AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాడిదలో దేవుడి రూపాన్ని చూసుకున్న గ్రామస్తులు.. మూగజీవికి సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు..

ఇది చూసిన గ్రామస్తులు గాడిదలో దైవానుభూతిని చూసి జాతి బేధాలు లేకుండా గాడిదను తమ కుటుంబంలోని సభ్యుడిగా పెంచారు. అయితే, అనారోగ్య కారణాల వల్ల మూడు రోజుల క్రితం గాడిద చనిపోయింది. దీంతో గ్రామస్థులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.

గాడిదలో దేవుడి రూపాన్ని చూసుకున్న గ్రామస్తులు.. మూగజీవికి సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు..
Cremation Of The Donkey
Jyothi Gadda
|

Updated on: Apr 01, 2023 | 9:48 PM

Share

కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం నివాళులర్పించడం ఆనవాయితీ. అయితే ఈ ఒక్క గ్రామంలో దేవుడి గాడిద మృతి చెందడంతో గ్రామం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటూ ఆ గాడిదకు భావోద్వేగంతో నివాళులర్పించింది. హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన గాడిదను అలంకరించి గ్రామస్తులు ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, నేటి సమాజంలో చాలా మంది చనిపోయిన వారి కుటుంబ సభ్యుల దహన సంస్కారాలకు కూడా రాని జనాల్లో ఈ విధంగా ఓ జంతువుకు నివాళులు అర్పించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హోల్‌కెరె తాలూకా మద్దేరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో. మానవీయ దృశ్యాలకు సాక్షిగా నిలుస్తుందంటున్నారు పలువురు నెటిజన్లు. పూర్తి వివరాల్లోకి వెలితే..

మూడు నెలల క్రితమే గ్రామానికి ఒక గాడిద వచ్చింది. అప్పటి నుంచి ఊరి ప్రజలతోనే కలిసిపోయి ఉంటోంది. ఇది చూసిన గ్రామస్తులు గాడిదలో దైవానుభూతిని చూసి జాతి బేధాలు లేకుండా గాడిదను తమ కుటుంబంలోని సభ్యుడిగా పెంచారు. అయితే, అనారోగ్య కారణాల వల్ల మూడు రోజుల క్రితం గాడిద చనిపోయింది. దీంతో గ్రామస్థులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. గాడిద మృత దేహాన్ని ఊరంతా ఊరేగించి, ఒక మనిషికి ఇచ్చిన గౌరవాన్ని ఆ మూగజీవికి ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా మానవతా విలువలను చాటి చెప్పారు. అంత్యక్రియలు నిర్వహించిన చోట పందిరిలా ఏర్పాటు చేసిన పూలతో అలకంరించారు. వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ ఒక్క మద్దేరు గ్రామం చారిత్రక ఖ్యాతిని కలిగి ఉంది. ఇక్కడ అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉంటారు. అదేవిధంగా గత మూడు నాలుగు నెలలుగా గాడిద మా ఊరికి రావడంతో ప్రతి ఒక్కరూ దానికి ఉదయం, సాయంత్రం పూజలు చేశారు. గాడిదలో భగవంతుని రూపాన్ని చూశారు. ఇంట్లో చిన్నపిల్లాడిలా తీపి తినిపించేవారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..