Hyderabad: హైదరాబాద్‌లో ఈడీ దాడుల కలకలం.. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో తనిఖీలు..
హైదరాబాద్‌లో ఈడీ దాడులు కలకలం రేపాయి. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పటాన్‌చెరు, మాదాపూర్‌లోని ఫార్మా కంపెనీ ఆఫీస్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఈడీ దాడులు కలకలం రేపాయి. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పటాన్‌చెరు, మాదాపూర్‌లోని ఫార్మా కంపెనీ ఆఫీస్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు జువెన్ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 20 రాష్ట్రాల్లో ఉన్న 100 కు పైగా కంపెనీలపై రైడ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇందులో 18 కంపెనీల లైసెన్సులను రద్దు చేశారు అధికారులు.. రద్దయిన ఫార్మా కంపెనీల లిస్ట్ లో హైదరాబాద్‌కి చెందిన ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి. ఔషధాల తయారీలో జరుగుతున్న అతిపెద్ద మోసాన్ని కేంద్ర ప్రభుత్వం బట్టబయలు చేసింది. నకిలీ, నాసిరకం ఔషధాలు తయారు చేస్తున్న కంపెనీలపై కొరడా ఝుళిపించింపింది. దేశంలోని 20 రాష్ట్రాల్లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మొత్తం వందకుపైగా కంపెనీలపై ఇటీవలే తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో పలు కంపెనీలు నాసిరకం ఔషధాలు తయారు చేస్తున్నట్లు గుర్తించింది. వాటిపై చర్యలు తీసుకుంది. మొత్తంగా 18 ఫార్మా కంపెనీల లైసెన్సులు రద్ద చేసింది కేంద్ర ప్రభుత్వం. నకిలీ, నాణ్యత లేని మందులను తయారు చేస్తున్నట్లు గుర్తించిన క్రమంలోనే లైసెన్సులు రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సెలాన్ ఫార్మా కంపెనీ లైసెన్స్ ను అధికారులు రద్దు చేశారు. క్యాన్సరు వ్యాధి భారిన పడుతున్న రోగులకు మందులను తయారుచేస్తుంది సెలాన్ కంపెనీ. లెబానన్, ఏహ్మాన్ టాబ్లెట్స్ తయారీకి సేలాన్ కంపెనీ పెట్టింది పేరు. అయితే ఇటీవల డబ్ల్యూహెచ్వో అలెర్ట్ తో రంగంలోకి దిగారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఉజ్బెకిస్తాన్ లో ఘటన తరువాత డబ్ల్యూ హెచ్ ఓ అలెర్ట్ తో నాసిరకం టాబ్లెట్ తయారీ కంపెనీ ల పై దాడులు చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. భారత్ లో నోయిడా లో తయారైన ఔషధాలు వాడి చిన్నారులు మరణించిన ఘటన తెలిసిందే.. నోయిడా లోని మేయిడెన్ ఫార్మా పై మొదట దాడి చేశాడు డ్రగ్ కంట్రోల్ అధికారులు.. అక్కడ ఉన్న ఔషధాలను పరిశీలించగా అందులో ఎతిలిన్ గ్లైకోల్, డీ ఎథిలిన్ గ్లైకోల్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మేడిన్ ఫార్మా కంపెనీ లైసెన్స్ ను రద్దు చేశారు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..