PM Modi: అందుబాటులోకి మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..

దేశంలోని పలు ప్రాంతాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇవ్వాల్టి నుంచి మరో వందేభారత్ ట్రైన్ సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీ-భోపాల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు.

PM Modi: అందుబాటులోకి మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..
Pm Modi
Follow us

|

Updated on: Apr 01, 2023 | 8:51 AM

దేశంలోని పలు ప్రాంతాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇవ్వాల్టి నుంచి మరో వందేభారత్ ట్రైన్ సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీ-భోపాల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో పర్యటించనున్నట్లు పీఎంఓ కార్యాలయం పేర్కొంది. భోపాల్-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును రాణి కమలాపతి స్టేషన్‌లో ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో కూడా మోడీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. శనివారం ఉదయం ప్రధాని మోడీ భోపాల్ చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. ఈ రైలు 708 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 7.45 గంటల్లో పూర్తి చేయనుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు భోపాల్‌లో ఉదయం 5.55 గంటలకు బయలుదేరి 11.40 గంటలకు ఆగ్రా చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ వందేభారత్‌ రైలు శనివారం మినహా ప్రతిరోజు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఢిల్లీ-భోపాల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈరోజు ఏప్రిల్ 3 నుంచి రాకపోకలు సాగిస్తుందని అధికారులు తెలిపారు. సీట్ల రిజర్వేషన్ ఈరోజు నుంచి ప్రారంభంకానుంది.

కాగా.. వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా వందేభారత్‌ సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ వందేభారత్ రైలుతో పదకొండు సర్వీసులు దేశంలో రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటివరకు కేంద్రం 10 రైళ్లను ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అత్యాధునికమైన‌ సౌకర్యాలు ఉన్నాయి. ఈ సెమీ హైస్పీడ్‌ రైలు గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోనుంది.

చివరి రోజు మోడీ ప్రసంగం..

కాగా.. కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. చివరి రోజు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో జాతీయ భద్రతకు సంబంధించిన పలు ప్రధాన అంశాలపై చర్చిస్తున్నారు. సాయుధ దళాల సన్నద్ధత ఆత్మనిర్భరత సాధించే దిశగా రక్షణ వ్యవస్థలో పురోగతే లక్ష్యంగా దీన్ని నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!