ఎయిర్‌పోర్టులో తేడాగా కనిపించిన ప్యాసింజర్‌.. షర్ట్ విప్పి చూసిన అధికారులు.. దెబ్బకు ఫ్యూజులౌట్..

విదేశాల నుంచి కొనసాగుతున్న అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. అక్రమార్కులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. అధికారుల దగ్గర అడ్డంగా బుక్కవుతున్నారు.

ఎయిర్‌పోర్టులో తేడాగా కనిపించిన ప్యాసింజర్‌.. షర్ట్ విప్పి చూసిన అధికారులు.. దెబ్బకు ఫ్యూజులౌట్..
Airport
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 01, 2023 | 9:28 AM

విదేశాల నుంచి కొనసాగుతున్న అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. అక్రమార్కులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. అధికారుల దగ్గర అడ్డంగా బుక్కవుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. స్మగ్లర్లకు కస్టమ్స్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా.. కేరళలోని కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లో వరుసగా మూడో రోజు బంగారం స్మగ్లింగ్ ను కస్టమ్స్ విఫలం చేసింది. తాజాగా.. విదేశాల నుంచి ఓ వ్యక్తి.. తత్తరగా కనిపించడంతో అధికారులు అతనిపై నిఘా వేశారు. అతన్ని ఆపి చెక్ చేశారు. చివరకు అతని నుంచి 50 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. ఈ బంగారం అంతా అతని షర్ట్ లోనే దొరికినట్లు అధికారులు తెలిపారు.

కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గ్రీన్ ఛానల్ ద్వారా బంగారం స్మగ్లింగ్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను వరుసగా మూడో రోజు తిప్పికొట్టినట్లు కొచ్చిన్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. శుక్రవారం దుబాయ్‌కి చెందిన ఓ ప్రయాణికుడు తన దుస్తులలో దాచిపెట్టిన 1.14 కిలోల బంగారంతో పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం మొత్తం షర్టులో దాచి ఉంచినట్లు అధికారులు తెలిపారు.

నిందితుడు పాలక్కాడ్‌కు చెందిన మణికందన్‌ గా గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్న అనంతరం అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద నాలుగు బంగారం ముద్దలను స్వాధీనం చేసుకున్నామని.. దీని విలువ సుమారు రూ.49.5 లక్షలు ఉంటుందని కస్టమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

కాగా.. అబుదాబికి చెందిన ఓ ప్రయాణికుడిని 1,063 గ్రాముల బంగారంతో గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఒకరోజు ముందు దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..