Banana Leaves : అరటి ఆకు నీటితో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు..! అవేంటో తెలుసా..?
అరటి ఆకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇన్ని పోషకాలు ఉన్న అరటి ఆకులను తీసుకోవడం వల్ల మన శరీరం అనేక వ్యాధుల నుండి విముక్తి పొందుతుందని నిపుణులు అంటున్నారు. అరటి ఆకులను ఎలా తినాలి..? ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
అరటి పండు మనకు, అరటి ఆకు జంతువులకు అని అనుకుంటాం. కానీ అరటి ఆకులో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. అరటి ఆకులను తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. పోషకాలు అధికంగా ఉండే పండ్లలో అరటి ఒకటి. మనం రోజూ అరటిపండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. అరటి పండు మాత్రమే కాదు, కాయలు, ఆకులు కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అరటి ఆకుల్లో శరీరానికి అవసరమైన పోషక, ఔషధ గుణాలు ఉన్నాయి. అరటి ఆకులో 60 శాతం నీరు ఉంటుంది. ఫైటోన్యూట్రియెంట్స్, సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫైబర్ ఉన్నాయి. అరటి ఆకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇన్ని పోషకాలు ఉన్న అరటి ఆకులను తీసుకోవడం వల్ల మన శరీరం అనేక వ్యాధుల నుండి విముక్తి పొందుతుందని నిపుణులు అంటున్నారు. అరటి ఆకులను ఎలా తినాలో, అరటి ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
అరటి ఆకు ఎలా తినాలి? : అరటి ఆకులను నేరుగా తినలేము..కాబట్టి అలా తినడానికి బదులు వాటిని డికాక్షన్‌గా తీసుకోవచ్చు. అరటి ఆకును చిన్న ముక్కలుగా కట్ చేసి, నీటిలో వేసి, ఈ నీటిని మరిగించాలి. బాగా మరిగిన నీటిని ఫిల్టర్ చేసుకుని తాగేయాలి. ఇది తినడానికి చాలా సులభమైన మార్గం. ఇలా చేయడం కష్టంగా ఉన్నవారు అరటి ఆకును నమిలి దాని రసాన్ని మింగేయొచ్చు. కొందరు అరటి ఆకుతో టీ తయారు చేసి తాగుతారు.
అరటి ఆకులను మరిగించిన నీటిని త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
అరటి ఆకు మరిగించిన నీటితో రోగనిరోదక శక్తి పెరుగుతుంది: అరటి ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి మీ శరీరాన్ని రక్షించడానికి పనిచేస్తుంది. అరటి ఆకులోని నీటిని నిత్యం తాగితే శరీరంలో ఎలాంటి రోగాలు వచ్చినా త్వరగా కోలుకుంటారు.
అరటి ఆకు నీరు చర్మ ఆరోగ్యానికి ఉత్తమం: శరీరానికి నీరు చాలా ముఖ్యం. అరటి ఆకు నీరు చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడుతుంది. చర్మంపై కనిపించే దద్దుర్లు, అలర్జీ సమస్యను తొలగిస్తుంది.
పొట్ట ఆరోగ్యానికి మంచిది: మన జీర్ణక్రియ సక్రమంగా ఉంటే సగం రోగాలు దూరమవుతాయి. అరటి ఆకు మన ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మీకు ఏదైనా జీర్ణ సంబంధ సమస్య ఉన్నట్లయితే మీరు దీనిని తినవచ్చు.
పేగు పుండును తగ్గిస్తుంది (అల్సర్): పేగులో మంట లేదా గాయం ఏర్పడినప్పుడు, అరటి ఆకు నీరు దానిని నయం చేస్తుంది. ఇది గొంతులో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచడానికి పనిచేస్తుంది.
అరటి ఆకు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి పనిచేస్తుంది: అరటి ఆకులను ఉడకబెట్టడం, వాటిని తాగడం మీ శరీరాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. అరటి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం…