AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు మన్నత్‌తో పాటు, విదేశాల్లో లగ్జరీ విల్లాస్.. వేల కోట్ల ఆస్తులు కింగ్ ఖాన్ సొంతం..

కింగ్ ఖాన్ మన్నాత్ యజమాని. అయితే షారుఖ్ ఖాన్ కు దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా అనేక విలాసవంతమైన ఇళ్ళు ఉన్నాయి. ఏయే దేశాల్లో షారుఖ్ ఖాన్ ఇల్లు కొనుగోలు చేశాడో తెలుసుకుందాం.. 

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు మన్నత్‌తో పాటు, విదేశాల్లో లగ్జరీ విల్లాస్.. వేల కోట్ల ఆస్తులు కింగ్ ఖాన్ సొంతం..
Shah Rukh Khan
Surya Kala
|

Updated on: Mar 26, 2023 | 10:05 AM

Share

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ఆస్తులు, అంతస్తులు, ఆడంబరం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే షారుఖ్ ఖాన్ ఈ స్టేజ్ పుట్టుకతోనో అకస్మాత్తుగా చేరుకోలేదు. ఇలా ఈ స్టేజ్ కు చేరుకోవడానికి షారుఖ్ ఖాన్ చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు. బుల్లి తెర నుంచి వెండి తెరపై అడుగు పెట్టాడు.. సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదగడం వెనుక నిరంతర కృషి, పట్టుదల ఉంది. షారుక్ తన కెరీర్ తొలినాళ్లలో గౌరీతో కలిసి ముంబైలోని ఓ ఫ్లాట్‌లో నివసించేవాడు. అనంతరం తాను కల కన్న మన్నత్‌ను తన సొంతం చేసుకున్నాడు. నేడు కింగ్ ఖాన్ మన్నాత్ యజమాని. అయితే షారుఖ్ ఖాన్ కు దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా అనేక విలాసవంతమైన ఇళ్ళు ఉన్నాయి. ఏయే దేశాల్లో షారుఖ్ ఖాన్ ఇల్లు కొనుగోలు చేశాడో తెలుసుకుందాం..

దుబాయ్‌లో విలాసవంతమైన విల్లా ఉంది

షారూఖ్ ఖాన్ దుబాయ్ బ్రాండ్ అంబాసిడర్. అతనికి అక్కడ విలాసవంతమైన విల్లా కూడా ఉంది. కింగ్ ఖాన్ విల్లా పేరు ‘సిగ్నేచర్’. అతని విల్లా దుబాయ్‌లోని జన్నత్ పామ్ జుమేరా బీచ్‌లో ఉంది. షారుక్‌కి చెందిన ఈ విల్లాలో 6 గదులు ఉన్నాయి. ఈ విలాసవంతమైన విల్లా 8,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ విల్లా ఖరీదు 200 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

లండన్‌లో ఇల్లు

లండన్‌లోని పార్క్ లేన్ రీజియన్ సమీపంలో షారుఖ్ ఖాన్‌కు విలాసవంతమైన భవనం ఉంది. లండన్ కు షారుఖ్ తన ఫ్యామిలీతో కలిసి హాలీడేవ్ ను గడపడానికి వెళ్తుంటాడు. ఇక్కడ ఉన్న విల్లా కోసం షారూఖ్ రూ.172 కోట్లు చెల్లించినట్లు సమాచారం.

లాస్ ఏంజిల్స్‌లో విలాసవంతమైన గృహాలు 

బాలీవుడ్ బాద్ షాకు లాస్ ఏంజిల్స్‌లో విలాసవంతమైన వెకేషన్ హోమ్ కూడా ఉంది. 2019లో షారూఖ్ ఖాన్ విలాసవంతమైన ఇంటికి సంబంధించిన కొన్ని చిత్రాలను పోస్ట్ చేశారు. ఆరు విశాలమైన బెడ్‌రూమ్‌లతో పాటు, బెవర్లీ హిల్స్ విల్లాలో జాకుజీ, ప్రైవేట్ కాబానాస్,  పెద్ద కొలను వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఈ ఇంటికి అద్దెకు కూడా ఇస్తారు. ఈ విల్లాలో ఒక రాత్రిగడపాలంటే.. అద్దె రూ.1.96 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

షారుక్ ఖాన్ ఆస్తుల నికర విలువ

2023 సంవత్సరానికి సంబంధించిన సర్వే ప్రకారం..  ప్రపంచంలోని అత్యంత సంపన్న నటుల జాబితాలో షారుఖ్ ఖాన్ పేరు చేర్చబడింది. నివేదిక ప్రకారం.. కింగ్ ఖాన్ మొత్తం ఆస్తి దాదాపు 700 మిలియన్ డాలర్లు ఉంటుందని తెలుస్తుంది. అంటే భారతదేశం కరెన్సీలో షారుక్ ఖాన్ రూ. 6,289 కోట్లకు పైగా యజమాని. సర్కస్ సీరియల్ లో నటించిన షారుఖ్ ఖాన్ వెండి తెరపై అడుగు పెట్టి.. కెరీర్ మొదట్లో దొరికిన పాత్రల్లో నటిస్తూ.. స్టార్ హీరోగా బాలీవుడ్ బాద్షా ఖ్యాతిగాంచాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us