Viral Video: పోలీస్‌ స్టేషన్‌లో నవ వధువు హల్‌చల్‌.. ప్రియుడు కావాలంటూ హై వోల్టేజ్‌ డ్రామా..!

వధువును కంట్రోల్ చేసేందుకు మహిళా కానిస్టేబుళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆమెను అదుపుచేయలేకపోయారు.  ఆమె పేపర్, మొబైల్ ఫోన్ విసిరి గొల గొల చేస్తుంది. ఇక లాభం లేదు అనుకుని చివరకు..

Viral Video: పోలీస్‌ స్టేషన్‌లో నవ వధువు హల్‌చల్‌.. ప్రియుడు కావాలంటూ హై వోల్టేజ్‌ డ్రామా..!
Newlywed Brides
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 01, 2023 | 7:59 PM

పూర్వం పెళ్లి అంటే నూరేళ్ల పంట అనేవారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో భార్యాభర్తలు చివరి క్షణం వరకు ప్రేమ, నమ్మకంతో కలిసి మెలిసి ఉంటారని చెప్పేవారు. నాలుగైదు రోజుల పాటు కళ్యాణం పండుగలా జరిగేది. కానీ ఇప్పుడు పెళ్లిళ్లు చాలా వరకూ తూతూ మంత్రంగానే జరిగిపోతున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు, ప్రేమ విఫలం కావటంతో ఎవరో ఒకరితో బలవంతంగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లికి సంబంధించిన ఆచార వ్యవహారాలను కూడా పాటించడం లేదు. పైగా పెళ్లిళ్లు హై డ్రామాగా మారిపోతున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెళ్లయిన క్షణాల్లోనే తన ప్రేమికుడిని పెళ్లి చేసుకోమని బలవంతపెట్టి పోలీస్ స్టేషన్‌ చేరింది ఓ నవ వధువు. అక్కడ ఆమె హై వోల్టేజ్ డ్రామా సృష్టించింది. మొదట ఆ యువతి కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు వారు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కానీ, పెళ్లి అయిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని పోలీసులను కోరింది. అంతేకాదు పోలీస్‌స్టేషన్‌లో హల్‌చల్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సర్వత్రా వైరల్‌గా వ్యాపింది.

ఇవి కూడా చదవండి

పెళ్లికూతురు రెడ్, గోల్డ్ కలర్ చీర కట్టుకుని పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో వధువు ‘రెండు పెళ్లిళ్లు.. ‘ఇద్దరి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది’ అంటూ గట్టిగట్టి అరుపులు పెట్టడం వినిపిస్తుంది. వధువును కంట్రోల్ చేసేందుకు మహిళా కానిస్టేబుళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆమెను అదుపుచేయలేకపోయారు.  ఆమె పేపర్, మొబైల్ ఫోన్ విసిరి గొల గొల చేస్తుంది. ఇక లాభం లేదు అనుకుని చివరకు ఒక మహిళా కానిస్టేబుల్ ఆమెను గదిలోకి లాక్కెళ్లడం చూడవచ్చు. అయితే, ఇక్కడ ఆ వధువు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..