AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యో పాపం పెళ్లి కూతురు.. ! ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది..!

పెళ్లి రోజును ఎప్పటికీ గుర్తిండిపోయేలా ప్రత్యేక థీమ్స్, కాన్సెప్ట్‌లను ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఒక్కోసారి అందరినీ సంతోషపరుస్తుంటే, కొన్నిసార్లు అలాంటి ప్రయోగాలు అడ్డంకులు కలిగిస్తాయి.

Viral Video: అయ్యో పాపం పెళ్లి కూతురు.. ! ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది..!
Bride Pulls Off Gun Stunt
Jyothi Gadda
|

Updated on: Apr 01, 2023 | 7:23 PM

Share

పెళ్లి అనేది ఒక అందమైన సంబంధం. స్త్రీ పురుషులను కలిపే పవిత్ర బంధం. కష్టసుఖాల్లో ఇద్దరూ తమ జీవితాంతం కలిసి జీవించాలని నిర్ణయించుకుంటారు. ఆడమగ ఇద్దరి జీవితం ప్రారంభమైనప్పుడు, రెండు కుటుంబాలు కలిసిపోతాయి. పెళ్లిని ప్రత్యేకంగా చేయాలని అందరూ ప్రయత్నిస్తారు. ప్రత్యేక అలంకరణ, పాటలు, దుస్తులు, పార్టీ అన్నీ ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక ప్రత్యేకమైన రోజు. అందుకే ఈ రోజును చిరకాలం గుర్తుండిపోయేలా ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. అంతేకాదు పెళ్లి రోజును ప్రత్యేకంగా మార్చేందుకు ప్రత్యేక థీమ్స్, కాన్సెప్ట్‌లను ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఒక్కోసారి అందరినీ సంతోషపరుస్తుంటే, కొన్నిసార్లు అలాంటి ప్రయోగాలు అడ్డంకులు కలిగిస్తాయి. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగిన ఓ పెళ్లిలో చోటుచేసుకుంది. వధూవరులు తమ చేతుల్లో తుపాకులు పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంలో అనుకోని ప్రమాదం జరిగింది.

అదితి అనే వినియోగదారు వధువు ముఖంలో తుపాకీ పేలిన వైరల్ వీడియోను షేర్ చేశారు. 13 సెకన్ల క్లిప్‌లో, వధూవరులు వేదికపై పోజులివ్వడాన్ని చూడవచ్చు. దంపతుల చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వారు కాల్పులు జరిపిన వెంటనే తుపాకీ ఒకటి పేలి వధువు ముఖానికి తగిలింది. ఆమెను కాపాడేందుకు అందరూ పెనుగులాడుతుండగా ఆమె వెంటనే తుపాకీని కింద పడేసింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోపై ప్రజలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు లక్షకు పైగా వీక్షణలు వచ్చాయి. ప్రజలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యేకత ఉండాంటూ.. ఇలాంటి పిచ్చి పిచ్చి స్టంట్స్‌ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. వీడియో చూసి భయపడ్డాను అని మరొకరు చెప్పారు. వైరల్ కావడానికే జనాలు ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు అని మరొకరు వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి ‘పెళ్లికూతురు పరిస్థితి ఎలా ఉందని అడిగాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్