Aha Godari: ఆహాలో సరికొత్త జర్నీ.. గోదావరి జన్మస్థలం నుంచి సముద్రంలో సంగమం వరకూ.. ఆహా గోదారిలో నిక్షిప్తం..

ఓటీటీ రంగంలో వేగంగా దూసుకుపోతున్న ఆహా సంస్థ.. ఆహా గోదారి పేరుతో గోదావరి విశిష్టత, నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చింది.

Aha Godari: ఆహాలో సరికొత్త జర్నీ.. గోదావరి జన్మస్థలం నుంచి సముద్రంలో సంగమం వరకూ.. ఆహా గోదారిలో నిక్షిప్తం..
Aha Godari
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2023 | 12:15 PM

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా.. డిఫరెంట్ కథలు, కథనాలతో భిన్నమైన ప్రోగ్రామ్స్ తో తెలుగువారి ఆదరాభిమానాలను సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆహా సారికొత్త ప్రోగ్రాంతో శ్రీ రామ నవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.      ఆహా తన మొట్టమొదటి డాక్యుమెంటరీ ‘ఆహా గోదారి’ని మార్చి 30న విడుదల చేసింది.  ఓటీటీ రంగంలో వేగంగా దూసుకుపోతున్న ఆహా సంస్థ.. ఆహా గోదారి పేరుతో గోదావరి విశిష్టత, నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చింది. స్వాతి దివాకర్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ గోదావరి నది కథ, దాని ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రేక్షకులను అలరించింది

గోదావరి నది తన జన్మస్థలమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుండి తన జర్నీని మొదలు పెట్టుకుని తెలంగాణ,  ఆంధ్ర ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రవహిస్తూ.. సస్యశ్యామలం చేస్తూ.. చివరికి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. ఇలా గోదావరి నది సాగించిన ప్రయాణాన్ని … తీరప్రాంత ప్రజల ప్రత్యేక సంస్కృతులు, మత విశ్వాసాలను హైలైట్ చేస్తూ.. ఈ డాక్యుమెంటరీలో ఆవిష్కరించారు దర్శకులు. గోదారి నది తన  ప్రవాహ ప్రయాణంలో వివిధ రకాల ప్రాంతాలు, మనుషులు, యాసలు, భాషలు, పుణ్యక్షేత్రాలను పలకరిస్తూ, పరవశిస్తూ వారి జీవితాల్లో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ విశేషాలన్నిటిని ఆహా గోదారి డాక్యుమెంటరీలో నిక్షిప్తం చేసింది.

ఇవి కూడా చదవండి

నేటి తరానికి వినోదం వంటి కార్యక్రమాలను మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రాదయాలను, అద్భుతమైన ప్రకృతి సంపద, పురాతన కట్టడాల గురించి పరిచయం చేసే వినూత్న కార్యక్రమానికి ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీ శ్రీకారం చుట్టింది ఆహా యాజమాన్యం అని వీక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..