Hyderabad: భాగ్యనగరంలో ఐపీఎల్ ఫీవర్.. ఉప్పల్ వేదికగా రేపు హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్..
భాగ్యనగరంలో మూడేళ్ల తర్వాత ఐపీఎల్ ఫీవర్ నెలకొంది. ఈ ఐపీఎల్ సీజన్ క్రికెట్ అభిమానులలో కొత్త జోష్ నింపనుంది. ఇప్పటికే ఉప్పల్ జరిగే మొదటి మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోగా.. మిగతా మ్యాచ్‌లకు టికెట్ల విషయంలో డిమాండ్ ఏర్పడింది.
భాగ్యనగరంలో మూడేళ్ల తర్వాత ఐపీఎల్ ఫీవర్ నెలకొంది. ఈ ఐపీఎల్ సీజన్ క్రికెట్ అభిమానులలో కొత్త జోష్ నింపనుంది. ఇప్పటికే ఉప్పల్ జరిగే మొదటి మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోగా.. మిగతా మ్యాచ్‌లకు టికెట్ల విషయంలో డిమాండ్ ఏర్పడింది. మొత్తం ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్ లు జరగనున్నాయి. దీంతో ఫ్యాన్స్సంతోషంలో మునిగితేలుతున్నారు. కాగా.. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం రెండు జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. రేపు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజస్థాన్ రాయల్స్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను హెచ్‌సీఏ ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఐపీఎల్ కోసం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ముస్తాబైంది. మ్యాచ్‌ల నిర్వహణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. మధ్యాహ్నాం మూడున్నర్‌కు ప్రారంభమయ్యే మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు అన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి.
కరోనా కారణంగా 2019 తర్వాత ఈ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు జరగనుండటంతో క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ నేపథ్యంలో స్టేడియాన్ని రంగురంగులతో ముస్తాబు చేశారు.చాలా రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు భాగ్యనగరంలో జరుగుతుండడంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం మరోసారి ఫ్యాన్స్ కేరింతలతో మురిసిపోనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..