Hyderabad: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. చివరకు కిడ్నాప్ చేసి మైనర్ బాలికను..

ప్రేమ పేరిట బాలికను వలలో వేసుకున్నాడు.. చివరకు ఆమెకు దగ్గరయ్యాడు.. ఈ క్రమంలోనే ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు.. గుడిలో పెళ్లి చేసుకుని.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు..

Hyderabad: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. చివరకు కిడ్నాప్ చేసి మైనర్ బాలికను..
Rape Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 01, 2023 | 9:58 AM

ప్రేమ పేరిట బాలికను వలలో వేసుకున్నాడు.. చివరకు ఆమెకు దగ్గరయ్యాడు.. ఈ క్రమంలోనే ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు.. గుడిలో పెళ్లి చేసుకుని.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఏడేళ్ల క్రితం హైదరాబాద్ పరిధిలో జరిగిన ఘటనపై తాజాగా.. కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా గుడిలో పెళ్లి చేసుకొని అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.30వేల జరిమానా విధించింది. దీంతోపాటు బాధిత బాలికకు రూ.3లక్షల పరిహారాన్ని మంజూరు చేస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి హరీష శుక్రవారం తుది తీర్పును వెల్లడించారు.

అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత బర్ల చెప్పిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నేరెడుగొమ్ముకు చెందిన ఆలేటి ప్రభాకర్‌ (29) బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో నివాసం ఉండేవాడు.. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివాసముముంటున్న ప్రభాకర్‌ 2016లో బాధిత బాలిక(16) ను ప్రేమిస్తున్నట్లు మాయమాటలు చెబుతూ వెంటపడుతుండేవాడు.

ఈ క్రమంలో 2016 జూన్‌ 5న ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అనంతరం తుక్కుగూడలోని ఓ ఆలయంలో బలవంతంగా పెళ్లి చేసుకొని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు, బాధితురాలి కుటుంబసభ్యుల సమాచారంతో మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి.. జైలుకు తరలించారు. అప్పటి కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..