Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు.. ఏప్రిల్ 8న ఏయే స్టేషన్లలో ఆగనుందంటే?

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు.. ఏప్రిల్ 8న ఏయే స్టేషన్లలో ఆగనుందంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు నెలల స్వల్ప వ్యవధిలో తెలంగాణ నుంచి ప్రారంభం కానున్న రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రైలు రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు మూడున్నర గంటలు తగ్గిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల యాత్రికుల ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భారతదేశ స్వదేశీ సెమీ-హై స్పీడ్ రైలు ఐటి సిటీ హైదరాబాద్‌.. తిరుపతి మధ్య పరుగులు తీయనుంది.
Follow us

|

Updated on: Apr 01, 2023 | 2:07 PM

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ విచ్చేయనున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెండో వందేభారత్ రైలును గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు. తొలి రోజు(ఏప్రిల్ 8) ఈ ట్రైన్ ఉదయం 11. 30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఆ తేదీన నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు లాంటి అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగి.. రాత్రి 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

మొదటి రోజు ఆగే స్టాపులు ఇవే..

సికింద్రాబాద్: 11:30 గంటలకు

నల్గొండ: 13:05(వచ్చే సమయం) – 13:10(వెళ్లే సమయం)

మిర్యాలగూడ: 13:40(చేరుకునే సమయం) – 13:45(బయల్దేరే సమయం)

పిడుగురాళ్ళ: 14:30(చేరుకునే సమయం) – 14:35(బయల్దేరే సమయం)

గుంటూరు: 15:35(చేరుకునే సమయం) – 15:45(బయల్దేరే సమయం)

తెనాలి: 16:15(చేరుకునే సమయం) – 16:20(బయల్దేరే సమయం)

బాపట్ల: 16:50(చేరుకునే సమయం) – 16:55(బయల్దేరే సమయం)

చీరాల: 17:10(చేరుకునే సమయం) – 17:15(బయల్దేరే సమయం)

ఒంగోలు: 17:50(చేరుకునే సమయం) – 17:55(బయల్దేరే సమయం)

నెల్లూరు: 19:10(చేరుకునే సమయం) – 19:15( బయల్దేరే సమయం)

గూడూరు: 19:35(చేరుకునే సమయం) – 19:40(బయల్దేరే సమయం)

తిరుపతి: 21:00(చేరుకునే సమయం)

ఆ తర్వాత మరుసటి రోజు ఏప్రిల్ 9 నుంచి ఈ ట్రైన్ ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. వందేభారత్ రాకతో ఇక నుంచి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వాళ్లకు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ ట్రైన్‌లో కేవలం 8 గంటల 30 నిముషాల్లోనే తిరుపతి చేరుతుంది. ప్రధాన స్టేషన్లు అయిన నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టాపులుగా నిర్ణయించారు.

  • సికింద్రాబాద్-తిరుపతి(20701):

సికింద్రాబాద్ – ఉదయం 6.00 గంటలకు

నల్గొండ – ఉదయం 7.19 గంటలకు

గుంటూరు – ఉదయం 9.45 గంటలకు

ఒంగోలు – ఉదయం 11.09 గంటలకు

నెల్లూరు – ఉదయం 12.29 గంటలకు

తిరుపతి – మధ్యాహ్నం 2.30 గంటలకు

  • తిరుపతి – సికింద్రాబాద్(20702):

తిరుపతి – మధ్యాహ్నం 3.15 గంటలకు

నెల్లూరు – సాయంత్రం 5.20 గంటలకు

ఒంగోలు – సాయంత్రం 6.30 గంటలకు

గుంటూరు – రాత్రి 7.45 గంటలకు

నల్గొండ – రాత్రి 10.10 గంటలకు

సికింద్రాబాద్ – రాత్రి 11.45 గంటలకు

కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందేభారత్ రైలును పరుగులు పెట్టిస్తునందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రారంభోత్సవం రోజున మేక్ ఇన్ ఇండియా వందేభారత్ రైలు ఆగనున్న అన్ని స్టేషన్లలో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం తెలపాలని కిషన్ రెడ్డి కోరారు. అత్యధిక సామర్థ్యంతో, ప్రయాణికులకు అద్భుతమైన ప్రయాణ అనుభాతిని కలిగించేలా 400 వందేభారత్ రైళ్లను తయారు చేయాలని ప్రకటించిన భారతీయ రైల్వే, అధునాతనమైన కోచ్ లతో, వేగవంతమైన సేవలను, ప్రయాణ అనుభూతిని ప్రయాణికులకు అందించాలన్న లక్ష్యంతో ఈ రైళ్లను ప్రారంభించడం జరుగుతోంది. అత్యంత వేగంగా వేగాన్ని అందిపుచ్చుకోవడం, రాబోయే స్టేషన్ల సమాచార ప్రకటన, GPS వ్యవస్థతో కూడిన ప్రయాణికుల వివరాలు, ఆటోమేటిక్ గా తెరుచుకునే తలుపులు, ముడుచుకునే మెట్లు, బయో టాయిలెట్లు వంటి అధునాతన సదుపాయాలతో పాటు కవచ్ వంటి ఆధునిక భద్రతా సౌకర్యాలను ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వందేభారత్ రైళ్లలో కల్పించడం జరిగింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..