ్యాటింగ్ కనిపించింది. గైక్వాడ్ గత మ్యాచ్‌లో 92 పరుగులు చేసి, కేవలం 8 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ ఆటగాడు లక్నోపై కూడా తన బలమైన ప్రదర్శనను కొనసాగించాడు. గైక్వాడ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. రితురాజ్ గైక్వాడ్ 31 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 3 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. గైక్వాడ్ తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో లక్నో లయను దెబ్బ తీశాడు.

రితురాజ్ గైక్వాడ్ తన మూడో సిక్స్ సమయంలో మైదానంలో పార్క్ చేసిన కారును డ్యామేజ్ చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ చెన్నై ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదాడు. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఓవర్ రెండో బంతికి రితురాజ్ గైక్వాడ్ వరుస సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో గైక్వాడ్ నాలుగో బంతికి లాంగ్ ఆఫ్ ఓవర్ సిక్సర్ బాదాడు. ఆఖరి బంతికి గైక్వాడ్ కవర్స్ మీదుగా సిక్సర్ కొట్టగా, బంతి అక్కడ ఉంచిన కారును తాకింది. గైక్వాడ్ కొట్టిన ఈ షాట్‌కి కారుకు సైడ్ తగలడంతో కొద్దిగా సొట్ట పడింది.

చెన్నైకి అదిరిపోయే ఆరంభం..

చెన్నైకి రితురాజ్ గైక్వాడ్ చురుకైన ఆరంభాన్ని అందించాడు. కాన్వేతో కలిసి గైక్వాడ్ పవర్‌ప్లేలో 79 పరుగులు చేశాడు. చెపాక్‌లో తొలిసారిగా పవర్‌ప్లేలో చెన్నై భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాట్స్‌మెన్‌లిద్దరూ కలిసి చెన్నై స్కోరును 8 ఓవర్లలో 100 దాటించారు. కాన్వే, గైక్వాడ్ మూడోసారి సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఐపీఎల్‌లో తొలిసారిగా చెన్నై ఓపెనర్లు మూడు సెంచరీల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

గైక్వాడ్‌కు తుఫాన్ ఇన్నింగ్స్..

ఈ ఐపీఎల్ సీజన్‌లో 100 మార్కును దాటిన తొలి ఆటగాడిగా రితురాజ్ గైక్వాడ్ నిలిచాడు. గైక్వాడ్ 2 మ్యాచ్‌ల్లో 149 పరుగులు చేశాడు. అతని సగటు 74.50గా నిలిచింది. ఈ ప్లేయర్ స్ట్రైక్ రేట్ కూడా 183.95గా మారింది. గైక్వాడ్ 2 మ్యాచ్‌ల్లో 13 సిక్సర్లు కొట్టాడు.