AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam: ఇంట గెలిచి రచ్చ గెలుస్తోన్న బలగం.. వేణు సినిమాకు మరో అంతర్జాతీయ పురస్కారం.. ఇప్పటివరకు ఎన్ని అవార్డులంటే?

కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలను చూపించిన తీరు అందరనీ కట్టిపడేస్తోంది. అందుకే తెలంగాణలోని పలు పల్లెల్లో.. ఒకప్పటిలా గ్రామస్థులంతా కలిసి చూసే విధంగా తెరలు కట్టి 'బలగం' సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇలా ఓ వైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలో దూసుకుపోతోన్న ఈ సినిమాకు అవార్డులు కూడా క్యూ కడుతున్నాయి..

Balagam: ఇంట గెలిచి రచ్చ గెలుస్తోన్న బలగం.. వేణు సినిమాకు మరో అంతర్జాతీయ పురస్కారం.. ఇప్పటివరకు ఎన్ని అవార్డులంటే?
Balagam Movie
Basha Shek
|

Updated on: Apr 03, 2023 | 5:50 AM

Share

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బలగం సినిమా పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా బలగం సినిమా చూశావా? అని ఒకరికొకరు అడుగుతున్నారు. అంతలా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయిందీ అచ్చ తెలుగు సినిమా. పల్లెటూరి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను, యాస, భాషలను సిల్వర్‌ స్ర్కీన్‌పై అద్భుతంగా చూపించాడు మొదటిసారి మెగాఫోన్‌ పట్టుకున్న వేణు. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలను చూపించిన తీరు అందరనీ కట్టిపడేస్తోంది. అందుకే తెలంగాణలోని పలు పల్లెల్లో.. ఒకప్పటిలా గ్రామస్థులంతా కలిసి చూసే విధంగా తెరలు కట్టి ‘బలగం’ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇలా ఓ వైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలో దూసుకుపోతోన్న ఈ సినిమాకు అవార్డుల పంట పండుతోంది. కొన్ని రోజుల క్రితం బలగం చిత్రానికి బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఫీచర్‌ఫిల్మ్‌ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్‌ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. అలాగే తెలుగు సినిమా వేదిక నుంచి ఉగాది పురస్కారాల నంది అవార్డునూ దక్కించుకుంది. తాజాగా బలగం సినిమా ఖాతాలో మరో ఇంటర్నేషనల్‌ అవార్డు వచ్చి చేరింది.

ఉక్రెయిన్ కి చెందిన ఒనికో ఫిలిం అవార్డ్స్ లో ఇండియా నుంచి బెస్ట్ ఫీచర్ చిత్రంగా ‘బలగం’ పురస్కారం కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ వేణు సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నాడు. ఇప్పటివరకు తమ సినిమాకు నాలుగు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందన్నాడు. తన బృందం వల్లే ఇదంతా సాధ్యమైందంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక హీరో ప్రియదర్శి ‘ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం’ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో ఈ విషయాన్ని పంచుకుని మురిసిపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..
23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్
23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్
ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర
ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర
పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..
పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..