Weather: ఈసారి ఎండలు మాములుగా ఉండవు..ఏప్రిల్ నుంచి జూన్ వరకు హీట్ వేవ్

ఈసారి వేసవికి ఎండలు మరింత పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

Weather: ఈసారి ఎండలు మాములుగా ఉండవు..ఏప్రిల్ నుంచి జూన్ వరకు హీట్ వేవ్
Summer
Follow us
Aravind B

|

Updated on: Apr 01, 2023 | 9:37 PM

ఈసారి వేసవికి ఎండలు మరింత పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడునెలల కాలంలో సెంట్రల్, తూర్పు, వాయువ్య రాష్ట్రాల్లో హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. బిహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యాణా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మార్చి నెలలో అకాల వర్షాలు పడటంతో గోధుమలు, ఆవాలు, ఉల్లి లాంటి పలు పంటలు దెబ్బతిన్నాయని..ఆ నెలలో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మోహపత్ర తెలిపారు. ఇప్పడు పంటలు ఆరిపోవాలని రైతులు సూర్యరశ్మీని కోరుతున్నప్పటికీ..ఇప్పుడు హీట్ వేవ్ వల్ల వారి పంటల దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏప్రిల్ లో ఎండలు పెరగనున్న నేపథ్యంలో ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లను ఎక్కువగా వినియోగించడం వల్ల కరెంట్ డిమాండ్.. గరిష్ఠ స్థాయికి చేరుకుని కొత్త రికార్డు సృష్టిస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ అంచనావేస్తుంది. దేశీయ బొగ్గు సరిపోయే అవకాశం లేనందున విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ఇప్పటికే పవర్ ప్లాంట్లకు కూడా ఆదేశాలు జారీచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..