AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bathukamma Song: బాలీవుడ్‌లో బతుకమ్మ.. సల్మాన్‌ సినిమా నుంచి తెలంగాణ పాట రిలీజ్‌.. అదరగొట్టిన బుట్టబొమ్మ

తాజాగా బాలీవుడ్ సినిమాలో మన బతుకమ్మ సాంగ్ వినిపించింది.  తెలంగాణ సంప్రదాయ జానపద గీతం బతుకమ్మ బాలీవుడ్ కు చేరింది. సల్మాన్‌ ఖాన్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో తెలంగాణ పువ్వుల పండగ బతుకమ్మ పాటను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది...

Bathukamma Song: బాలీవుడ్‌లో బతుకమ్మ.. సల్మాన్‌ సినిమా నుంచి తెలంగాణ పాట రిలీజ్‌.. అదరగొట్టిన బుట్టబొమ్మ
Salman Khan, Pooja Hegde, Venkatesh
Basha Shek
|

Updated on: Mar 31, 2023 | 2:04 PM

Share

రీసెంట్ డేస్ లో తెలంగాణ నేపథ్యంలో సినిమాలు.. తెలంగాణ యాసలో సినిమాలు ఎక్కవగా వస్తున్నాయి. చాలా మంది హీరోలు తెలంగాణ యాసలో మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వచ్చిన దసరా సినిమా కూడా తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమానే.. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా బాలీవుడ్ సినిమాలో మన బతుకమ్మ సాంగ్ వినిపించింది.  తెలంగాణ సంప్రదాయ జానపద గీతం బతుకమ్మ బాలీవుడ్ కు చేరింది. సల్మాన్‌ ఖాన్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో తెలంగాణ పువ్వుల పండగ బతుకమ్మ పాటను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఈ బతుకమ్మ పాటకి కేజీఎఫ్‌ ఫేమ్‌ రవిబస్రూర్‌ సంగీతం అందించారు. బతుకమ్మ పాటను సల్మాన్‌ , పూజ హెగ్డే తో పాటు, వెంకటేష్‌ , భూమిక పై చిత్రీకరించింది చిత్ర యూనిట్. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా తెరెక్కించిన ఈ పాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా తమిళంలో సూపర్‌ హిట్టయిన ‘వీరమ్‌’కు రీమేక్‌గా. తెలుగులో ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్బింగ్ అయింది. ఆతర్వాత పవన్‌ కల్యాణ్‌ హీరోగా కాటమరాయుడిగా తెలుగులో తెరకెక్కింది. ఇక సల్మాన్‌ ఖాన్‌ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి ప్రసాద్‌, రవి బస్రూర్‌, హిమేశ్ రేషమ్మియా సంగీత దర్శలుగా వ్యవహరిస్తున్నారు. రామ్‌చరణ్‌ కూడా ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..