AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj: ముగ్గురు మోడీల ఫొటోలతో ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్‌.. ఘాటు రిప్లై ఇచ్చిన బీజేపీ నేత

ఎవరైతే నాకేంటి? ఎవరేమనుకుంటే నాకేంటి?. నేను మోనార్క్‌ని! నాకనిపించిందే చెబుతా!. అయినా నేనడిగేది జస్ట్‌ జనరల్‌ నాలెడ్జ్‌ క్వశ్చనే. ఇందులో కాంట్రవర్సీ ఏముంది? మీకు తెలిస్తే చెప్పండి! అంటూ ప్రకాష్‌రాజ్‌ వదిలిన ముగ్గురు మోడీల ఫొటో ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది.

Prakash Raj: ముగ్గురు మోడీల ఫొటోలతో ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్‌.. ఘాటు రిప్లై ఇచ్చిన బీజేపీ నేత
Prakash Raj On Modi
Surya Kala
|

Updated on: Mar 26, 2023 | 6:26 AM

Share

జస్ట్‌ ఆస్కింగ్‌, ఇది కేవలం జనరల్‌ నాలెడ్జ్‌ క్వశ్చన్‌ మాత్రమే. లలిత్‌మోడీదీ, నరేంద్రమోడీ, నీరవ్‌మోడీ… ఈ ముగ్గురిలో కామన్‌గా ఉన్నదేంటి?. చెప్పుకోండి చూద్దామంటూ మరో కాంట్రవర్సీకి తెరలేపారు ప్రకాష్‌రాజ్‌. రాహుల్‌ కామెంట్స్‌ని మరోసారి గుర్తుచేస్తూ ప్రకాష్‌రాజ్‌ పెట్టిన ఈ ట్వీట్‌ ఇప్పుడు కల్లోలం రేపుతోంది.

ఎవరైతే నాకేంటి? ఎవరేమనుకుంటే నాకేంటి?. నేను మోనార్క్‌ని! నాకనిపించిందే చెబుతా!. అయినా నేనడిగేది జస్ట్‌ జనరల్‌ నాలెడ్జ్‌ క్వశ్చనే. ఇందులో కాంట్రవర్సీ ఏముంది? మీకు తెలిస్తే చెప్పండి! అంటూ ప్రకాష్‌రాజ్‌ వదిలిన ముగ్గురు మోడీల ఫొటో ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. లలిత్‌మోడీ, నరేంద్రమోడీ, నీరవ్‌మోడీ… ఈ ముగ్గురిలో కామన్‌గా ఉన్నదేంటి? చెప్పుకోండి చూద్దామంటూ ఫజిల్‌ పెట్టారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పరోక్షంగా మద్దతు పలుకుతూ ప్రకాజ్‌రాజ్‌ చేసిన ఈ ట్వీట్‌ కలకలం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

దీనికి ముందు, రాహుల్‌గాంధీపై అనర్హత వేటేస్తూ లోక్‌సభ విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు ప్రకాష్‌రాజ్‌. ప్రియమైన పౌరులారా ఇలాంటి రాజకీయాలకు సిగ్గుపడాలి!. మౌనంగా ఉంటే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దేశం కోసం మాట్లాడే సమయం వచ్చిందంటూ ట్వీట్‌ చేశారు. ప్రకాష్‌రాజ్‌ చేసిన ఈ ట్వీట్స్‌ అన్నీ ఇప్పుడు వైరల్‌గా మారాయ్‌. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రకాష్‌రాజ్‌ ట్వీట్స్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి. లలిత్‌మోడీ, నీరవ్‌మోడీ.. ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్‌ హయాంలోనే స్కామ్‌లు చేశారన్న సంగతి మర్చిపోవద్దని గుర్తుచేశారు. ఇక, నరేంద్రమోడీ కాంగ్రెస్‌ అరాచకాలను ఎదుర్కొని దేశం గర్వించదగ్గ నేతగా ఎదిగారని, ఈ మూడింటిలో కామన్‌గా ఉన్నది కాంగ్రెస్‌ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు విష్ణువర్ధన్‌రెడ్డి.

ఇక, రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్‌. ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో సోనియా, రాహుల్‌ దీక్ష చేయనున్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టబోతున్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి… గాంధీభవన్‌లో గాంధీ విగ్రహం ముందు దీక్షకు దిగనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..