ప్లీజ్ అరెస్ట్ చేయండి సార్.. పోలీసులను వేడుకున్న దొంగ..

ఉత్తర్​ప్రదేశ్​లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎన్​కౌంటర్​ చేస్తారనే భయంతో ఓ వ్యక్తి పోలీస్​ స్టేషన్​కు నేరుగా వచ్చి లొంగిపోయాడు. ఆ తర్వాత తనను జైలుకు పంపాలని వేడుకున్నాడు.

ప్లీజ్ అరెస్ట్ చేయండి సార్..  పోలీసులను వేడుకున్న దొంగ..
accused
Follow us

|

Updated on: Apr 01, 2023 | 8:01 PM

ఉత్తర్​ప్రదేశ్​లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎన్​కౌంటర్​ చేస్తారనే భయంతో ఓ వ్యక్తి పోలీస్​ స్టేషన్​కు నేరుగా వచ్చి లొంగిపోయాడు. ఆ తర్వాత తనను జైలుకు పంపాలని వేడుకున్నాడు. ఈ ఘటన సుహాన్​పుర్ జిల్లా ఫతేపుర్​పోలీస్​స్టేషన్​లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే అభినవ్​ అనే వ్యక్తి ముజఫర్​పుర్​ జిల్లా బుధానా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఉంటున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం అభినవ్ మరో ఇద్దరు వ్యక్తులతో కలసి ఓ ఫైనాన్స్​ కంపెనీ వ్యక్తి నుంచి రూ. 2.75 లక్షలు దొంగిలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మార్చి 16న రాహుల్​, సచిన్​ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ప్రధాన సూత్రధారి అభినవ్​మాత్రం తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి కోసం పోలీసులు అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్ని గాలించినప్పటికీ అతని జాడ దొరకలేదు. చివరకు అభినవ్​ను పట్టుకుని అప్పగిస్తే రూ. 25 వేలు బహుమతి ఇస్తామని పోలీసులు రివార్డు కూడా ప్రకటించారు.

తన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని, రివార్డు కూడా ప్రకటించారనే విషయం తెలుసున్న అభినవ్… పోలీసులు ఎన్​కౌంటర్​ చేస్తారేమోనని భయపడిపోయాడు. వెంటనే తనకు తానుగా ఫతేపుర్​ పోలీస్​ స్టేషన్​కు వచ్చి లొంగిపోయాడు. ‘సర్​ నన్ను అరెస్టు చేయండి. జైలుకు పంపండి. ఎన్​కౌంటర్​ అంటే నాకు చాలా భయం. ఇలాంటి నేరాలు భవిష్యత్​లో మళ్లీ ఎప్పుడూ చేయను’ అని రాసి ఉన్న ప్లకార్డును కూడా తెచ్చుకుని పోలీసుల మందు ప్రదర్శించాడు. తన నేరాన్ని అంగీకరించి.. తాను దొంగిలించిన డబ్బుల్లో సుమారు రూ.40 వేలు పోలీసులకు అప్పగించాడు. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

అభినవ్ ను పోలీసులు విచారించగా..అతను పలు విషయాలు వెల్లడించాడు. తన పేరు, చిరునామాతో పాటు.. తాను డిగ్రీ చదువుకున్నానని, కలెక్షన్​ ఏజెంట్​గా పనిచేసేవాడినని చెప్పాడు. ఆ సమయంలోనే ఇల్లు కట్టుకోవడం కోసం సచిన్​ లోన్​ తీసుకున్నాడని.. అలా తమ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపాడు. సచిన్​కు డబ్బు చాలకపోవడంతో.. లోన్​ చెల్లించలేదని చెప్పాడు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని.. తన ఫ్రెండ్​ రాహుల్​తో కలిసి దొంగతనం చేసేందుకు ప్లాన్​ వేశామని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!