Telangana: సికింద్రాబాద్ నుంచి మరో స్పెషల్ ట్రైన్.. ఆ ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆగే స్టేషన్లు ఇవే!
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. సికింద్రాబాద్ నుంచి మరో ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే.
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. సికింద్రాబాద్ నుంచి మరో ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైలు(07018)ను ఏప్రిల్ 2వ తేదీన సికింద్రాబాద్ నుంచి అగర్తలకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఏప్రిల్ 2న (ఆదివారం) ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.. ఏప్రిల్ 4(మంగళవారం) రాత్రి 11. 15 గంటలకు అగర్తలకు చేరుకుంటుంది
నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, బెర్హంపూర్, ఖుర్డారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలసోర్, ఖరగ్‌పూర్, దంకుని, రాంపూర్ హట్, మల్దా టౌన్, కిషన్ గంజ్, న్యూ జలపాయిగురి, న్యూ కూచ్ బెహార్, న్యూ అలిపురందర్, న్యూ బంగో య్‌గాన్, వయా గాల్‌పరా టౌన్, కామాఖ్య, గువాహటి, న్యూ హాఫ్‌లాంగ్, బదర్‌పూర్ జంక్షన్, న్యూకరీంగంజ్, ధర్మసాగర్, అంబసా స్టేషన్లలో ఈ ట్రైన్ నడుస్తుంది. అలాగే ఇందులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్‌తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ సేవలను ప్రయాణీకులు వినియోగించుకోవాలని కోరారు.
One way Special Train between Secunderabad – Agartala pic.twitter.com/4ldruxUz83
— South Central Railway (@SCRailwayIndia) March 30, 2023