Inspiring: శభాష్ షర్మిల.. మొదటి మహిళా బస్‌ డ్రైవర్‌గా 24 ఏళ్ల అమ్మాయి.. సెల్యూట్ చేస్తోన్న ప్రయాణికులు

కోయంబత్తూరుకు చెందిన షర్మిల ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. సోషల్‌ మీడియాలో ఈమె వీడియోలో ట్రెండ్‌ అవుతున్నాయ్‌. ఎందుకంటే, ఈ యువతి బస్సు నడుపుతోన్న దృశ్యాలు చూసి జనం అవాక్కవుతున్నారు. కోయంబత్తూరులో తొలి మహిళా ..

Inspiring: శభాష్ షర్మిల.. మొదటి మహిళా బస్‌ డ్రైవర్‌గా 24 ఏళ్ల అమ్మాయి.. సెల్యూట్ చేస్తోన్న ప్రయాణికులు
M Sharmila
Follow us
Basha Shek

|

Updated on: Apr 02, 2023 | 5:55 AM

మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపిస్తోంది ఓ యువతి. పురుషులు మాత్రమే అధికంగా ఉండే డ్రైవింగ్‌ ఫీల్డ్‌ని వృత్తిగా ఎంచుకుని అందరితో శెభాష్‌ అనిపించుకుంటోంది. తమిళనాడు కోయంబత్తూరులో బస్సు నడుపుతూ అక్కడి జనాన్ని ఆకట్టుకుంటోంది షర్మిల. కేవలం స్టీరింగ్‌ పట్టుకొని బస్సు నడపడమే కాదు.. ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. కోయంబత్తూరుకు చెందిన షర్మిల ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. సోషల్‌ మీడియాలో ఈమె వీడియోలో ట్రెండ్‌ అవుతున్నాయ్‌. ఎందుకంటే, ఈ యువతి బస్సు నడుపుతోన్న దృశ్యాలు చూసి జనం అవాక్కవుతున్నారు. కోయంబత్తూరులో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా ఈ యువతి రికార్డు సృష్టించింది. గాంధీపురం-సోమనూరు రూట్‌లో బస్సు నడుపుతోన్న ఈ యువతిని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. బస్సు ఎక్కడ ఆగితే అక్కడ ఆమె చుట్టూ చేరి సెల్ఫీలు దిగుతున్నారు. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా, వాడవల్లిలోని తిరువల్లువర్‌నగర్‌కు చెందిన 24ఏళ్ల ఎం.షర్మిల బతుకుదెరువు కోసం ప్రైవేట్‌ బస్సు స్టీరింగ్‌ పట్టుకుంది. గాంధీపురం-సోమనూరు మార్గంలో బస్సు నడుపుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. యువతి బస్సు నడపడం చూసి అక్కడి ప్రజలు అవాక్కవుతున్నారు.

బతుకు దెరువు కోసం..

ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించి ప్రయత్నించి చివరికి బస్సు డ్రైవర్‌గా మారింది షర్మిల. బతుకుదెరువు కోసం ఎంతోకష్టపడి డ్రైవింగ్‌ నేర్చుకొని బస్సు డ్రైవర్‌గా మారినట్టు చెబుతోంది. బస్సును నేర్పుగా నడపడం పురుషులు మాత్రమే మహిళలు కూడా చేయగలరని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. మహిళలు కూడా ఎంతో పర్ఫెక్ట్‌గా బస్సును నడపగలరని చూపించడానికే తాను స్టీరింగ్‌ పట్టానంటోంది షర్మిల. పట్టుదలతో డ్రైవింగ్‌ నేర్చుకున్న షర్మిల, లైసెన్స్‌ పొందిన వెంటనే ఓ ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్‌ దగ్గర డ్రైవర్‌ ఉద్యోగం కోసం అప్లై చేసుకుంది. ఆమెకు డ్రైవింగ్‌ టెస్ట్‌ పెట్టిన యజమానులు.. షర్మిల స్టీరింగ్‌ నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆమె ప్రతిభను గుర్తించి డ్రైవర్‌గా ఉద్యోగం కల్పించారు. అలా, గాంధీపురం-సోమనూరు రూట్‌లో బస్సు నడుపుతోంది షర్మిల.

ఇవి కూడా చదవండి

ప్రశంసల వర్షం..

ఈ యువతి బస్సు నడుపుతున్న దృశ్యాలను రికార్డుచేసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో అవన్నీ ట్రెండ్‌ అవుతున్నాయ్‌. అయితే, తాను ఎంచుకున్న రంగంలో పైకి రావాలని కష్టపడ్డాను, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లెక్కచేయకుండా మహిళలు కష్టపడి పైకి రావాలని చెబుతోంది షర్మిల. ఈ యువతి బస్సు నడపటం తమిళనాట హాట్‌ టాపిక్‌గా మారింది. స్థానికులు శెభాష్‌ షర్మిల అంటూ అభినందిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి