TOP 9 ET News: ప్లీజ్ నన్ను బతకనివ్వండి: మనోజ్ | బాలీవుడ్ ప్రొడ్యూసర్‌తో.. NTR బడా ప్లాన్..
ఏదైనా ఆగుతుంది కానీ.. సోషల్ మీడియాకెక్కిన వీడియో మాత్రం ఆగుతుందా..! ఆగదు కదా.. డిలీట్ చేసినా..పోస్ట్ తీసేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది కదా! అన్నదమ్ముల మధ్య ఓ గొడవ..
వెల్ కమ్ టూ టాప్ 9 ఈటీ షో. మోస్ట్ ట్రెండింగ్.. అండ్! లేటెస్ట్ హాటెస్ట్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..!
01.manchu manchu manoj and vishnu clashes
‘ప్లీజ్ నన్ను బతకనివ్వండి’ మంచు మనోజ్ షాకింగ్ ట్వీట్
ఏదైనా ఆగుతుంది కానీ.. సోషల్ మీడియాకెక్కిన వీడియో మాత్రం ఆగుతుందా..! ఆగదు కదా.. డిలీట్ చేసినా..పోస్ట్ తీసేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది కదా! అన్నదమ్ముల మధ్య ఓ గొడవ జరుగుతుందనే విషయం అయితే బయటికైతే వచ్చేసింది కదా..! ఇదే న్యూస్‌తో.. సోషల్ మీడియా మొత్తం రచ్చరచ్చ అవుతోంది కదా..! అయితే ఇంత రచ్చ మధ్యలో.. తాజాగా మంచు మనోజ్ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.
02. #1YearOfHistorical RRR
హ్యాపీ రిలీజ్ డే టూ RRR
ఆస్కార్ అందుకున్న ఫిల్మ్ గా హిస్టరీకెక్కిన మన ట్రిపుల్ ఆర్‌కు.. హ్యాపీ రిలీజ్ డే!. హ్యాపీ రిలీజ్ డే ఏంటని అనుకుంటున్నారా..! ఇది కూడా బర్త్‌డే లాగే.! ఈ సినిమా రిలీజైంది ఈ రోజే! అందుకే నెట్టింట ఎక్కడ చూసినా.. మళ్లీ కనిపిస్తోంది ట్రిపుల్ ఆర్ కథే!
03. Allu Arjun in New look and he spotted at mumbai airport
బన్నీ హి ఈజ్ ద మ్యాచో మ్యాన్! బన్నీ హి ఈజ్ ఏ రాకింగ్ మ్యాన్! బన్నీ హి గాట్ ది స్టైల్ ఆఫ్ ది ఫ్యూచర్! బన్నీ హి ఆటిట్యూడే ఫైర్! బన్నీ బ.. బ… బ.. బన్నీ! ఏంటి అప్పుడెప్పుడో వచ్చిన బన్నీ ఇంట్రోను ఇప్పుడు గుర్తు చేస్తుందేంటీ పిల్ల అని అనుకుంటున్నారా..! నేను కాదు.. మనోడే గుర్తు చేస్తున్నాడు. కిర్రాక్ లుక్స్‌లో… కనిపించి బన్నీ పాటనే పాడేలా చేస్తున్నాడు.
04. RRR Writer Vijayendra Prasad Comments on Pushpa
అరె! అంత పెద్ద రైటర్ కదా.. ! హాలీవుడ్ స్టోరీ టెల్లర్స్ కూడా ఆయన కథను.. అప్రిషియేట్ చేశారు కదా..! బాలీవుడ్ బడా హీరోలు కూడా తనతో కథ రాయించుకోడానికి వెంబడి పడుతున్నారు కదా..! అలాంటి ఆయన ఓ సినిమా చూసి.. ఆ సినిమాలోని కథను చూసి వణకడం ఏంటి? అసలు విషయం ఏంటి? తెలుసుకోండి!
05. Jr Ntr Deal With Popular Bollywood Producer
“ఎవరూ ఊరికే రారు! ఎవరూ ఊరికే వెళ్లరు? ఏదో మత్‌లబ్ ఉండే ఉంటుంది. ఇంకేదో పెద్దగానే జరగబోతోంది. ఈ సారీ దద్దరిల్లిపోవడం ఖాయంగా ఉంది!” ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి నెటిజెన్స్ అంటున్న మాటల్స్. చేస్తున్న కామెంట్స్ ! మరి మన హీరోను ఇలా ఎందుకంటున్నారని అంటారా? అది తెలియాలంటే ఈ స్టోరీని చూసేయండి!
06. censor board conditions nani dasara movie
నాని దసరాకు సెన్సార్ బోర్డ్ భారీ ఝలక్
సినిమా తీసుడు మాత్రమే కాదు.. సెన్సార్ సర్టిఫికేట్ పొందుడు కూడా పెద్ద లెక్కే! ఇప్పుడా లెక్క దగ్గరే దసరా ధరణిగాడు.. గాడి తప్పిండట! అందేటి సెన్సార్స్ ఎప్పుడో అయిందని నువ్వే చెప్పితివి కదా.. మళ్లీ గీ కిరాకాసేందని అంటారా? అయితే పురాగ గీ ముచ్చటినండి!
07. Actor Nani Reacts about His Controversies and troll in social media
శక్తి కనిపించనట్టు..! గాలి కనిపించనట్టు..! పుట్టే వేడి కూడ కనిపించనట్టు..! మన నోటి నుంచి వచ్చే మాట కూడా కనిపించకపోవచ్చు! అది వెళ్లే తీరు..! మారే రూపు..! చేసే డ్యామేజు కూడా మన కంటికి ఆనకపోవచ్చు. కానీ మొత్తానికైతే ఎలాగోలా మన బుర్రకు తెలుస్తుంది. అసలు విషయం ఇదని చెప్పాల్సి వస్తుంది. నాని కూడా సేమ్ ఇదే జరిగింది.
08. Samantha About Allu Arha
పువ్వు పుట్టగానే పరిమిలిస్తుందన్న లైన్ ఇప్పుడీ క్యూటీకే సెట్ అవుతోంది. లేకపోతే ఏంటండి! పాన్ ఇండియన్ సమంత చేతే చప్పట్లు కొట్టించుకుంది ఈ చిన్నారి! ఇంతకీ ఎవరా చిన్నారీ.. ఇంకెవరు అల్లు అర్జున్ గారాల మొల్లి. అర్హ బేబీ!
08. Nani Dasara Promo
దసరా అంటే పండట.. తెలంగాణలో పెద్ద పండట! ఆ పండగ పేరుతో.. వస్తున్న సినిమానే.. దసర! నానీస్ దసర.! ఇప్పటికే హైఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా అతి తొందర్లో మన ముందుకు రాబోతోంది. అందుకోసమే.. ఈ మూవీ టీం మార్చ్ 26 సాయంత్రం 6 గంటలకు లో టీవీ9 యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మీకు దసరా అంటే ఏంటో చూపించబోతోంది. సో వాచ్ అండ్ ఎంజాయ్ ఓన్లీ ఆన్ టీవీ9
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో