AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ రాజకీయాల్లో అలజడి రేపిన సుఖేష్‌ లేఖ…ఢిల్లీ నుంచి తెలంగాణ దాకా..

తప్పు చేయనప్పుడు భయమేందుకు అని ప్రశ్నిస్తోంది BJP. సుఖేష్‌ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెబుతోంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నది కమలనాథుల లాజిక్.

తెలంగాణ రాజకీయాల్లో అలజడి రేపిన సుఖేష్‌ లేఖ...ఢిల్లీ నుంచి తెలంగాణ దాకా..
Sukesh Chandrasekhar
Jyothi Gadda
|

Updated on: Apr 01, 2023 | 9:55 PM

Share

సుఖేష్‌ చంద్రశేఖర్..! భగభగ మండుతున్న తెలంగాణ రాజకీయాల్లో పెట్రోల్‌ పోసిన వ్యక్తి..! ఎక్కడో తీహార్ జైల్లో ఉండి.. ఇక్కడ ఓ రేంజ్‌లో రచ్చ రాజేశాడు. ఇప్పటికే పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్న లిక్కర్‌స్కామ్‌లో సుఖేష్‌ లేఖ ఓ సంచలనం.! సుఖేష్ సెంట్రిక్‌గా BRS-BJP మధ్య అగ్గి రాజుకుంది. హైవోల్టేజ్ డైలాగ్‌ వార్ షురూ అయింది. ఇంతకీ ఏది నిజం? ఎవరి వర్షన్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

200 కోట్ల ఛీటింగ్ కేసులో నిందితుడు. తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీ. ఆర్థిక నేరగాడు. మహా మాయగాడు. మోసగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సుఖేష్‌ చంద్రశేఖర్ నేరాల చిట్టా కొండవీటి చాంతాడే అవుతుంది. 2017 నుంచి జైల్లోనే మగ్గుతున్నాడు. అలాంటి వ్యక్తి దేశరాజకీయాలను కుదిపేస్తున్న బర్నింగ్ టాపిక్‌ను టచ్ చేశాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెంట్రిక్‌గా మొదలు పెట్టి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ వరకూ వచ్చేశాడు. లేఖలో అనేక సంచలన ఆరోపణలు చేశాడు. లిక్కర్ స్కామ్ దర్యాప్తు క్లైమాక్స్‌కు చేరిన టైమ్‌లో సుఖేష్ ఎందుకు నోరు విప్పాడన్నదే ఇప్పుడు అసలు పాయింట్

మిగతా అంశాల సంగతి పక్కన పెడితే సుఖేష్‌ మెయిన్‌గా చేసిన ఆరోపణలు రెండు. కేజ్రీవాల్ చెప్పినట్లుగా 75 కోట్లను ఐదు విడతల్లో BRSకు అందజేశానన్నది మొదటి ఆరోపణ. రెండోది AP అనే వ్యక్తికి ఆ డబ్బులు చేరవేశానని చెప్పడం. లిక్కర్‌స్కామ్‌ పరంగా చూస్తే ఇది బిగ్‌ డెవలప్‌మెంట్.! ఇప్పుడు ఆ 75 కోట్లు ఎవరికి చేరాయి? అజ్ఞాత వ్యక్తి AP ఎవరు అన్నది తేలాల్సి ఉంది. AP అంటే అరుణ్‌ పిళ్లై అనే ప్రచారం జరుగుతున్నా స్పష్టత మాత్రం లేదు..! ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుందని సుఖేష్‌ లాయర్ అనంత్‌ మాలిక్‌కూడా చెబుతున్నాడు..

ఇవి కూడా చదవండి

సుఖేష్‌ సెంట్రిక్‌గా ఇప్పటికే రచ్చ రాజుకుంది. BRS- BJP మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్‌కు చేరింది. జైలు పక్షితో చిలుక పలుకులు పలికిస్తోన్నది BJP అని ఆరోపిస్తోంది గులాబీదళం. పైగా సుఖేష్ చెప్పిన తేదీల్లో తెలంగాణ భవన్ సీసీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చని సవాల్ విసురుతోంది..BYTE (దాస్యం వినయ్ భాస్కర్)

తప్పు చేయనప్పుడు భయమేందుకు అని ప్రశ్నిస్తోంది BJP. సుఖేష్‌ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెబుతోంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నది కమలనాథుల లాజిక్.

సుఖేష్‌ చెబుతున్నట్లుగా కేజ్రీవాల్‌తో జరిగిన 700 పేజీల వాట్సప్, టెలిగ్రామ్ చాటింగ్‌లు ఉన్నాయా? 6060 అనే రేంజ్‌ రోవర్ కారు ఎవరిది? అంత పక్కాగా నెంబర్ ఎలా చెబుతున్నారన్నది తేలాల్సి ఉంది. ఇక సుఖేష్ లెటర్ సెంట్రిక్‌గా రాజుకున్న పొలిటికల్ దుమారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందన్ని ఆసక్తికరంగా మారింది..

మరిన్ని జాతీయ వార్తల కోసం..