AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha-Indian Idol Telugu: ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగర్స్ పై బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ ప్రశంసలు.. ఆమె గాత్రానికి శ్రేయా ఘోషల్ ఫిదా..

ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2’కు విశేష ఆదరణ లభిస్తోంది. తాజాగా కంటెస్టెంట్స్ ప్రతిభను చూసి బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ హిమేష్ రేష్మియా, శ్రేయా ఘోషల్, విశాల్ డడ్లాని ఆశ్చర్యపోయారు. తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్ టాలెంట్ చూసి ఫిదా అయ్యారు.

Aha-Indian Idol Telugu: 'తెలుగు ఇండియన్ ఐడల్' సింగర్స్ పై బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ ప్రశంసలు.. ఆమె గాత్రానికి శ్రేయా ఘోషల్ ఫిదా..
Telugu Indian Idol
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2023 | 2:48 PM

Share

ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ఆడియన్స్ ముందుకు తీసుకవస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆహాలో సూపర్ హిట్ అయిన షోలలో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. అద్భుతమైన టాలెంట్ ఉండి.. నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ ఫామ్ కోసం ఎదురుచూసే యువ గాయనీగాయకులకు మంచి ఛాన్స్ ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికితీస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇందులో నిర్వహించిన మొదటి సీజన్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్నింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2’కు విశేష ఆదరణ లభిస్తోంది. తాజాగా కంటెస్టెంట్స్ ప్రతిభను చూసి బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ హిమేష్ రేష్మియా, శ్రేయా ఘోషల్, విశాల్ డడ్లాని ఆశ్చర్యపోయారు. తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్ టాలెంట్ చూసి ఫిదా అయ్యారు.

సంగీతానికి ఎల్లలు లేని ఒక ప్రపంచ స్థాయి భాష. అదే నేడు తెలుగు ఇండియన్ ఐడల్ అనే విశ్వవేదికపై యువ గాయకులు తమ ప్రతిభను చాటేందుకు దోహదపడుతోంది. ఇప్పుడు తెలుగుపాట ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువారి చెవికి చేరుతోంది. ఈ షో లో ప్రస్తుతం ఉన్న టాప్ 11 కంటెస్టెంట్స్ తమ మధురగానంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు. సామన్య ప్రేక్షుకులే కాకుండా ఎంతో మంది సినీ సంగీత ప్రముఖులు వీరి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు.

ఇటీవల పోటీలో భాగంగా నిర్వహించిన గాలా విత్ బాలా ఎపిసోడ్‏లో సౌజన్య భాగవతుల అనే కంటెస్టెంట్ ఆలపించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోని ‘ఎంకిమీడ నా జతవిడి…’ సాంగ్ విన్న ప్రముఖ గాయని శ్రేయాఘోషల్ సంతోషం వ్యక్తం చేశారు. సౌజన్య గాత్రం అత్యంత మధురంగా ఉందంటూ కితాబిచ్చారు. ఆ చిత్రంలో ఒరిజినల్ పాటను శ్రేయానే ఆలపించారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ సంగీతకారులు విశాల్ దద్లాని, హిమేష్ రేషిమియా షోకు వస్తున్న ఆదరణను ప్రశంసించారు. ఈ షో ఇలాగే దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించి, కంటెస్టెంట్స్ కు అల్ ది బెస్ట్ చెప్పారు.

షో గురించి ఆహా మార్కెటింగ్ హెడ్ కార్తీక్ కనుమూరు మాట్లాడుతూ ” తెలుగు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్స్ తమ గాత్రంతో యావత్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందండం చాలా సంతోషంగా ఉంది. ఆహా ఓటీటీ ఈ షో ద్వారా ప్రతిభావంతులైన గాయకులను ప్రపంచానికి పరిచయం చేయడంలో విజయవంతమౌతుంది. రానున్న రోజుల్లో ఈ షో ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు తెలుగు సంగీత ప్రపంచంలో తమ స్థానాన్ని సుస్ధిరపరుచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు” అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కార్యక్రమం ప్రతి శక్ర, శని వారాల్లో రెండు ఎపిసోడ్లుగా రాత్రి 7 గంటల నుంచి ఆహాలో ప్రసారం అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!